Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది

ABN , First Publish Date - 2023-05-09T18:39:18+05:30 IST

తొలిప్రేమ చిత్రంలో కీర్తి రెడ్డి (Keerthi Reddy) హీరోయిన్‌గా నటించగా.. వాసుకి (ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి భార్య) పవన్ కల్యాణ్ చెల్లిలి పాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ఆ సినిమా తర్వాత ఆమెకు బోలెడన్ని అవకాశాలు వస్తాయని అంతా ఊహించారు కానీ..

Vasuki Anand: పవన్ కల్యాణ్ సోదరి అందుకే రీ ఎంట్రీ ఇస్తున్నానంటోంది
Vasuki Anandi

పవన్ కల్యాణ్ (Pawan Kalyan), కరుణాకరణ్ (Karunakaran) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘తొలిప్రేమ’ (Tholiprema). పవన్ కల్యాణ్ కెరీర్‌ని టర్న్ చేసిన చిత్రమిదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేక అభిమానులున్నారు. ఇందులో కీర్తి రెడ్డి (Keerthi Reddy) హీరోయిన్‌గా నటించగా.. వాసుకి (ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి భార్య) పవన్ కల్యాణ్ చెల్లిలి పాత్రలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా.. ‘ఏరా బుజ్జి చివరకు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్లిపోతున్నావా?’ అని పవన్ కల్యాణ్ అడిగినప్పుడు.. ఆమె అన్నయ్యా.. అంటూ ఏడ్చేసే సీన్.. ఆ సినిమాకే ప్రధాన హైలెట్. అయితే.. ఆ సినిమా తర్వాత ఆమెకు బోలెడన్ని అవకాశాలు వస్తాయని అంతా ఊహించారు కానీ.. ఆమె నటనకు స్వస్తి చెప్పి.. ఆ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన పవన్ కల్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయి‌ (Anand Sai)ని వివాహం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు అంటే దాదాపు 23 సంవత్సరాల తర్వాత ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) అనే సినిమాతో వాసుకి (Vasuki) రీ ఎంట్రీ ఇస్తోంది.

స్వప్న సినిమా (Swapna Cinema) నిర్మాణంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో.. సంతోష్ శోభన్ (Santosh Soban), మాళవిక నాయర్ (Malvika Nair) ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ (Mitra Vinda Movies)‌తో కలిసి ప్రియాంక దత్ (Priyanka Dutt) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా‌పై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. మే 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి వాసుకి మీడియాతో చిత్ర విశేషాలతో పాటు ఆమె రీ ఎంట్రీకి గల కారణాలను చెప్పుకొచ్చారు.

Vasuki-3.jpg

ఆమె మాట్లాడుతూ.. ‘‘తొలిప్రేమ (Tholi Prema) తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు నచ్చిన అవకాశాలు కూడా వచ్చాయి. కానీ చేయడం నాకు కుదరలేదు. ఎందుకంటే నేను మల్టీ టాస్కర్ కాదు. అన్ని పనులు ఒకేసారి చేయలేను. ముందు పిల్లలు, వాళ్ళ చదువులు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారు. పాప మెడిసిన్ (ఫోర్త్ ఇయర్), బాబు సెకండ్ ఇయర్ ఆర్కిటెక్చెర్. నా భర్త ఆయన పనిలో బిజీగా వుంటారు. ఇప్పుడు ఏదైనా చేయడానికి నాకు సమయం కుదిరింది. ఇలాంటి సమయంలో నందిని రెడ్డి ఈ కథతో వచ్చారు. ఆమె చెప్పిన కథ నాకు నచ్చింది. సినిమాతో పాటు చదువుపై కూడా దృష్టి పెట్టాను. సైకాలజీలో పీహెచ్‌డి చేస్తున్నాను. (Vasuki Anand Interview)

ఇండస్ట్రీకి దూరం అయ్యాననే ఫీలింగ్ నాకసలు లేదు. ఎందుకంటే.. ఇరవై మూడేళ్ళుగా సినిమాలు చేయకపోయినప్పటికీ ఆనంద్ వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే వుంటుంది. అలాగే సినిమాలు చేసినప్పుడు కూడా నేను ఇండస్ట్రీ దగ్గర ఉన్నాననే ఫీలింగ్ లేదు. ఎందుకంటే.. నేను దేన్ని సీరియస్‌గా తీసుకొను. ఇదే మన దారి.. ఇదే చేయాలని అనుకోను. అది నా తత్త్వం. కొంచెం ఫిలసాఫికల్‌గా వెళ్ళిపోతాను.

