PayalRajput: వందమందికి పైగా చూసాక... అప్పుడు అనిపించింది

ABN , First Publish Date - 2023-04-26T11:07:16+05:30 IST

'మంగళవారం' సినిమాకి పాయల్ రాజపుట్ మొదటి ఛాయస్ కాదని తెలిసింది. ఇందులో కథానాయకురాలి పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందని, దానికి దర్శకుడు అజయ్ భూపతి వందమందికి పైగా అమ్మాయిలను...

PayalRajput: వందమందికి పైగా చూసాక... అప్పుడు అనిపించింది

అజయ్ భూపతి (Ajay Bhupathi) తన మొదటి సినిమా ''ఆర్ఎక్స్ 100' (RX 100) తోనే తాను ఎంతటి టాలెంట్ వున్న దర్శకుడో నిరూపించుకున్నాడు. రెండో సినిమా 'మహా సముద్రం' (Mahasamudram) అంతగా విజయం సాధించకపోయినా అతని ప్రతిభకి కొదవలేదు. ఇప్పుడు మూడో సినిమా 'మంగళవారం' (Mangalavaaram) అనే టైటిల్ తో వస్తున్నాడు. ఇందులో పాయల్ రాజపుట్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించింది. ఆమె పోస్టర్ కూడా నిన్న విడుదల చేశారు ఈ సినిమా నిర్వాహకులు. అజయ్ భూపతి మొదటి సినిమాలో కూడా పాయల్ రాజపుట్ కథానాయకురాలిగా నటించింది, ఇప్పుడు మళ్ళీ ఈ 'మంగళవారం' సినిమాకి కూడా ఆమెనే తీసుకున్నాడు.

mangalavaaram.jpg

అయితే ఆమెని తీసుకునే ముందు దర్శకుడు అజయ్ భూపతి చాలామంది అమ్మాయిలను ఆడిషన్ చేసాడు అని తెలిసింది. ఇలా ఒక వందకి పైగా అమ్మాయిలని ఆడిషన్ చేసి, ఎవరూ కుదరక, నచ్చక చివరికి పాయల్ రాజపుట్ ని తీసుకున్నాడు అని తెలిసింది. ఎందుకంటే పాయల్ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమాలో కథానాయకురాలు ఒక బోల్డ్ పాత్రలో కనపడుతుంది అని.

ఇక 'మంగళవారం' అని ఎందుకు పేరు పెట్టాడు అని కూడా చాలామందికి ఆసక్తి కలిగింది. దర్శకుడు అజయ్ కథ 1990లో గ్రామీణ నేపధ్యం అన్నాడు కాబట్టి, ప్రతి మంగళవారం ఏదైనా సంఘటన జరిగి ఉండొచ్చు, లేదా ఏదైనా మర్డర్ జరుగుతూ ఉండొచ్చు. ఇలాంటి సంఘటన మంగళవారం జరుగుతుంది కాబట్టి సినిమాకి ఆ టైటిల్ పెట్టాడు అనిపిస్తోంది. ఈ కథ కూడా చాలా బాగుంటుంది అని, ఈ సినిమాతో అజయ్ భూపతి మొదటి సినిమా కన్నా ఎక్కువ పేరు సంపాదిస్తాడని అతని సన్నిహితులు చెపుతున్నారు.

Payal.jpg

సినిమాలో కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉండొచ్చేమో అని కూడా ఒక టాక్ నడుస్తోంది. అయితే సినిమాలో చాల సస్పెన్స్ ఉంటుందని, అలాగే థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా వుంటాయని తెలిసింది.

Updated Date - 2023-04-26T11:07:16+05:30 IST