Ala Ila Ela: స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా.. విడుదలకు సిద్ధం

ABN , First Publish Date - 2023-07-17T22:17:40+05:30 IST

దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కాబోతోంది.

Ala Ila Ela: స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా.. విడుదలకు సిద్ధం
Ala Ila Ela Movie Team

దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ (Shakti Vasudevan) హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు, చిత్ర టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోవడంతో.. సినిమాపై యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎస్.కె.ఎం.ఎల్. మోషన్ పిక్చర్స్ సంస్థ ద్వారా జూన్ 21న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై.. ఈ సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. (Ala Ila Ela Movie)


ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. మంచి ఫ్యాన్సీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ బిగ్ హిట్ అయ్యి దర్శకుడికి పేరు, నిర్మాతకు మంచి లాభాలు రావాలని అన్నారు. మరో కొరియోగ్రాఫర్ అశోక్ మాట్లాడుతూ.. కళ మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు రాఘవ, నిర్మాత కోల్లకుంట నాగరాజు సినిమాలో పెద్ద ప్యాడింగ్ పెట్టుకోని చాలా మంచి సినిమా తీశారు. ఈ సినిమా చూశాను.. ఇందులో నటించిన వారంతా అద్భుతంగా నటించారు. సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత నిర్మాత నాగరాజు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నానని అన్నారు. (Ala Ila Ela Ready to Release)

చిత్ర నిర్మాత కొల్లకుంట నాగరాజు మాట్లాడుతూ.. ఈ సినిమాలో అందరూ చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో శక్తి హీరోగా చాలా బాగా నటించాడు. ఇందులో నటించిన సీనియర్ ఆర్టిస్టులు బ్రహ్మానందం, అలీ, పూర్ణ, షియాజీ షిండే, నాగబాబు, రియాజ్ ఖాన్ ఇలా అందరూ చాలా అద్భుతంగా నటించారు. నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. జులై 21న ఎస్.కె.ఎం.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా థియేటర్స్‌లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. చిత్ర దర్శకుడు రాఘవ ద్వారకి మాట్లాడుతూ.. కర్ణాటకలో పుట్టిన నేను చిరంజీవిగారి సినిమాలు చూసి స్ఫూర్తి పొంది సినిమారంగంలోకి రావడం జరిగింది. కన్నడలో 6 సినిమాలు చేశాను. తమిళ్‌లో కూడా సినిమా చేశాను. తెలుగులో నాకిది మెదటి చిత్రం. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా. చూస్తున్న ప్రేక్షకులకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ఉంటుంది. సిరివెన్నెల సీతారామశాస్రిగారితో వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిర్మాత ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచి ఈ సినిమాను నిర్మించారు. డిస్ట్రిబ్యూటర్ ఆదినారాయణగారు సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చి మా సినిమాను విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు. ఈనెల 21న విడుదల అవుతున్న మా సినిమాను బిగ్ హిట్ చేయాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*NTR and Krishna: రెండు చిత్రాలు.. కథ మాత్రం ఒక్కటే.. అప్పట్లోనే ఇలా జరిగిందనే విషయం తెలుసా?

**************************************

*Saindhav: గాయత్రిగా సారా.. లుక్ విడుదల

**************************************

*Ketika Sharma: ‘బ్రో’ సినిమాకు ఆయన పేరు చాలు

**************************************

*Nidhhi Agerwal: పవర్‌స్టార్‌కి థ్యాంక్స్ చెప్పిన నిధి.. పోస్ట్ వైరల్

**************************************

*SSMB29: మహేష్ కుమార్తె, ఎన్టీఆర్ కుమారుడు.. ఇరు హీరోల ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీటు!

**************************************

*Namrata Shirodkar: గౌతమ్ ఎంట్రీకి టైముంది.. సితార ఇంట్రెస్ట్‌గా ఉంది

**************************************

Updated Date - 2023-07-17T22:17:40+05:30 IST