Allu Arjun: నాకు అత్యాశ... అన్నీ కావాలి..

ABN , First Publish Date - 2023-08-27T16:44:25+05:30 IST

ఏ ఒక్క రాయి పర్వతాన్ని చేయలేదు... విజయం కూడా అలాంటిదే’ ఇది ఎవరో అన్న మాట కాదు. అల్లు అర్జున్‌ తన ఆఫీస్‌ గోడపై రాయించుకున్న సూక్తి ఇది. ఖాళీ సమయంలో ఆయన ఇలాంటివి ఎన్నో రాస్తుంటారట. ఇదే ప్రశ్న ఆయన్ను అడిగితే ‘‘నా ఆలోచనల్ని రాసుకునే అలవాటు ఉంది. నా అనుభవాల నుంచి వచ్చిన ఆ వాక్యాలు స్ఫూర్తిదాయకంగా అనిపించడంతో గోడపై రాయించా.

Allu Arjun: నాకు అత్యాశ... అన్నీ కావాలి..

‘ఏ ఒక్క రాయి పర్వతాన్ని చేయలేదు... విజయం కూడా అలాంటిదే’ ఇది ఎవరో అన్న మాట కాదు. అల్లు అర్జున్‌(Allu arjun) తన ఆఫీస్‌ గోడపై రాయించుకున్న సూక్తి ఇది. ఖాళీ సమయంలో ఆయన ఇలాంటివి ఎన్నో రాస్తుంటారట. ఇదే ప్రశ్న ఆయన్ను అడిగితే ‘‘నా ఆలోచనల్ని రాసుకునే అలవాటు ఉంది. నా అనుభవాల నుంచి వచ్చిన ఆ వాక్యాలు స్ఫూర్తిదాయకంగా అనిపించడంతో గోడపై రాయించా. సినిమాల కోసం రాేస ఆలోచన మాత్రం లేదు. కాకపోతే నా భావాలు నా పాత్రల్లో కనిపిస్తాయి’’ అని సమాధానమిచ్చారు. ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అలందుకున్న ఆనందం, ప్రశంసలతో తడిసి ముద్దవుతున్నారు అల్లు అర్జున్‌. (Best Actor)

నా మనవడు సాధించాడు అని...

‘ఇలాంటి సమయంలో మీ తాతయ్య అల్లు రామలింగయ్యగారు ఉంటే చాలా సంతోషించేవారు కదా’ అన్న ప్రశ్నకు బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘అవును తాతయ్య ఉండి ఉంటే ఎంతో ఆనందించేవారు. ఇన్నేళ్ల చరిత్రలో నా మనవడు కొట్టాడు. తన జీవితానికి ఇది చాలు’ అని ఆయన ఫీలయ్యే సందర్భం అయుండేది. మరో విషయం ఏంటంటే నేను నేషనల్‌ అవార్డు సాధించడం మా నాన్నగారు చూడగలిగారు అదే నాకు చాలా అదృష్టం’’ అని అన్నారు. (National award winner)

2.jpg

ఫ్యాన్‌ వార్‌తో సంబంధం లేదు...

ట్రోలింగ్‌ గురించి చెబుతూ.. వంద శాతం ట్రోలింగ్స్‌ అన్నీ పట్టించుకుంటాను. కాకపోతే ‘ఫన్‌’గా తీసుకుంటాను. మన కోసం ఒకళ్లు పని గట్టుకుని టైమ్‌ కేటాయించి, అదే పనిగా విమర్శిస్తున్నారంటే మనం ఎదిగినట్లే కదా! మా స్ట్టాఫ్‌లో ఒకరు.. ‘చూడండి సార్‌.. మీ గురించి ఇలా అనుకుంటున్నారు’ అంటే, ‘మంచిదే కదా.. మనం ఎదిగినట్లు అర్థం’ అన్నాను. ఏమీ లేకుండా మిగిలిపోయినవాళ్లను ఎవరూ పట్టించుకోరు. సో.. మనల్ని పట్టించుకున్నారంటేనే మనం సాధిస్తున్నాం అని అర్థం. సోష్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌’, ‘అల్లు అర్జున్‌ ఆర్మీ’ అంటూ ఫ్యాన్‌ వార్‌ జరుగుతుంటుంది కదా. నేను పట్టించుకోనిది ఏమైనా ఉందంటే ఆ ఫ్యాన్‌ వార్‌ని మాత్రమే. ఫ్యాన్స్‌ పని ఫ్యాన్స్‌ చూసుకుంటారు. నా పని నేను చూసుకుంటానంతే!

