Vijay Vs Abhishek pictures : విజయ్‌కు అభిషేక్ పిక్చర్స్ కౌంటర్
ABN , First Publish Date - 2023-09-05T22:54:19+05:30 IST
‘‘డియర్ విజయ్ దేవరకొండ.. వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాన్ని పంపిణీ చేసి రూ.8 కోట్లు నష్టపోయాం. దానిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు నీ పెద్ద మనసుతో అభిమానుల కుటుంబాలకు రూ. కోటి విరాళంగా ఇస్తున్నావ్. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలకు కాపాడాలని కోరుతున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించాడు విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకు స్టార్‌డమ్ పెంచుకున్నాడు. తన యాటిట్యూడ్, మాట తీరుతోనో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల స్టంట్స్ చేస్తుంటాడు. అలాగే సహాయ కార్యక్రమాల్లోనూ భాగమవుతుంటాడు. పలు కారణాలతో అతన్ని ట్రోల్ చేసేవారు ఉన్నారు. ప్రశంసలు కురిపించే వాళ్లు ఉన్నారు. తాజాగా ఒక ప్రొడక్షన్ హౌస్ అతనిపై వ్యంగ్యాస్త్రాలు సంఽధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే... విజయ్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే చిత్రం వచ్చింది. 2020లో విడుదలైన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. సినిమా డిజాస్టర్ కావడంతో సదరు సంస్థకు నష్టం వాటిల్లింది. ఇప్పుడు అదే విషయాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఎత్తి చూపుతూ విజయ్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి కారణం.. వైజాగ్‌లో జరిగిన ‘ఖుషి సక్సెస్ మీట్‌లో వంద మంది అభిమానుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించడమే! ఈ మేరకు అభిషేక్ పిక్చర్స్ సంస్థ విజయ్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. (World Famous Lover controversy)
‘‘డియర్ విజయ్ దేవరకొండ.(Vijay Devarakonda). వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రాన్ని పంపిణీ చేసి రూ.8 కోట్లు నష్టపోయాం. దానిపై ఎవరూ (Abhishek Nama) స్పందించలేదు. ఇప్పుడు నీ పెద్ద మనసుతో అభిమానుల కుటుంబాలకు రూ. కోటి విరాళంగా ఇస్తున్నావ్. దయచేసి మమ్మల్ని, మా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలకు కాపాడాలని కోరుతున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘నీకు నష్టం వచ్చిందని ఇప్పుడు అడుగుతున్నావ్... లాభం వచ్చుంటే విజయ్‌ని పిలిచి డబ్బు ఇచ్చేవాడివా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఇదే మాట ఇప్పుడున్న పెద్ద హీరోలను అచి?గే దమ్ముందా? అని ఇంకొందరు అంటున్నారు. మరో నెటిజన్ అయితే.. ‘ఎవడు కొనమన్నాడు.. అర్జున్ రెడ్డి సినిమాను మరోమాట లేకుండా ఎంత అంటే అంత కొన్నారు.. అప్పుడు లాభాలు చూశారు. అప్పుడు విజయ్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు అతను ఫ్యాన్స్ కోసం ఏదో సాయం చేస్తుంటే.. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది సందర్భం కూడా కాదు. ఆ సినిమాకు విజయ్ ఏమైనా నిర్మాతనా? మీరు నిర్మాతను అడగాలి కానీ విజయ్‌ను ఎలా అడుగుతారు? అని అభిషేక్ పిక్చర్స్‌ను నెట్టింట ఓ ఆట ఆడుకుంటున్నారు.