Adipurush Surprise: అనుకున్న దానికంటే మూడు గంటల ముందే!

ABN , First Publish Date - 2023-05-09T10:08:06+05:30 IST

ప్రభాస్‌.. తన అభిమానులను ముద్దుగా డార్లింగ్స్‌ అని పిలుచుకుంటారు. సినిమాకు సంబంధించి ఏ వేదిక మీదైనా ఆయన స్పీచ్‌ ‘డార్లింగ్స్‌’ అనే పదంతోనే మొదలవుతుంది.

Adipurush Surprise: అనుకున్న దానికంటే మూడు గంటల ముందే!

ప్రభాస్‌(Prabbhas).. తన అభిమానులను ముద్దుగా డార్లింగ్స్‌ (Darlings) అని పిలుచుకుంటారు. సినిమాకు సంబంధించి ఏ వేదిక మీదైనా ఆయన స్పీచ్‌ ‘డార్లింగ్స్‌’ అనే పదంతోనే మొదలవుతుంది. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఇకపై డార్లింగ్స్‌ అని పిలవనని చెప్పారు. దానికి బదులుగా ‘జై శ్రీరామ్‌’ (Jai sriram)అని అంటానని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో నిర్వహించిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) ట్రైలర్‌ ప్రీమియర్‌ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రీమియర్‌కు హాజరైన అభిమానులు డార్లింగ్‌.. డార్లింగ్‌ అంటూ ఆడిటోరియంను హోరెత్తించారు. మరి కొందరు ‘జైశ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఈ చిత్రం వరకు ‘జై శ్రీరామ్‌’ అందామని ప్రభాస్‌ పేర్కొన్నారు. ఇది భక్తి ప్రధాన సినిమా కావడం వల్ల అలా అందామని కోరారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట ట్రెండ్‌ అవుతున్నాయి.

ఈ నెల 9వ తేదిన ‘ఆదిపురుష్‌’ ట్రైలర్‌ విడుదల చేస్తాం అని ప్రకటించినప్పటి నుంచీ అభిమానులు, దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో మరితం ఎగ్జైట్‌మెంట్‌ పెరిగింది. సోమవారం ఎఎంబీ మాల్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌, కృతీసనన్‌, ఓంరౌత్‌ హాజరై సందడి చేశారు. ట్రైలర్‌ బాగుందంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

Untitled-1.jpg

మరో సర్‌ప్రైజ్‌...

తొలుత ‘ఆదిపురుష్‌’ త్రీడీ ట్రైలర్‌ను ఈ నెల 9వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసి థియేటర్స్‌లో సాయంత్రం 5.04. నిమిషాలకు ప్రదర్శించనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. తాజా అప్‌డేట్‌ ప్రకారం ఆదిపురుష్‌ అఫీషియల్‌ ట్రైలర్‌ మంగళవారం మధ్యాహ్నాం 1 గం. 53 ని. లకు టీసిరీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అనుకున్న దానికంటే మూడు గంటల ముందుగా శ్రీరాముని పాత్రలో ప్రభాస్‌ దర్శనం కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌.. జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌.. లంకేశ్‌గా నటించారు. 3డీ వెర్షన్‌లోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా జూన్‌ 13న ప్రతిష్ఠాత్మక ట్రిబెకా ఫెస్టివల్‌ (న్యూయార్క్‌)లో ప్రదర్శితం కానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-05-09T10:09:35+05:30 IST