Sobhita Dhulipala: సమంతని అలా చూడగానే ఏడుపు వచ్చేసింది: శోభిత ధూళిపాళ

ABN , First Publish Date - 2023-04-03T14:06:08+05:30 IST

శోభిత ధూళిపాళ ఈమధ్య విశాఖపట్నం వచ్చింది, అక్కడ సమంత ని పెళ్లి డ్రెస్ లో చూసి ఏడ్చేసింది. ఇంతకీ ఆ సమంత ఎవరు, ఎందుకు శోభిత విశాకహాపట్నం వచ్చింది అంటే...

Sobhita Dhulipala: సమంతని అలా చూడగానే ఏడుపు వచ్చేసింది: శోభిత ధూళిపాళ

శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తెలుగు అమ్మాయి అయినా ముందు హిందీలో పరిచయం అయింది. ఆ తరువాత తెలుగు సినిమా 'గూఢచారి' (Goodachari) లో చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయింది. అలాగే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించి శోభిత అటు బుల్లి తెర మీద, ఇటు వెండి తెర మీదా కూడా బాగా పేరు తెచ్చుకుంది. 'గూఢచారి' తరువాత మళ్ళీ అడివి శేష్ (Adivi Sesh) తోటే 'మేజర్' (Major) సినిమాలో కూడా చేసింది. వీటన్నిటికీ మించి శోభిత ఈమధ్య వార్తల్లో బాగా వైరల్ అయింది ఎందుకంటే సమంత (SamanthaRuthPrabhu) మాజీ భర్త నాగ చైతన్య (Naga Chaitanya) తో ఎక్కువగా కనిపించటం వలన, అలాగే నాగ చైతన్య తో డేటింగ్ లో ఉందని కూడా రూమర్లు వస్తున్నాయి.

sobhitadhulipala1.jpg

అందులో ఎంత నిజం ఎంత అబద్ధం ఉందొ వాళ్ళకే తెలియాలి. ఇదిలా ఉంటే, శోభిత (Sobhita Dhulipala) ఈమధ్య సమంత ని ఆ డ్రెస్ లో ఆలా చూసి తట్టుకోలేక ఏడ్చేసాను అని పోస్ట్ పెట్టింది. కొన్ని రోజుల క్రితమే కదా నాగ చైతన్య తో వున్న ఫోటో వైరల్ అయింది, మళ్ళీ ఈ సమంత గోల ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ సమంత అంటే నాగ చైతన్య మాజీ భార్య కాదు, శోభిత ధూళిపాళ సిస్టర్.

sobhitadhulipala2.jpg

విశాఖపట్నం లో పుట్టి పెరిగిన శోభిత, విశాఖపట్నం తన సిస్టర్ వివాహానికి వెళ్ళింది. అక్కడ తన సిస్టర్ సమంత ని పెళ్లి డ్రెస్ లో చూసి భావోద్వేగానికి గురి అయి ఏడ్చేసాను అని పోస్ట్ పెట్టిందండి. అంతే ! అయితే మరి సిస్టర్ వివాహం అయిపొయింది, మరి శోభిత వివాహమే తరువాత అని నెటిజన్స్ అందరూ అంటున్నారు.

వెబ్ సిరీస్ 'ది నైట్ మేనేజర్' (The Night Manager) లో శోభిత చాలా బోల్డ్ రోల్ వేసిందని అంటున్నారు. అందులో అనిల్ కపూర్ (Anil Kapoor), ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Roy Kapoor) వేశారు. ఇది ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అదే టైటిల్ తో వచ్చిన దానికి హిందీలో రీమేక్ చేశారు. కానీ టైటిల్ అదే పెట్టారు. ఇప్పుడు ఇది బాగా చూస్తున్నారు కూడా.

Updated Date - 2023-04-03T15:26:39+05:30 IST