Ustad: కీరవాణి కుమారుడు శ్రీసింహా కోడూరి, రాజమౌళితో ఏమి చెపుతూ ఉంటాడంటే...

ABN , First Publish Date - 2023-08-11T18:37:18+05:30 IST

యువ నటుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, అగ్ర సంగీత దర్శకుడు అయిన కీరవాణి కుమారుడు సింహ కోడూరి క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘ఉస్తాద్’ సినిమా రేపు శనివాసరం విడుదలవుతోంది. దీనికి ద‌ర్శ‌కుడు ఫ‌ణిదీప్, కావ్యా క‌ళ్యాణ్ రామ్ కథానాయిక. ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాకి నిర్మాతలు. ఈ సినిమా విడుదల సంద‌ర్భంగా శ్రీసింహా మీడియాతో మాట్లాడాడు

Ustad: కీరవాణి కుమారుడు శ్రీసింహా కోడూరి, రాజమౌళితో ఏమి చెపుతూ ఉంటాడంటే...
Ustaad Film

ఈ 'ఉస్తాద్' #Ustaad సినిమా కథ ఎప్పుడో విన్నాను అని, ‘మత్తువదలరా’ #MathuVadalara టైములోనే ఈ సినిమా విని ఓకే చెప్పాను అని చెప్పాడు శ్రీసింహ (SriSimha). అయితే షూటింగ్ ఆల‌స్యం వలన ఇప్పుడు తన సినిమాలు అన్నీవ‌రుస‌గా ఇప్పుడు విడుద‌ల‌వుతున్న‌ట్లు అనిపిస్తున్నాయి అని చెప్పాడు.ఇందులో సూర్య అనే యువ‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తాను అని చెపుతూ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన నాలుగు సినిమాల్లో ఇందులో తన క్యారెక్ట‌ర్ మీదే కథ ర‌న్ అవుతుంది అని చెప్తున్నాడు. నటుడిగా సంతృప్తిని ఇచ్చిన సినిమా ఈ 'ఉస్తాద్' #Ustaad అని అన్నాడు సింహ.

srisimhakoduri.jpg

సినిమాకి 'ఉస్తాద్' అనే టైటిల్ ఎందుకు పెట్టవలసి వచ్చిందో చెప్పాడు. ఒక ప‌నిలో ఎక్స్‌ప‌ర్ట్‌ని ఉస్తాద్ అని పిలుస్తుంటాం, అలాగే ఇది ఉర్దూ ప‌దం. గురువును కూడా ఉస్తాద్ అని పిలుస్తుంటాం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే, ఇందులో కథానాయకుడు త‌న ఎమోష‌న్స్‌ను బైక్ వ‌ల్ల కంట్రోల్ చేసుకోగ‌లుగుతాడు. అతనికి లైఫ్‌లో బైక్ వ‌ల్ల చాలా విష‌యాలు జ‌రుగుతాయి. అందుక‌నే త‌న బైక్‌నే ఉస్తాద్ అని పిలుచుకుంటుంటాడు. సినిమాలో కథానాయకుడికి కోపం ఎక్కువ‌గా వ‌స్తుంటుంది, లైఫ్‌లో గోల్ ఉండ‌దు, అలాంటి ఒక వ్య‌క్తి బైక్ వ‌ల్ల ఎలా స‌రైన దారిలో పడ్డాడు అనేదే క‌థ‌.

srisimhakoduri2.jpg

ఇందులో మూడు వేరియేషన్స్ వుంటాయని, ఒకటి కాలేజ్ స‌మ‌యంలో ఎలా ఉంటాడు, కాలేజ్ త‌ర్వాత లైఫ్‌లో ఏం చేయాలో తెలియ‌ని స్థితి, మూడోది ఫైల‌ట్ అయిన త‌ర్వాత త‌న లైఫ్ ఎలా సాగుతుంద‌నేది చూడొచ్చు. కాలేజ్ కుర్రాడి పాత్ర చేస్తున్న‌ప్పుడు ఎక్స‌ర్‌సైజులు, స్పెష‌ల్ డైట్ తీసుకుని చాలా బ‌రువు త‌గ్గాను అని చెప్పాడు. ఇంకో పాత్ర కోసం గ‌డ్డం, జుట్టు పెంచాడు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌ (GautamVasudevMenon) ఒక ముఖ్యమైన రోల్ చేశారు. ప్రేక్ష‌కుల‌కు ఆయన రోల్ బాగా న‌చ్చుతుంది అని చెపుతున్నాడు. జూనియ‌ర్స్‌ను చుల‌క‌న‌గా చూసే ఓ సీనియ‌ర్ ఫైల‌ట్ రోల్‌లో ఆయ‌న క‌నిపిస్తారు. ఆయ‌న చేయ‌టం వలన ఆ పాత్ర‌కు కొత్త‌ద‌నం వచ్చింది, అంతే కాకుండా ఆయ‌న‌కు మా 'ఉస్తాద్' సినిమా దర్శకుడు ఫణి (Phani) పెద్ద అభిమాని కూడా.

ustaad1.jpg

ఈ సినిమాలో మూడు వేరియేష‌న్స్‌లో క‌నిపించ‌టం అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది, ఎందుకంటే ఒక్కో పాత్రకి ఒక్కో ఏజ్‌కు త‌గ్గ‌ట్లు బాడీ లాంగ్వేజ్‌లోనూ తేడా తీసుకురావాలి, అందుకని ఇది ఒక చాలెంగింగ్ పాత్ర. ఎటువంటి కథలను ఎంచుకోవాలనేది మాత్రం తన చేతుల్లోనే ఉంటుంది అని, ఏదైనా డౌట్ వస్తే మాత్రం కార్తికేయ (SSKarthikeya), భైరవన్నని (KalaBhairav) అడుగుతూ వుంటాను అని చెప్పాడు శ్రీసింహ. అలాగే తను చేసే సినిమాల గురించి రాజ‌మౌళిగారు (SSRajamouli) చెబుతుంటారు, ఇక నాన్న‌ (MMKeeravani), బాబాయ్ స‌హా ఇంట్లోని వారంద‌రూ వారి ఆలోచ‌న‌ల‌ను చెబుతారు అని చెప్పాడు. కెరీర్ ప్రారంభంలోనే డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఉన్న సినిమాలు చేయ‌టం మంచి విష‌య‌మే అని అంటాడు. ఈ సినిమాలో కథానాయిక కావ్యా క‌ళ్యాణ్ రామ్‌ను (KavyaKalyanRam) ఆమె చేసిన 'మ‌సూద' #Masooda విడుదల కాక‌ముందే తీసుకున్నాం. త‌న‌కు ఏమి కావాలో క్లారిటీ లేని క‌న్‌ఫ్యూజింగ్ అమ్మాయి పాత్ర‌లో ఆమె న‌టించింది ఈ సినిమాలో.

Updated Date - 2023-08-11T18:37:18+05:30 IST