Adipurush: రఘునందనుడి గాథ.. యుగయుగాల్లోనూ సజీవం.. జాగృతం
ABN , First Publish Date - 2023-05-09T15:11:54+05:30 IST
దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్ విడుదల అని చిత్ర బృందం ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది.
దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ ట్రైలర్ (Adipurush Trailer)వచ్చేసింది. మంగళవారం సాయంత్రం 5.04 నిమిషాలకు ట్రైలర్ విడుదల అని చిత్ర బృందం ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయింది. అయితే సమయాని కన్నా మూడు గంటల ముందు అంటే, 1.53 నిమిషాలకు టి-సిరీస్ యూట్యూబ్‌లో విడుదల చేస్తామని దర్శకుడు మరో ప్రకటన ఇచ్చారు. అన్న టైమ్‌కు విడుదల కాకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 25 నిమిషాలు లేట్‌గా విడుదల చేశారు. (Prabhas)
‘మంగళప్రదము నా రాముని పయనం.. అనే కీర్తనతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
‘ఇది నా రాముడు కథ. (Jai ShriRam)
ఆయన మనిషిగా పుట్టి.. భగవంతుడైన మహనీయుడు.
ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం.
ఆయన నామం రాఘవా..
ఆయన ధర్మం .. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది..
ఇది ఆ రఘునందనుడి గాథ.
యుగయుగాల్లోనూ సజీవం.. జాగృతం. (Jai sriram)
నా రాఘవుడి కథే రామాయణం’’ అంటూ హనుమంతుడు మాటలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రతి డైలాగ్‌లోనూ హనుమంతుడి భక్తి కనిపిస్తోంది.
‘మీరు అయోధ్యకు యువరాజు.. ఒక్క సైగ చేస్తే సమస్త సైన్యం మన కోసం పోరాడుతుంది’ అని లక్ష్మణుడు చెప్పగా అది మర్యాదకు విరుద్దం అని రాఘవ పాత్రధారి ప్రభాస్ చెప్పడం ఆకట్టుకుంటోంది.
‘మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనదా? అని లక్ష్మణుడు అనగా.. నా ప్రాణమే జానకీలో ఉంది. కానీ ఆ ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది’ అని చెప్పడంతో మరాద్య, రాజ్య ప్రతిష్ట కోసం రాముడు ఎంతగా ఆలోచిస్తాడో తెలుస్తోంది.
‘నా కోసం పోరాటం చేయవద్దు.. వేల సంవత్సరాల తర్వాత తల్లుల ఈ వీర గాథల్ని చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి, అయితే దూకండి ముందుకు... అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి’ అన్న రోమాలు నిక్కబోడిచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రభాస్ రాముడిగా, కృతీసనన్(Krithi sanon) జానకిగా నటించిన ఈ చిత్రానికి ఓంరౌత్ (Om raut) దర్శకుడు. టి.సిరీస్ (T Series)పతాకంపై భూషన్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే విడుదల ఆలస్యమైనందుకు అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేశారు. సమయానికి రాకపోయినా ట్రైలర్ మాత్రం అదిరిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.