Adipurush: అప్డేట్ చేసిన టీజర్ లో ప్రభాస్ ని చూసారా ?
ABN , First Publish Date - 2023-04-20T11:31:45+05:30 IST
'ఆదిపురుష్' అప్డేట్ చేసిన టీజర్ వచ్చింది. అయితే దీన్ని మీడియా వాళ్ళకి ఎవరికీ పంపలేదు కానీ, చిత్ర నిర్వాహకులు వాళ్ళ వెబ్ సైట్ లో పెట్టుకున్నారు అని తెలిసింది. ఇది పాత దానితో చొంపరె చేస్తే ఎలా ఉందంటే...
ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (Kriti Sanon) జంటగా 'ఆదిపురుష్' (Adipurush) యానిమేషన్ సినిమా టీజర్ ఆమధ్య ఎప్పుడో విడుదల అయింది. ఆ టీజర్ వచ్చాక, ఏ ఇండియన్ సినిమాకి రానంతగా ట్రోల్స్ వచ్చాయి. ప్రభాస్ బాగోలేడని, సైఫ్ అలీ ఖాన్ వేసిన రావణుడు పాత్ర అస్సలు బాగోలేదని, ఇంకా యానిమేషన్ చాలా నీచంగా ఉందని ఏవేవో కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేశారు అప్పట్లో. ఆ టీజర్ రిలీజ్ ఫంక్షన్ తరువాత ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) ని 'కం టు మై రూమ్' (Om, come to my room) అనే మాట ఎంత వైరల్ అయిందో తెలిసిందే కదా. అది అప్పటి కథ.
ఇప్పుడు ఆ సినిమా నిర్వాహకులు అదే టీజర్ కి అప్డేట్ వెర్షన్ ఇచ్చారు. #AdipurushOnJune16 అయితే ఇది మీడియా వాళ్ళకి కానీ, వేరే వాళ్ళకి కానీ పంపలేదు, వాళ్ళ వెబ్ సైట్ లో పెట్టుకున్నారని తెలిసింది. ఇప్పుడు అప్డేట్ చేసిన ఈ కొత్త టీజర్ పాత దాని మీద కొంచెం బెటర్ క్వాలిటీ అని మాత్రం అంటున్నారు.
అప్పట్లో ఈ టీజర్ మీద ట్రోల్స్ వచ్చాక, ప్రభాస్ దర్శకుడుకి ఈ సినిమా యానిమేషన్ మీద వర్క్ చెయ్యాలని సూచించాడని కూడా అన్నారు కదా. ఆలా అప్డేట్ చేసాక ఈ సినిమాని ఫిలిం ఫెస్టివల్స్ కి పంపించటం జరిగిందని, అందులో ప్రసంశలు అందుకుంది చెపుతున్నారు. అలాగే సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన #Adipurush ఈ సినిమా ఆ టీజర్ బాగోలేకపోవటం వలన జూన్ 16 కి పోస్టుపోన్ అయిందని కూడా చెప్పారు. ఇప్పుడు జూన్ 16 న విడుదల #AdipurushOnJune16 అవ్వబొయె సినిమా కోసం ప్రభాస్ అభిమానులు, మిగతా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
ఈ అప్డేట్ అయిన టీజర్ ని ఎందుకు మీడియా వాళ్ళకి చూపించలేదంటే, ఎలాగు ట్రైలర్ విడుదల చేస్తాము కదా, అది చూపిద్దాం, ఈ టీజర్ ఎందుకు అని చిత్ర నిర్వాహకులు అభిప్రాయపడ్డారు అని తెలిసింది. ఆదిపురుష్ సినిమా కి ఓం రౌత్ దర్శకుడిగానే కాకుండా, నిర్మాతగా భూషణ్ కుమార్, రాజేష్ మోహనన్, క్రిషన్ కుమార్ లతో నిర్మిస్తున్నారు.