Sushmita Konidela: ‘వీరయ్య’ను చూస్తూ విజిల్స్ వేశా..
ABN , First Publish Date - 2023-01-14T12:58:02+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolly) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolly) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. మెగామాస్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోందీ చిత్రం. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన సుస్మిత కొణిదెల (Sushmita Konidela) చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
ఆమె మాట్లాడుతూ..
‘వాల్తేరు వీరయ్య’ కథ విన్నపుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. దర్శకుడు బాబీ కథ చెబుతున్నపుడు నా ఆలోచనలు చాలా వరకూ మ్యాచ్ అయ్యాయి. వాల్తేరు, పోర్ట్ , ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే ఒక ఇమాజినేషన్ వచ్చింది. బాబీ గారు ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే.. మాకు వింటేజ్ చిరంజీవి గారి లుక్ కావాలని చెప్పారు. మేము ఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో .. అలా వింటేజ్ గ్యాంగ్ లీడర్ .. లాంటి లుక్ కావాలని చెప్పారు. నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాం. దీంతో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి, శ్రుతి హాసన్ గారికి వారివారి డిజైనర్స్ పని చేశారు. అందరం ఒక మంచి సమన్వయంతో పని చేశాం. (Sushmita Konidela about Waltair Veerayya)
నాన్నగారి కాస్ట్యూమ్స్ విషయంలో ఆయనతో చర్చిస్తాను. ఆయనకి వున్న అనుభవంతో ఒక సీన్‌లో ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఇందులో కూడా ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు వుంటే బావుంటుందనే కొన్ని సూచనలు ఇచ్చారు. వింటేజ్ లుక్ తీసుకురావాలి.. అలా అని ఇది పిరియడ్ సినిమా కాదు కదా. యువతకు కూడా నచ్చేలా చేయాలి. ఇప్పుడున్న ట్రెండ్స్‌పై అవగాహన వుంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ని మిక్స్ చేస్తూ ఆయన నప్పే డిజైన్స్, షర్ట్స్ ప్రత్యేకంగా రూపొందించాం.
నాన్నగారిని తెరపై చూసినప్పుడు అద్భుతంగా అనిపించింది. ఇది నాన్నగారి మోస్ట్ కంఫర్ట్‌బుల్ జోన్. చూస్తున్నపుడు ఒక పెద్ద పండగలా అనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్‌కి వెళ్తున్న ప్రతి రోజ పండగలానే వుండేది. ఇంట్లో వారి గురించి చెప్పాలంటే.. మా అమ్మ.. లుక్ టెస్ట్ చేసినప్పుడే ఏది బావుంటుందో చెప్పేస్తుంది. అమ్మ ఇన్ పుట్స్ చాలా వుంటాయి. అలాగే ఎలావున్నా చరణ్ తప్పకుండా కాల్ చేస్తాడు. (Sushmita Konidela About Chiranjeevi)
నాన్నగారి సినిమాలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని చూస్తూ.. విజిల్స్ వేస్తాను. ఇందులో ఎలాంటి మొహమాటాలు లేవు. ఆయన అభిమానిగా మేము చేసే పనే అది. ఉదయం నాలుగు గంటలకి టీం అందరితో కలిసి షోకి వెళ్ళాం. అభిమానులతో పాటు ఈలలు గోలలు అరుచుకుంటూ వచ్చాం.
నాన్నగారి ఫిట్ నెస్ విషయంలో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. ఆయన హార్డ్ వర్క్ చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. ఫిట్‌గా వుండేవాళ్ళ కాస్ట్యూమ్స్ బావుంటాయి. దానిని మైండ్‌లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆయన మెంటైన్ చేస్తూ వచ్చారు. హెల్త్ పట్ల ఆయన చాలా స్పృహతో వుంటారు. నాన్నగారు తన లుక్‌ని, యాటిట్యూడ్‌ని యంగ్ చేసుకుంటూ వచ్చారు. నేను దానిని క్యాచప్ చేశానంతే. రంగస్థలంలో రామ్ చరణ్ కంటే.. ‘వాల్తేరు వీరయ్య’లో నాన్నగారే చాలా బాగా చేశారు. నాన్నగారంత చక్కగా ఈ మాస్ లుక్‌ని మరొకరు చేయలేరని భావిస్తున్నాను. (Sushmita Konidela Interview)
నాన్నగారితో పని చేయాలని అందరికీ ఉంటుంది. నాన్నగారు లాంటి స్టార్‌తో పని చేయాలని నిర్మాతలందరూ కోరుకుంటారు. అందరి నిర్మాతలకు చెప్పినట్లే నాకు కూడా ‘ముందు మంచి కథ తీసుకురా వెంటనే చేద్దాం’ అంటారు. మేము కూడా ఆ వేటలోనే వున్నాం. ప్రస్తుతం ‘భోళా శంకర్’ జరుగుతోంది. అలాగే రెండు వెబ్ సిరీస్‌లపై వర్క్ చేస్తున్నాం. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి. ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా విడుదలకు సిద్దంగా వుంది.