Sai Dharam Tej: చిన మామయ్యతో సినిమా.. పెద మామయ్య ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-07-26T16:43:41+05:30 IST
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఫస్ట్ లైమ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. పి. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూలై 28న విడుదలకాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను హీరో సాయిధరమ్ తేజ్ మీడియాకు తెలియజేశారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఫస్ట్ లైమ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’ (Bro). పి. సముద్రఖని (P Samuthirakani) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinvias) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. థమన్ (Thaman) సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌లో యూనిట్ యమా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ మీడియాకు ‘బ్రో’ సినిమా విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
‘బ్రో’ సినిమా చేయడం ఎలా ఉంది?
సినీ పరిశ్రమలో నా కెరీర్ ప్రారంభంలో నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో, ఆయనతో(పవన్ కళ్యాణ్) కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇది నన్ను నేను నిరూపించుకునే అవకాశం. కథ కూడా వినకుండానే సినిమా చేయడానికి అంగీకరించాను. మాతృక కూడా చూడలేదు. ఆ తర్వాత మొత్తం కథ విన్నాక చాలా బాగుంది అనుకున్నాను. ఇది నా కెరీర్‌కి ట్రిబ్యూట్ ఫిల్మ్. నేను గురువుగా భావించే మామయ్యతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషాన్నిచ్చింది.
ఫస్ట్ డే సెట్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలా అనిపించింది?
మొదటిరోజు కంగారు పడ్డాను, వణికిపోయాను. మావయ్య పిలిచి ఎందుకురా కంగారు పడుతున్నావు, నేనే కదా అంటూ నా టెన్షన్ అంతా తీసి పక్కనపెట్టారు. దాంతో వెంటనే సెట్ అయిపోయాను. సముద్రఖనిగారు కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. (Sai Dharam Tej Bro Interview)
కథతో పర్సనల్‌గా ఏమైనా కనెక్ట్ అయ్యారా?
కథ ఓకే అయ్యే సమయానికి నాకు యాక్సిడెంట్ జరగలేదు. అది యాదృచ్చికంగా జరిగింది. టైం విషయంలో మాత్రం కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కుటుంబంతో సమయం గడపటాన్ని ఇష్టపడతాను. మా అమ్మగారితో గానీ, నాన్న గారితో గానీ రోజులో ఏదొక సమయంలో కాసేపైనా గడుపుతాను. నా దృష్టిలో కుటుంబసభ్యులు, స్నేహితులతో సమయం గడపటం కంటే విలువైనది ఏదీ లేదు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి?.. ఆయన మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా?
త్రివిక్రమ్‌గారి లాంటి గొప్ప టెక్నీషియన్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాసిన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఏమైనా సలహాలు ఇచ్చినా కథ గురించే ఇస్తారు.
సెట్‌లో మెమొరబుల్ మూమెంట్ ఏంటి?
ప్రతి క్షణం మెమొరబుల్ మూమెంటే. మా మామయ్యతో అన్నిరోజులు సమయం గడిపే అవకాశం లభించింది. సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు నన్ను సరదాగా ఆటపట్టిస్తూనే ఉన్నారు. చిన్నప్పుడు నాతో ఎంత సరదాగా ఉండేవారో, ఇప్పటికీ నాతో అలాగే ఉన్నారు. చిన్నప్పుడు నేను కళ్యాణ్ మామయ్యతో ఎక్కువ సమయం గడిపేవాడిని. దాంతో తెలియకుండానే ఆయనతో ఓ ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
షూటింగ్ ప్రారంభమైన మొదట్లో మీరు కాస్త ఇబ్బంది పడ్డారని ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా?
యాక్సిడెంట్ తర్వాత అప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడు మాట ఇంత గట్టిగా వచ్చేది కాదు. దాంతో డైలాగ్‌లు చెప్పేటప్పుడు ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసింది. డబ్బింగ్ విషయంలో బాగా కష్టపడ్డాను. అప్పుడు నాకు పప్పుగారు బాగా సపోర్ట్ చేశారు. ‘విరూపాక్ష’ సమయంలో కూడా ఆయన బాగా సపోర్ట్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు?
పవన్ కళ్యాణ్‌గారి సపోర్ట్ నాకు ఈ సినిమాకి మాత్రమే కాదు.. నా మొదటి సినిమా నుంచి ఉంది. మనం ఊపిరి పీల్చుకోవడానికి గాలి ఎలాగైతే ఉందో, ఆయన సపోర్ట్ కూడా నాకు అలాగే ఉంది.
పవన్ కళ్యాణ్‌తో మీరు సినిమా చేస్తున్నారని తెలియగానే మీ పెద మామయ్య మరియు ఇతర కుటుంబసభ్యుల స్పందన ఏంటి?
అందరూ చాలా సంతోషపడ్డారు. చిరంజీవిగారైతే (Chiranjeevi) మీ గురు శిష్యులకు బాగా కుదిరింది అంటూ చాలా ఆనందపడ్డారు.
మీ ఫ్యామిలీ హీరోలతో కాకుండా వేరే హీరోలతో పని చేయాలని ఉందా?
ఖచ్చితంగా ఉంటుంది. మంచి కథ దొరికితే నేను ఎవరితోనైనా చేయడానికి సిద్ధమే. ముఖ్యంగా రవితేజగారు, ప్రభాస్ అన్నతో చేయాలని ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ అన్న, నా ఫ్రెండ్ తారక్, మనోజ్ ఇలా అందరితో చేయాలని ఉంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నారు.. ఆ ప్రభావం సెట్‌లో ఏమైనా కనిపించిందా?
రాజకీయంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా, ఎన్ని పనులున్నా ఒక్కసారి సెట్ లోకి వచ్చారంటే సినిమాలోని ఆ పాత్రకు ఎలా చేయాలనే ఆయన ఆలోచిస్తారు. బయట విషయాలన్ని మర్చిపోయి, ప్రస్తుతం చేస్తున్న సన్నివేశానికి ఏం అవసరమో అది చేయగలగడం అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను.
షూటింగ్ సమయంలో ఏమైనా ఒత్తిడి అనిపించిందా?
మామయ్యతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఏరోజు కూడా కొంచెం కూడా ఒత్తిడి అనిపించలేదు. ఆయన గడిపే సమయం నాకు చాలా విలువైనది. కాబట్టి ఒత్తిడి అనే మాటే ఉండదు. (Sai Dharam Tej About Bro Movie)
హీరోయిన్లు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ గురించి?
వైష్ణవ్‌తో ఒక సినిమా చేసింది కాబట్టి కేతిక నాకు ముందుగానే తెలుసు. మన తెలుగు భాష కానప్పటికీ కేతిక గానీ, ప్రియా గానీ ముందే డైలాగ్ లు ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యేవాళ్ళు. అది చూసి నాకు ముచ్చటేసింది. ఇద్దరిది కష్టపడి చేసే స్వభావం.
సినిమా ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో సందేశం ఉంటుంది. ఈ క్షణంలో బ్రతకడం గురించి చెబుతుంది. మన కష్టం మనం పడితే అందుకు తగిన ప్రతిఫలం దక్కుతుందని చెబుతుంది. అదే సమయంలో కామెడీ, రొమాన్స్ ఇలా మిగతా అంశాలన్నీ కావాల్సిన మోతాదులో ఉంటాయి.
థమన్ సంగీతం గురించి?
సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సంగీతం అద్భుతంగా ఉందని చెప్తారు. క్లైమాక్స్ లో ఆయన అందించిన నేపథ్య సంగీతానికి నేనైతే కంటతడి పెట్టుకున్నాను. సముద్రఖనిగారు, థమన్‌గారు కలిసి మ్యాజిక్ చేశారు.
త్రివిక్రమ్‌గారి సంభాషణలు ఎలా ఉండబోతున్నాయి?
ఎప్పటిలాగే చాలా బాగుంటాయి. ముఖ్యంగా సినిమా చివరిలో నాకు, కళ్యాణ్ మావయ్యకి మధ్య సంభాషణలు కట్టిపడేస్తాయి. తేలికైన పదాలు లాగే ఉంటాయి కానీ అందులో లోతైన భావం ఉంటుంది.
కొద్దిరోజులు విరామం తీసుకోవాలి అనుకుంటున్నారా?
ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలని చిన్న విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. ‘విరూపాక్ష’ (Virupaksha) తర్వాతే తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఇంతలో ‘బ్రో’ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే చాలా మెరుగయ్యాను. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకొని మరింత దృఢంగా వస్తాను. ప్రస్తుతం సంపత్ నంది (Sampath Nandi)గారి దర్శకత్వంలో ఒక సినిమా అంగీకరించాను.
మిమ్మల్ని యాక్సిడెంట్ సమయంలో కాపాడిన అబ్దుల్‌కి ఏమైనా సాయం చేశారా?
కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. నేను అతనికి కొన్ని డబ్బులిచ్చి చేతులు దులుపుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే అతను నా ప్రాణాన్ని కాపాడాడు. నేను అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని చెప్పాను. ఈమధ్య కూడా అతన్ని కలిశాను. నా టీం అతనికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది.
మెగాస్టార్ (Megastar Chiranjeevi)తో కలిసి ఎప్పుడు నటిస్తారు?
ముగ్గురు మామయ్యలతో కలిసి నటించాలని నాకు ఎప్పటినుంచో ఆశ. నాగబాబు (Nagababu) మావయ్యతో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్‌లో నటించాను. కళ్యాణ్ మామయ్యతో ‘బ్రో’ చేశాను. అలాగే పెద మామయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి?
వారిలో స్పెషాలిటీ ఉంది. అప్పుడు వెంకటేష్‌గారు, చైతన్యతో కలిసి ‘వెంకీమామ’ (Venky Mama) చేశారు. ఇప్పుడు కళ్యాణ్ మామ, నాతో కలిసి ‘బ్రో’ చేశారు. ఆ బ్యానర్ లో సినిమా చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది. చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ బ్యానర్‌లో సినిమా చేస్తాను.
ఇవి కూడా చదవండి:
**************************************
*Samuthirakani: ఆ చిరునవ్వుని ఎప్పటికీ మరిచిపోలేను..
**************************************
*Anasuya: ఇందుకు కదా.. కుర్రాళ్లు పడిపోయేది.. ఏముందిరా నాయన?
**************************************
*Bhairava Dweepam: 4K క్వాలిటీతో ‘భైరవద్వీపం’ రీ రిలీజ్.. ఇది కరెక్ట్ టైమ్ కాదంటున్న ఫ్యాన్స్
**************************************
*Sara Arjun: సారా అర్జున్‌ని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న దర్శకుడెవరో తెలుసా?
**************************************
*Prathinidhi 2: నారా రోహిత్ కమ్ బ్యాక్ ఫిల్మ్ డిటైల్స్.. వచ్చేశాయ్
**************************************