Allu Arjun: ఇండియన్ ఐడల్ వేదికపై భార్య గురించి బన్నీ ఏమన్నారంటే!
ABN , First Publish Date - 2023-06-05T12:27:47+05:30 IST
‘భర్త అనేవాడు భార్యకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. నేను కూడా నా భార్యకు అండగా ఉంటాను. తనకు మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనిపిేస్త తప్పకుండా చేయమని చెబుతా’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆహా ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతోన్న మ్యూజిక్ రియాల్టీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ సీజన్ ఆదివారంతో ముగిసింది.
‘‘భర్త అనేవాడు భార్యకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. నేను కూడా నా భార్యకు అండగా ఉంటాను. తనకు మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనిపిస్తే తప్పకుండా చేయమని చెబుతా ’’ అని అల్లు అర్జున్ (Allu arjun) అన్నారు. ఆహా ఓటీటీలో (Aha ott) స్ర్టీమింగ్ అవుతోన్న మ్యూజిక్ రియాల్టీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ సీజన్ ఆదివారంతో ముగిసింది. రెండో సీజన్‌లో గాయని సౌజన్య విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా హాజరైన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఈ సీజన్‌కు విజేతగా నిలిచిన సౌజన్యకు టైటిల్‌తో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలేలో ‘ఏదో ప్రియరాగం వింటున్నా’, ‘బూచాడే’, ‘సామీ సామీ’ పాటలతో అలరించారు సౌజన్య. సౌజన్య పాటలకు ఫిదా అయిన బన్నీ ఆమెను ప్రశంసించారు. (allu sneha reddy)
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘సౌజన్య టైటిల్ గెలుచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే, పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించడం సాధారణంగా జరుగుతుంది. కానీ భర్త అత్తింటి వాళ్లు సపోర్ట్ చేస్తే ఒక మహిళ గొప్ప విజయాలు అందుకోవచ్చని సౌజన్య నిరూపించారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మీరు సింగింగ్‌కు గ్యాప్ ఇవ్వలేదు. వచ్చింది అంతే. ఇకపై గ్యాప్ ఉండదు మీరు పాడుతున్న విధానం తెలుగు భాషలోపై మీకున్న పట్టును మెచ్చుకోవాలి. నాకు మీపై ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది’’ అని అన్నారు బన్నీ. (Indian idol winner sowjanya)
భర్త సపోర్ట్ చాలా ముఖ్యం...
‘‘ఒక తల్లిగా సౌజన్య రెండేళ్ల వయసున్న పాపను, కుటుంబాన్ని చూసుకుంటూనే మీ కలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అలాగే, సౌజన్య ఈ స్థాయికి రాగలిగారంటే ఆమె భర్తను, అత్తింటి వారిని మెచ్చుకోవాలి. భర్త అనేవాడు భార్యకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. నేను కూడా నా భార్యకు అండగా ఉంటాను. తనకు మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనిపిేస్త తప్పకుండా చేయమని చెబుతా. నా భార్యకు ఫొటోషూట్ కంపెనీ ఒకటి ఉంది. అందులో మీ పాపకు, ఫ్యామిలీ మొత్తానికి ఫొటోషూట్‌కు నేను ఛాన్స్ ఇస్తున్నాను’’ అని బన్నీ చెప్పారు.
‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో ‘గుండెలోన...’ పాటను ఆలపించి గుర్తింపు తెచ్చుకున్న సౌజన్య వైజాగ్‌లో పుట్టారు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఎన్నో సంగీత పోటీలో పాల్గొన్నారు. పెళ్లై ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత సంగీతాన్ని కాస్త దూరం పెట్టారు. ఈ క్రమంలో భర్త అండగా నిలవడంతో కెరీర్‌పరంగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో అడుగుపెట్టారు. ఈ సీజన్‌లో ఆమె ఎంచుకున్న పాటలు, పాడిన విధానం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. సీజన్ మొదలైన మూడు, నాలుగు ఎపిసోడ్ల తర్వాత నుంచి వ్యూవర్స్ ఎవరు గెలుపొందుతారనే విషయంపై ఓ అంచనాకువచ్చారు. ఎక్కువగా సౌజన్య పేరు వినిపించింది. సంగీత ప్రియులు కోరుకున్నటుగానే ఆమె విజేతగా నిలిచారు. అలాగే ఈ షోలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన జయరాజ్ రూ.3లక్షలు, , సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్యకు రూ. 2 లక్షల చెక్‌ను అందుకున్నారు.