Ramu Kona: ఈ ‘రుద్రంకోట’ దర్శకుడికి స్ఫూర్తి ఎవరో తెలుసా?
ABN , First Publish Date - 2023-09-19T21:24:58+05:30 IST
సీనియర్ నటి జయలలిత సమర్పకురాలిగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’. ఏఆర్‌కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. రుద్ర, శక్తి, విభీష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది.
సీనియర్ నటి జయలలిత సమర్పకురాలిగా వ్యవహిరిస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రుద్రంకోట’ (Rudram Kota). ఏఆర్‌కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మిస్తున్నారు. రుద్ర, శక్తి, విభీష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ సందర్భంగా ఐదు వేలకు పైగా సీరియల్ ఎపిసోడ్స్‌కు డైరక్షన్ చేసి, ‘రుద్రంకోట’ చిత్రంతో వెండితెర దర్శకుడుగా పరిచయం కాబోతోన్న రాము కోన (Ramu Kona) మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ..
‘‘నేను 2001లో నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. చాలా ప్రయత్నాలు చేశాను కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరుణంలో ఒక మేకప్ మ్యాన్ ద్వారా ‘పద్మవ్యూహం’ సీరియల్‌కు కొన్ని రోజులు పని చేశాను. ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కూడా మానేశాను. ఇలా కాదని మద్రాసు వెళ్లాను. అక్కడ మిత్రుడి ద్వారా డైరెక్టర్ సురేష్ గారి వద్ద ఒక సీరియల్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. అలా ఆయన దగ్గర చాలా వర్క్ నేర్చుకున్నా. ఇప్పటి వరకు అన్ని మేజర్ టీవీ ఛానల్స్‌లో హిట్ సీరియల్స్ డైరెక్ట్ చేశాను. ఇలా సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్న సమయంలోనే ‘రుద్రంకోట’ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. (Rudram Kota Director Ramu Kona)
‘రుద్రంకోట’ కథ విషయానికి వస్తే.. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశాము. శ్మశాన వాటికలో పెరిగి పెద్దవాడైన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. లవ్ అండ్ లస్ట్‌తో సాగే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. అండర్ కరెంట్‌గా మంచి సందేశం కూడా అందిస్తున్నాం. అదేంటో సినిమాలో చూస్తే అర్థమవుతుంది.
ఇందులో లీడ్ రోల్‌లో సీనియర్ నటి జయలలిత నటించారు. కోటమ్మ పాత్రలో తను నటించిన తీరు అద్భుతం. అలాగే హీరోగా రుద్ర నటించాడు. తనకు ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా నటించాడు. అమ్మాయిలంటే గిట్టని పాత్రలో తను ఒదిగిపోయాడు. అలాగే హీరోయన్స్ శక్తి, విభీష ఇద్దరూ పోటీ పడి నటించారు. ప్రతి పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు పాటలున్నాయి. సుభాష్ ఆనంద్, నిరంజన్ ఇద్దరు సంగీత దర్శకులు. ఇటీవల టిప్స్ ఆడియో కంపెనీలో పాటలు విడుదలై మంచి వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి.
అశ్వారావుపేట దగ్గర ‘రుద్రంకోట’ అనే విలేజ్‌లో 26 రోజుల్లో సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేశాము. సుచిత్ర చంద్రబోస్‌గారు ఒక పాటకు కొరియోగ్రఫీ చేయగా.. కీర్తి శేషులు శివ శంకర్ మాస్టర్ ఒక రొమాంటిక్ సాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే శివతాండవం పాటకు కొరియోగ్రఫీ చేశారు. మాస్టర్ ఇప్పుడు లేకపోవడం బాధాకరం. పాటలు వినడానికి ఎంత బావుంటాయో చూడటానికి అంతకన్నా బావుంటాయి. జయ లలితగారు చేసిన కోటమ్మ పాత్ర సినిమాకు హైలెట్. అలాగే మ్యూజిక్ కూడా మరో హైలెట్‌గా నిలుస్తుంది. ఇప్పటి వరకు జయలలిత గారితో నేను చాలా సీరియల్స్‌కు పని చేశాను. ఆ అభిమానంతో నేను తన పేరు సమర్పకురాలిగా వేసుకున్నాను. జయలలిత గారు మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడిగా నాకు ఆదర్శం ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) గారు. ఆయన కూడా మొదట ‘శాంతి నివాసం’ అనే సీరియల్ చేశారు. ఆ తర్వాత సినిమాలు డైరెక్ట్ చేసి...తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఆదర్శంతోనే సీరియల్ నుంచి నేను కూడా సినిమాల వైపు వచ్చాను.
సీరియల్స్, సినిమాలకు ఉన్న తేడా ఏమిటంటే.. సీరియల్స్‌కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నేను తెలియకపోయినా ప్రతి ఒక్క ఇంట్లో మహిళకు నా సీరియల్ తెలుసు. కానీ సినిమా అలా కాదు.. ఒక సినిమా హిట్ కొట్టామంటే.. మనకు కూడా మంచి ఫాలోయింగ్, పేరు వస్తుంది. సీరియల్‌కు ఉండే కష్టం సినిమాకు ఉండదు..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
============================
*RAM: పవర్‌ఫుల్ డైలాగ్‌తో వచ్చిన ర్యాపిడ్ యాక్షన్ మిషన్ గ్లింప్స్
****************************************
*Martin Luther King: అక్కడ యోగిబాబు అరిపించేశాడు.. ఇక్కడ సంపూ ఏం చేస్తాడో...?
***************************************
*Devil: సింగర్ సిద్ శ్రీరామ్.. మరోసారి మాయ చేసేశాడు
***************************************
*Jailer Villain Vinayakan: రెమ్యూనరేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ‘జైలర్’ విలన్
**************************************