నాకు మాత్రం అన్నీ కావాలి...

సినిమాలు, కలెక్షన్లు, అవార్డులు గురించి బాగా పట్టించుకుంటా. వేరే వాటి గురించి ఆలోచించను. నా ఫోకస్‌ అంతా వీటిపైనే ఉంటుంది. మిగతావారు ఆలోచిస్తారో లేదో నాకు తెలీదు కానీ... నాకు మాత్రం ఇవ్వన్నీ కావాలి. ప్రజల్లో పేరు, కలెక్షన్స్‌ కావాలి, అవార్డులు కావాలి, నిర్మాతలకు డబ్బులు రావాలి. జనాలకు పిచ్చెక్కిపోయే సినిమాల చేయాలి.. ఇలా నాకు అన్నీ కావాలి. ఆ క్లారిటీ నాకు ఉంది. నాది అత్యాశ.. నాకు అన్నీ కావాలి. అందుకే తగ్గేదేలే అంటూ కష్టపడి పని చేస్తా. ఆగేదే లే అంటూ సినిమాలు చేసుకుంటూ వెళతాను

6.jpg

తగ్గేదేలే.. ఆపేదేలే...

నా పేరు సూర్య’ చిత్రం తర్వాత గ్యాప్‌ తీసుకోవడానికి కారణమేంటని అడగ్గా.. సమయం అలా కలిసొచ్చింది. నిజం చెప్పాలంటే ఆ గ్యాప్‌ నాకు మంచి చేసింది. నా గురించి నేను వంద శాతం తెలుసుకోవడానికి ఆ సమయం దొరికినట్లయింది. నేను ఏం తప్పులు చేశాను? ఎటు వెళ్తున్నాను అని ఆలోచించుకున్నాను. కొందరు సలహాలు ఇచ్చారు. చెప్పాలంటే నన్ను నేను సరిద్దుకున్న సమయం అది. అలా నన్ను నేను సరిదిద్దుకుని ఇకనుంచి తగ్గేదే లే... ఆపేదేలే అనుకున్నాను’’ అని బన్నీ సమాధానమిచ్చారు.

స్నేహ.. భావోద్వేగమైన వేళ...

‘‘నన్ను పెళ్లి చేసుకున్నాక నా భార్య కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి లోనైన సందర్భం లేదు. కానీ జాతీయ పురస్కారం వచ్చిందని తెలిసిన తర్వాత ఆమె భావోద్వేగానికి గురవ్వడం చూశా. తను సినీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. సినిమా చూసి బాగుందో, బాగోలేదో చెబుతుంది తప్ప అంత లోతుగా విశ్లేషించదు. నా సినిమా ఎంత హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా తన జీవితంలో ఎలాంటి తేడా ఉండదు. ఏదైనా పురస్కారం వచ్చినట్టు తెలిేస్త ఆ సంతోషాన్ని నాతో పంచుకుంటుందంతే. సినిమాలపై సలహాలు ఇవ్వదు. నేను కూడా తనతో ఆ విషయాల్ని ఎక్కువగా చర్చించను. తనే కాదు, నేను కథల విషయంలో ఎవరిమాటా వినను, నాకు నచ్చిందే చేస్తా. నా నమ్మకం ఆధారంగా ముందుకెళ్తా. జాతీయ పురస్కారం రావడంపై మా అబ్బాయి అయాన్‌ అందరికంటే సంతోషంగా ఉన్నాడు. ప్రతిసారీ వచ్చే పురస్కారం కాదు. తొలిసారి మా నాన్నకే వచ్చిందని తనకి అర్థమైంది. మా అమ్మాయి అర్హకి అంత లోతుగా తెలియదు కానీ, నాన్న ఏదో సాధించాడని మాత్రం తనకి అర్థమైంది.

Updated Date - 2023-08-27T16:52:40+05:30 IST