RRR: హిస్టారికల్ మూవీకి ఏడాది?.. ‘ఆస్కార్’తో సహా ఎన్ని అవార్డులను గెలుచుకుందంటే..

ABN , First Publish Date - 2023-03-25T14:44:27+05:30 IST

ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

RRR: హిస్టారికల్ మూవీకి ఏడాది?.. ‘ఆస్కార్’తో సహా ఎన్ని అవార్డులను గెలుచుకుందంటే..
RRR

ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) క్రియేట్ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25, 2022న విడుదలై రూ.1200 కోట్లకి పైగా వసూళ్లని సాధించింది. అంటే ఈ మూవీ విడుదలై నేటికి ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రబృందం ప్రేక్షకులని ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్టర్‌ని షేర్ చేసింది.

‘RRR Movie విడుదలై నేటికి ఏడాది పూర్తైంది. అయినప్పటీ ప్రపంచంలోని ఎక్కడో ఓ చోటు హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ అనుభూతి అవార్డుల కంటే పెద్దది. మీరు కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పే పదాలు మా వద్ద లేవు’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా.. ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ సైతం ఈ ఏడాదికాలంలో ఈ మూవీ సాధించిన విజయాలు, అవార్డుల గురించి పోస్టులు పెడుతూ హల్‌చల్ చేస్తున్నారు. ‘#1YearOfHistoricalRRR’ అనే యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. కాగా.. ఈ సంవత్సరంలో ఈ మూవీ ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ తోపాటు పలు అవార్డులను గెలుచుకుంది. ఈ జాబితాను సైతం మూవీ టీం తన ట్వీట్‌లో షేర్ చేసిన పోస్టర్‌ రాసుకొచ్చింది. ఆ లిస్ట్‌లో ఏయే అవార్డులు ఉన్నాయంటే..

ఆస్కార్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

గోల్డెన్‌ గ్లోబ్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌

బెస్ట్‌ డైరెక్టర్‌

డొరియన్‌ అవార్డ్స్‌

నాన్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

క్రిటిక్స్‌ ఛాయిస్‌ మూవీ అవార్డ్స్‌

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ సాంగ్‌

హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్ యాక్షన్‌ ఫిల్మ్‌

సెలబ్రిటీ ఫిల్మ్‌ అవార్డ్స్‌

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

బోస్టన్‌ సొసైటీ ఆఫ్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

పండోరా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అవార్డ్స్‌

సాంగ్‌ కంపోజింగ్‌

ఆస్టిన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేటర్‌

అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌

హ్యుస్టన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫీచర్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేషన్‌ టీమ్‌

జార్జియా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

బెస్ట్‌ స్టంట్స్‌

స్పాట్‌ లైట్‌ అవార్డు

సియాటెల్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటీ

బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ

ఆన్‌లైన్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సొసైటి

బెస్ట్‌ స్టంట్‌ కో-ఆర్డినేషన్‌

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌

శాటర్న్‌ అవార్డ్స్‌

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌

ఉటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ నాన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఫీచర్‌

సౌత్‌ ఈస్టర్న్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌

టాప్‌ టెన్‌ ఫిల్మ్స్‌

న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ ఆన్‌లైన్‌

టాప్‌ ఫిల్మ్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌

నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్ రివ్యూ

టాప్‌ టెన్‌ ఫిల్మ్స్‌

లాస్‌ ఏంజిల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌

బెస్ట్‌ మ్యూజిక్‌

Updated Date - 2023-03-25T14:45:22+05:30 IST