NTR - Alia Bhatt: ఎన్టీఆర్ కుమారులకు ఆలియాభట్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. అందులో ఏం ఉందంటే..
ABN , First Publish Date - 2023-03-26T09:53:30+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేసిందో తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ (RRR).. ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఈ చిత్రం ఎన్ని అద్భుతాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. అంతేకాకుండా.. ఈ చిత్రంలో నటించిన నటీనటుల మధ్య మంచి స్నేహానికి కూడా కారణమైంది. ఎన్టీఆర్ కుమారులకి బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) పంపిన సర్‌ప్రైజ్ గిఫ్ట్ చూస్తుంటే.. ఈ విషయం అర్థమవుతోంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ (NTR) కోమురం భీమ్ పాత్రలో నటించగా.. ఆలియా భట్ సీత పాత్రలో అలరించింది. అంతేకాకుండా.. ఈ మూవీ వీరిద్దరి కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలు సైతం ఉన్నాయి. ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా మొదలైంది.
కాగా.. ఆలియా గిఫ్టుల విషయాన్ని తెలుపుతూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ స్టోరీని షేర్ చేశాడు. అందులో.. ఆయన కుమారులు అభయ్, భార్గవ్‌కు కొత్త బట్టలను పంపించినట్లు రాసుకొచ్చాడు. ఈ గిఫ్ట్ పంపి తన కుమారుల నవ్వులకి కారణమయినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాకుండా.. తన పేరుతో కూడా అలాంటి బ్యాగ్ చూస్తారని హామీ కూడా ఇచ్చాడు. ‘మీరు నా ఫేవరేట్.. హ్యుమన్ బీన్’ అనే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్‌లో ఆ బహుమతులను ఆలియా పంపడం విశేషం. (Alia Bhatt surprise gift)
అయితే.. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ‘ఎన్టీఆర్30’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో మరో బాలీవుడ్ బ్యూటీ, దివంగత అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. (Alia Bhatt surprise gift)
ఇవి కూడా చదవండి:
Dasara Movie: సుకుమార్‌పై కామెంట్స్.. కాంట్రవర్సీలపై నాని రియాక్షన్ ఏంటంటే..
LEO Video Viral: ఓ సినిమా కోసం ఇంత కష్టపడాలా?
Breaking: హీరో అజిత్ కుమార్ ఇంట విషాదం
Samyuktha Menon: మాట ఇచ్చి ఎందుకు తప్పారు.. ‘విరూపాక్ష’ టీంపై నటి ఫైర్..
NTR30: భయం పుట్టించేందుకు సిద్ధమవుతున్న ఎన్టీఆర్
Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా
Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..
Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?