Agent: అయ్యగారి రొమాన్స్ చూసారా...
ABN , First Publish Date - 2023-03-25T13:34:42+05:30 IST
అఖిల్ అక్కినేని సినిమా 'ఏజెంట్' ఇప్పటికే చాలా ఆలస్యమయింది. కొన్ని సార్లు ఆలస్యం కూడా మంచిదే అంటారు, అందుకనే ఈ ఆలస్యం అఖిల్ కి మంచి విజయాన్ని ఇస్తుందేమో చూద్దాం. ఈ సినిమా ప్రచారంలో భాగంగా రెండు పాటలు కూడా విడుదల చేశారు, మరి ఆ పాఠాల్లో అఖిల్ ఎలా వున్నాడు అంటే..
యువ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni), దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender Reddy)ల ‘ఏజెంట్’ (Agent) సినిమా ఏప్రిల్ 28న (April 28 release) విడుదల అవుతోంది. ఈ సినిమా ఒక్క తెలుగు లోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు మమ్మూట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షి వైద్య (Sakshi Vaidya) ఇందులో కథానాయకురాలు. దీనికి హిప్ హాప్ తమీజా (Hiphop Tamizha) సంగీతాన్ని సమకూర్చారు.
AK Entertainments నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు. కొన్ని రోజుల క్రితం 'మళ్లీ మళ్ళీ' (Malli Malli song) అనే పాటను విడుదల చేశారు. అది బాగానే జనాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకో పాటను ‘ఏందే ఏందే’ (Endhe Endhe song) విడుదల చేశారు. ఇది కొంచెం రొమాంటిక్ పాట, తెలంగాణా పదాలు బాగా దొర్లుతాయి ఈ పాటలో.
సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ ఈ పాటని లవ్లీ రొమాంటిక్ మెలోడీగా కంపోజ్ చేశారు, అలాగే స్క్రీన్ మీద అఖిల్ అక్కినేని కూడా చాలా రొమాంటిక్ గా కనపడతాడు అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పాట ప్రోమో లో అఖిల్, సాక్షి వైద్య ఇద్దరూ బాగున్నారు, అందులోకి అఖిల్ అందంగా కూడా వున్నాడు.
ఈ పాటకి ఇంకో ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఈ పాటని కొన్ని రోజుల క్రితం 'నాటు నాటు' (Naatu Naatu) పాటకి ఆస్కార్ (Oscar Award) అందుకున్న చంద్రబోస్ (Chandrabose) రాయటం. అందుకనే ఈ పాటకు రాసిన సాహిత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందులో లనే చాల తెలంగాణ పదాలు ఇందులో కూడా చంద్రబోస్ వాడాడు. సంజిత హెగ్డే, పద్మలత, హిప్ హాప్ కలసి ఈ పాటని పాడారు.
ఈ పాటలో అఖిల్ చాలా స్టైలిష్ గా కనిపించాడు కూడా. ఈ పాత మొదటి పాట కన్నా రొమాంటిక్ గా వుంది. అక్కినేని వారు అందులోకి రొమాన్స్ చెయ్యడం లో దిట్ట కదా, అందుకని అయ్యవారి రొమాన్స్ కూడా పాటల్లో బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఇది అఖిల్ అక్కినేని కి ఒక కీలక సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే చాలా లేట్ అయింది. దానికితోడు, అఖిల్ కి ఒక మంచి కమర్షియల్ హిట్ కావాలి, అది ఈ 'ఏజెంట్' తో తీరిపోతుంది అని అనుకుంటున్నారు. కథ వక్కంతం వంశీ ఇచ్చాడు.