Vasuki-2.jpg

ఇంత గ్యాప్ తర్వాత ఈ సినిమానే చేయడానికి కారణం ఏమిటంటే.. ఒక విరామం తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నామంటే మన కంఫర్ట్ జోన్ ముఖ్యం. ‘తొలిప్రేమ’ చేసినప్పుడు నాకు 18 ఏళ్ళు. అప్పుడు డైలాగ్ రాకపోయినా, తెలుగు రాకపోయినా, కొత్త స్థలమైనా.. ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతాం. ఈ ఏజ్‌లో రీఎంట్రీ చేయాలంటే మాత్రం ఒక సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ చూస్తాం. స్వప్న ఎప్పుడూ సినిమా చేయమని అడుగుతుండేది. ఫైనల్‌గా నాకు సినిమా చేయడానికి వీలు కుదిరింది. కథ విన్న వింటనే సేఫ్ అండ్ కంఫర్ట్ జోన్ ఫీలయ్యాను. వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమాలో చాలా క్యూట్ సిస్టర్ పాత్రలో కనిపిస్తా. అన్నీ ఫ్యామిలీస్‌లో వున్న సిస్టర్ క్యారెక్టర్‌లా ఉంటుంది. తమ్ముడు ఏం చేసినా సపోర్ట్ చేసే ఒక అక్క వుంటుంది. అలాంటి పాత్రే నాది. నాకు, సంతోష్ పాత్రకు చాలా మంచి బాండింగ్ వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. (Vasuki Anand about Anni Manchi Sakunamule)

Vasuki-1.jpg

ఈ రీఎంట్రీలో ‘తొలిప్రేమ’ చిత్ర ప్రభావం నాపై ఉంటుందని అనుకోను. కానీ ‘తొలిప్రేమ’ (Tholiprema) అనేది సెపరేట్ ఎరా(యుగం). అందులో వున్న కొన్ని అంశాలు ఇందులో ఉంటేనే ఈ పాత్రని అంగీకరించివుంటాను. ఆ పేరుని పాడు చేసుకోను కదా. తొలి ప్రేమకు దగ్గరగానే ఈ పాత్ర కనిపించింది. నిజానికి తొలిప్రేమ క్రెడిట్ దర్శకుడు కరుణాకరన్‌కి దక్కుతుంది. ఆ చిత్రానికి నంది అవార్డ్ (Nandi Award) వచ్చినపుడు కూడా.. ఆ క్రెడిట్ ఆయనదే అని చెప్పాను. అప్పుడు ఏం చేశానో నాకు పెద్దగా తెలీదు. కానీ ఇప్పుడు కొంచెం తెలిసింది. ఆ అంచనాలకు కొంచెమైన జస్టిఫికేషన్ చేయాలనే ‘అన్నీ మంచి శకునములే’ చేశాను. ఈ సినిమా సైన్ చేయడానికి మరో ప్రధాన కారణం లేడీ డైరెక్టర్ అని కూడా. నందిని పని తీరుకు చాలా ఇంప్రెస్ అయ్యాను. నిజానికి కథ బావుంటే తల్లి పాత్ర చేయడానికి కూడా రెడీనే. నందిని ఈ కథ చెప్పినపుడు.. అందులోని ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ పాత్ర చేశాను. నిజానికి నాకు బ్రదర్స్ లేరు. ఆ ఎమోషన్ నాకు పర్సనల్‌గా కనెక్ట్ కాదు. కానీ తొలిప్రేమలో కరుణాకరన్ చెప్పిన విధానం చాలా కనెక్టింగ్‌గా అనిపించింది. ఇప్పుడు నందిని కూడా చాలా మంచి ఎమోషన్‌తో ఈ సినిమాని తీశారు. భవిష్యత్‌లో కూడా నాకు నప్పే విధంగా పాత్ర వుండాలి, నాకు నచ్చాలి. ఒక మార్క్ క్రియేట్ చేసేలా వుండాలి. అలాంటి పాత్రలే వస్తాయని భావిస్తున్నాను..’’ అని వాసుకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*VD12: విజయ్ బర్త్‌డే స్పెషల్‌గా ప్రత్యేక పోస్టర్.. ఫ్యాన్స్ ఖుష్

*Kushi: సినిమా పేర్లతో విజయ్ దేవరకొండ, సమంత పాటేసుకున్నారు.. పాట ఎలా ఉందంటే..

*PKSDT: టైటిల్ ఫిక్సయిందా.. ‘దేవుడే దిగివచ్చినా’ కాదా?

*Tamanna: పొంగల్‌కి శృతిహాసన్.. ఇండిపెండెన్స్ డేకి తమన్నా..

*The Kerala Story: మరో స్టేట్‌లో నిషేధం.. షాక్‌లో చిత్రయూనిట్

*Shah Rukh Khan: అద్భుతాలు జరగడానికి సమయం పడుతుంది.. వెయిట్ అండ్ సీ..

Updated Date - 2023-05-09T18:47:23+05:30 IST