Deen Raj : ఎన్నో క‌ష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం

ABN , First Publish Date - 2023-07-08T22:12:00+05:30 IST

స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసి మొద‌టిసారిగా ‘భార‌తీయ‌న్స్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు రచయిత దీన‌రాజ్‌. సెన్సార్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 14న తెలుగు - హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఈ సినిమా మేకింగ్‌లో యూనిట్ ఎన్ని కష్టాలను ఫేస్ చేశారో తెలిపారు.

Deen Raj : ఎన్నో క‌ష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం
Writer Turned Director Deen Raj

‘ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, క‌లిసుందాం రా’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు క‌థా ర‌చ‌యిత‌గాను, ప్ర‌భాస్ పరిచయ చిత్రం ‘ఈశ్వ‌ర్‌’ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా ప‌నిచేసి మొద‌టిసారిగా ‘భార‌తీయ‌న్స్’ (Bharatheeyans) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు రచయిత దీన‌రాజ్‌ (Deen Raj). సెన్సార్ విషయంలో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసిన ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 14న తెలుగు - హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి (NRI Dr. Shankar Naidu Adusumilli) ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు దీనరాజ్ ఈ సినిమా కోసం యూనిట్ ఎంత కష్టపడిందో తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘చైనా బోర్డ‌ర్‌లో ఎన్నో వ్యయ‌ప్ర‌యాస‌ల‌కోర్చి షూటింగ్ చేసుకున్న తెలుగు చిత్రం ‘భార‌తీయ‌న్స్’. డ్రోన్స్‌తో షూట్ చేయ‌డానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, అడ‌వుల్లో షూటింగ్‌కు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమతులు తీసుకున్నాం. వ‌ర్షాలు కురిసి, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయ‌లేక‌పోయేవాళ్ళం. చిత్రయూనిట్ స‌భ్యుల‌కు ఈశాన్య రాష్ట్రాల ఫుడ్ స‌రిప‌డ‌క‌పోవ‌డంతో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేవి. కొండ‌చ‌రియ‌లతోపాటు.. చెట్లు విరిగి మా కార్ల‌మీద ప‌డ‌డంతో కొందరు యూనిట్ సభ్యులు బ‌తుకు జీవుడా అని దొరికిన వాహ‌నాన్ని ప‌ట్టుకుని హైద‌రాబాద్ వ‌చ్చేశారు. షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఒక లోక‌ల్ కారు డ్రైవ‌ర్ తాగి గొడ‌వ చేస్తుంటే... హైద‌రాబాద్ మేనేజ‌ర్ అత‌న్ని కొట్టాడు. దాంతో లోక‌ల్ రౌడీషీట‌ర్ ఎంట‌రై షూటింగ్ ఆపేస్తాన‌ని ఆవేశంతో రెచ్చిపోయాడు. ఆ రౌడీషీట‌ర్‌ని సముదాయించి, సినిమాలో చిన్న వేషం ఇచ్చి ఆ స‌మ‌స్య‌ను ఎలాగో ప‌రిష్క‌రించాం. (Director Deen Raj about Bharatheeyans)

Indians.jpg

అడ‌వుల్లో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు జ‌ల‌గ‌లు మా కాళ్ల‌ని ప‌ట్టుకుని ర‌క్తాన్ని పీల్చేవి. స‌మీప గ్రామాల నుంచి ఉప్పు బ‌స్తాలు తెప్పించి... చెప్పుల్లో, బూట్ల‌లో ఉప్పు వేసుకుని షూటింగ్ కొన‌సాగించాం. సిక్కిం, సిలిగురి అడ‌వుల్లో దోమ‌ల్లాంటి కీట‌కాలు ఎగురుతూ ముఖం మీద డైరెక్ట్‌గా వాలి ర‌క్తాన్ని పీల్చేవి. యాక్ష‌న్ అని డైరెక్ట‌ర్ అన‌గానే ఆర్టిస్టులు చేతుల‌తో ఆ కీట‌కాల‌ను తోలుకుంటూ వుండేవారు. క్లైమాక్స్ కోసం కొండ‌ల మ‌ధ్య‌లో ఉన్న ఒక లోయ‌ను ఎన్నుకున్నాం. ప్ర‌తిరోజూ వేకువ‌జామున 3.30కే బ‌య‌ల్దేరి మూడు గంట‌ల‌పాటు కొండ‌ల మ‌ధ్య ప్ర‌యాణం చేసి ఆ లోయ‌ను చేరుకునేవాళ్ళం. నాకు అస‌లే హైట్స్ ఫోబియా. నాతో పాటు కారులో వున్న వారు, లోయ‌లో ప‌డిపోయిన వెహిక‌ల్స్ గురించి మాట్లాడుకునే వారు. నాయ‌కుడు త‌న పిరికిత‌నాన్ని బ‌య‌ట‌కు చూపించ‌కూడ‌దు. కనుక రోజూ మూడు గంట‌లు పోవ‌డానికి, మూడు గంట‌లు రావ‌డానికి, ఊపిరి బిగ‌ప‌ట్టుకుని ప్ర‌యాణం చేసేవాడిని. ఎన్ని క‌ష్టాలు ప‌డితే ఏంటి?.. తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం. జూలై 14వ తేదీన విడుద‌ల కాబోతున్న మా సినిమాని చూశాక అందరూ మా యూనిట్‌ని కచ్చితంగా అభినందిస్తారనే నమ్మకం మాకుంది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu), ‘ద కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం మేము పడ్డ కష్టం అంతా మరిచిపోయేలా చేసింది. అలాగే... ఇప్పటివరకు మేము వేసిన ప్రీమియర్ షోస్ అన్నిటికీ మంచి స్పందన వచ్చింది. నూటికి నూరు శాతం మనస్పూర్తిగా మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా మాజీ సైనికులు ఈ సినిమా చూసి ఎంతో భావోద్వేగాలకు లోనై మమ్మల్ని అభినందించడం మేము ఎప్పటికీ మర్చిపోలేం’’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..

**************************************

*Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?

**************************************

*BroTheAvatar: మై డియర్ మార్కండేయ.. మనల్ని ఆపే మగాడెవడు ‘బ్రో’..!

**************************************

*Nayakudu: ‘నాయకుడు’కి రాజమౌళి, మహేష్ బాబు సపోర్ట్

**************************************

*Ticket Prices Hike: సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై రచ్చ రచ్చ

**************************************

Updated Date - 2023-07-08T22:12:00+05:30 IST