Custody: కృతి శెట్టికి ఆ పేరు పోతుందా !

ABN , First Publish Date - 2023-05-08T12:15:05+05:30 IST

వెంకట్ ప్రభు దర్శకత్వం లో వస్తున్న తెలుగు, తమిళ్ ద్విభాషా సినిమా 'కస్టడీ' లో నాగ చైతన్య పక్కన కృతి శెట్టి కథానాయకురాలిగా నటిస్తోంది. నాలుగు సినిమాలు వరసగా ప్లాప్లు ఇచ్చిన కృతి ఈ సినిమా మీదే అసలు పెట్టుకుంది.

Custody: కృతి శెట్టికి ఆ పేరు పోతుందా !

'ఉప్పెన' (Uppena) తో చాలా పెద్ద విజయం నమోదు చేసుకున్న కృతి శెట్టి (Krithi Shetty) కి అదే మొదటి సినిమా. ఆ తరువాత వెంట వెంటనే చాలా సినిమాలు చేసింది కానీ, ఏదీ బ్రేక్ ఇవ్వలేదు. పాపం కృతి శెట్టి ని కూడా ఐరన్ లెగ్ అన్నారు. 'బంగార్రాజు', 'వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఇలా నాలుగు సినిమాలు వరసగా ప్లాప్ లు రావటం తో కృతి శెట్టి ని కూడా ఆలా అనేసారు పరిశ్రమలో. ఇందులో 'బంగార్రాజు' (Bangarraju) నాగ చైతన్యుతో (NagaChaitanya), 'వారియర్' రామ్ పోతినేనితో (RamPothineni), 'మాచర్ల నియోజకవర్గం నితిన్ (Nithiin) తో చేసింది. లాస్ట్ సినిమాలో కృతి డ్యూయల్ రోల్ వేసింది, ఇందులో సుధీర్ బాబు (SudheerBabu) కథానాయకుడు. ఇవన్నీ డిజాస్టర్ సినిమాలు అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు నాగ చైతన్యతో 'కస్టడీ' (Custody) సినిమా చేసింది, విడుదలకి సిద్ధంగా వుంది. దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ఇది.

krithishetty.jpg

ఈ సినిమా కోసం కృతి శెట్టి కష్టపడ్డాను అని చెప్తోంది. ఎందుకంటే దీనికోసమే జిమ్నాస్టిక్స్ నేర్చుకుందట. ఆమె పాత్ర నటనకు ఆస్కారం ఉంటుందని, అలాగే ఆమె పాత్ర.నిడివి కూడా ఎక్కువే అని చెప్తోంది. సాధారణంగా సినిమాలకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు, కానీ ఈ 'కస్టడీ' కోసం జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేశాను అని చెప్తోంది. ఎందుకంటే ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెపింది. అలాగే ఈ సినిమా తర్వాత మార్వల్స్ స్టూడియో (Marvel Studio) నుంచి నాకు కాల్ వస్తుందని వెంకట్ ప్రభుగారితో చెప్పాను అని సరదాగా చెప్పింది. అలాగే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం చెప్పింది. చాలా సినిమాల్లో హీరో, విలన్ ని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ 'కస్టడీ' లో మాత్రం హీరో విలన్ ని కాపాడటానికి ప్రయత్నిస్తాడు అని చెప్తోంది.

krithishetty2.jpg

ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా వుంది అని, దాన్ని దాదాపు 15 రోజులు ఆ సీక్వెన్స్ చేశాం. అందుకోసం అని ఒక ఐదు రోజుల పాటు కంటిన్యూ గా వాటర్ లోనే వున్నాం, అని చెప్తోంది. అలా ఉండటం కోసం రెండు రోజులు శిక్షణ కూడా తీసుకున్దితా. ఎందుకంటే ఊపిరి తీసుకోకుండా రెండు నిముషాలు పాటు వుంటేనే ఒక షాట్ సాధ్యపడుతుంది అని. ఒక దశలో అయితే చాలా భయం కూడా వేసింది అని చెప్తోంది.

Updated Date - 2023-05-08T12:15:05+05:30 IST