Manchu Vishnu: ‘కన్నప్ప’లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్

ABN , First Publish Date - 2023-09-30T15:14:03+05:30 IST

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' న్యూజిలాండ్ లో షూటింగ్ మొదలైంది. ఇందులో ప్రభాస్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే, ఇప్పుడు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఇందులో ఇంకో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది ఒక పాన్ ఇండియా హై బడ్జెట్ సినిమాగా రాబోతోంది అని తెలుస్తోంది.

Manchu Vishnu: ‘కన్నప్ప’లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్
Manchu Vishnu and Mohan Lal

మంచు విష్ణు (ManchuVishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' #Kannappa సినిమా గురించి ఇప్పుడు వరసగా వస్తున్న సమాచారం ఆసక్తి రేపుతోంది. చిన్నగా మొదలైన ఈ సినిమా మీద ఇప్పుడు అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా మామూలుగా మొదలైనా, తరువాత న్యూజిలాండ్ లో షూటింగ్ మొదలెట్టి ఇదొక హై బడ్జెట్ సినిమాగా, పాన్ ఇండియ సినిమాగా మంచు విష్ణు ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. దీనికి 'మహాభారత్' #Mahabharath సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ (MukeshKumarSingh) దర్శకత్వం వహించనున్నారు.

prabhas-new2.jpg

విష్ణు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజా సాంకేంతికతని ఉపయోగిస్తూ ఒక విజుఅల్ వండర్ గా 'కన్నప్ప' సినిమాని తీయబోతున్నారు అని తెలిసింది. ఈ మూవీలో ప్రభాస్ #Prabhas ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ ఈ సినిమాలోకి వచ్చారు. మాలీవుడ్ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ (MohanLal) సైతం 'కన్నప్ప' సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారు. ఈ మేరకు మంచు విష్ణు రీసెంట్‌గా మోహన్ లాల్‌ను కలిశారు. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

vishnumanchu.jpg

ప్రస్తుతం 'కన్నప్ప' టీం న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకృష్ణ (ParuchuriGopalakrishna), విజయేంద్ర ప్రసాద్ (VijayendraPrasad), తోటపల్లి సాయి నాథ్, తోట ప్రసాద్, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్ రెడ్డి ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచినట్టుగా మంచు విష్ణు తెలిపారు. మున్ముందు మరింత సమాచారంతో 'కన్నప్ప' మీద అంచనాలు పెంచబోతున్నారు.

Updated Date - 2023-09-30T15:14:03+05:30 IST