Manoj Bajpayee: పవన్ కల్యాణ్ ఆల్రెడీ చేశారు.. మహేష్ బాబు అయితే బెటర్!
ABN , First Publish Date - 2023-06-12T21:13:11+05:30 IST
మనోజ్ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ ఒరిజినల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వంలో జీ స్టూడియోస్‌తో కలిసి భన్సాలి స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం హిందీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించగా.. జూన్ 7న తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రొమోషన్స్‌లో భాగంగా తన పాత్ర తెలుగులో మహేష్ చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రంలో నేను కాకుండా.. తెలుగు నటుడు ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తే.. ఇప్పటికే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లాయర్‌గా చేసి మెప్పించారు కాబట్టి.. మహేష్ బాబు (Mahesh Babu) అయితే ఈ పాత్రకు సూట్ అవుతారనిపిస్తోందని అన్నారు ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా విలక్షణమైన పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయి (Manoj Bajpayee). ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెబ్ ఒరిజినల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ (Sirf Ek Bandaa Kaafi Hai). జీ స్టూడియోస్‌తో పాటు భన్సాలి స్టూడియోస్ బ్యానర్స్‌పై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేశారు. ఈ రెండు భాషల్లోనూ మంచి స్పందనను రాబట్టుకోవడంతో.. సోమవారం టాలీవుడ్ మీడియాతో నటుడు మనోజ్ బాజ్‌పాయి ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఆయన మాట్లాడుతూ.. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రం ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేమెవ్వరం ముందుగా ఊహించలేదు. అయితే ఓ మంచి సినిమాను చేయాలని మేం భావించాం. అందులో భాగంగా అందరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. అలాగే ఆ దేవుడు దయ కూడా తోడు కావటంతో ఓ మంచి సినిమాను అందించామని భావిస్తున్నాను. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. కొందరైతే రెండు, మూడు సార్లు చూస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తోంది. అందుకే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. (Manoj Bajpayee Special Interview)
మా దర్శకుడు అపూర్వ సింగ్ కర్కి.. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ కోసం మూడు నాలుగు కెమెరాలు వాడారు. సింగిల్ టేక్‌లో ఏడు పేజీలున్న మోనోలాగ్‌ను కంప్లీట్ చేయాలని నాతో అన్నారు. అందుకోసం నాకు రెండు రోజుల సమయం కూడా ఇచ్చారు. ఆయన చెప్పినట్లుగానే సింగిల్ టేక్‌లో పూర్తి చేయాలని రెండు రోజుల పాటు బాగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన సోలంకి అనే లాయర్ పాత్ర కామన్ మ్యాన్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకనే ఆ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎన్నో కష్టనష్టాలున్నప్పటికీ దాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే సాధారణ మధ్యతరగతి ప్రజలందరికీ ఈ పాత్ర ఓ ఉదాహరణ. ఈ కాన్సెప్ట్‌ను మన చుట్టూ జరుగుతున్న పలు నిజ ఘటనలను ఆధారంగా తయారు చేశాం. అయితే ప్రధానంగా ఈ సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితులను చూపించాం. అలాగే ఆమెకు, సోలంకితో ఉన్న ఓ మంచి అనుబంధాన్ని చూపించే ప్రయత్నం చేశాం. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా న్యాయ వ్యవస్థే మూలస్తంభంలాంటిది. అందుకనే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ చిత్రాన్ని లాయర్స్‌కి, న్యాయ వ్యవస్థకి అందించిన నివాళిగా భావిస్తున్నాం. (Bollywood Actor Manoj Bajpayee)
సోలంకి (Solanki) పాత్రలో నటించటానికి చాలా హోం వర్క్ చేశాను. స్క్రిప్ట్ మొత్తం పదే పదే చదివాను. ముఖ్యంగా లాయర్ రోల్ ఎలా ప్రవర్తిస్తుంది.. మాట్లాడుతుంది ..ఇలా ప్రతీ చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. నాకు నేనుగా ఆ పాత్రకు మనసులో ఓ రూపంలో క్రియేట్ చేసుకుని దాన్ని ప్రొజెక్ట్ చేశాను. హిందీలో ఈ సినిమా ఓ హిస్టరీ క్రియేట్ చేసింది. ఎందుకంటే ముందు ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు సహా ఇతర రీజనల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశాం. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
జీ5 వారికి ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ (Sirf Ek Bandaa Kaafi Hai) సినిమాను చూడగానే నచ్చింది. అందుకనే వారు దాన్ని ఓటీటీలో వీలైనంత ఎక్కువ మందికి రీచ్ చేయించాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మన సినిమాల్లో చాలా కోర్ట్ రూమ్ డ్రామాస్ వచ్చాయి. ఈ సినిమా విషయానికి వచ్చేసరికి మేం లార్జర్‌దేన్ లైఫ్‌గా చేయాలనుకోలేదు.. ఉన్నది ఉన్నట్టుగా చూపించాలనుకున్నాం. దీన్ని ఒక కమర్షియల్ మూవీగా కూడా చేసి ఉండొచ్చు. కానీ.. మేం అలా చేయాలనుకోలేదు. ఓ ఎక్స్‌పెరిమెంట్‌లాగానే చేశాం. ఆ ప్రయత్నం వల్లనే బెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా అందరూ చెబుతున్నారు.
ఈ సినిమాలో నేను కాకుండా మరో తెలుగు నటుడు ఎవరైతే బావుంటుందని ఆలోచిస్తే.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాయర్‌గా చేసి మెప్పించారు. మహేష్ బాబు అయితే ఈ పాత్రకు సూట్ అవుతారనిపిస్తోంది. రీసెంట్‌గా నేను ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ చూశాను. అది కాకుండా ఇండిపెండెంట్ మూవీస్ ఎక్కువగా చూడటానికి ఇష్టపడతాను.. చూస్తుంటాను కూడా. సినిమా షూటింగ్స్ లేనప్పుడు పుస్తకాలు చదువుతుంటాను. ఫ్యామిలీతో గడుపుతుంటాను. హైదరాబాద్ (Hyderabad) వచ్చినప్పుడు రాయలసీమ రుచులుకి వెళుతుంటాను. ఎందుకంటే నేను ఎక్కువగా స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడతాను. అలాగే బిర్యానీని కూడా ఇష్టంగా తింటాను.. అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Ravi Teja: పెయింటరా? లేక పత్తి పండించే రైతా?.. మాస్ రాజా ఖాతాలో మరొకటి!
**************************************
*Ileana: నా కన్నీళ్లు తుడిచాడు.. తన ప్రియుడిపై ఇలియానా ఆసక్తికరమైన వ్యాఖ్యలు
*********************************
*Gopichand: ‘రామబాణం’ తర్వాత మరో పవర్‌ఫుల్ టైటిల్‌తో.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
******************************
*Sreeleela: నిర్మాతలకు ‘నో’ చెబుతున్న శ్రీలీల
***************************
*Samantha: క్లబ్‌లో బీర్ కొడుతూ.. ‘ఊ అంటావా మావ’ పాటకి నాటు నాటు స్టెప్స్.. వీడియో వైరల్
********************************
*VarunLav: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు
*******************
*Sharwa-Rakshita: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి
*********************************