Samyuktha Menon: పవర్ స్టార్ ఫ్యాన్స్ నాపై ఎంతో ప్రేమ చూపించారు

ABN , First Publish Date - 2023-02-13T22:04:04+05:30 IST

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ (Fortune Four Cinemas)తో కలిసి తెలుగు, తమిళ భాషలలో

Samyuktha Menon: పవర్ స్టార్ ఫ్యాన్స్ నాపై ఎంతో ప్రేమ చూపించారు
Heroine Samyuktha Menon

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ (Fortune Four Cinemas)తో కలిసి తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’ (Sir) (తెలుగు)/‌ ‘వాతి’(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్ (Dhanush), సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా.. వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా చిత్ర హీరోయిన్ సంయుక్త మీనన్.. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

ఆమె మాట్లాడుతూ..

నేను 2016లో మొదటి సినిమా చేశాను. అప్పటికి సినిమానే కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకోలేదు. నేను కేరళలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయిని. చుట్టు పక్కల వాళ్లకి ఏదో ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి అనుకున్నాను. మొదటి సినిమా తర్వాత చదువు కోసం ఒక ఏడాది విరామం తీసుకున్నాను. కానీ విధి మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చింది. నటిగా సంతృప్తినిచ్ఛే ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుని సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు సినిమానే జీవితం అయిపోయింది. నటిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాలి అనుకుంటున్నాను. తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇది నా కెరీర్ లో ఉత్తమ దశ అనిపించింది. (Sir Movie)

తెలుగులో నేను మొదట ‘బింబిసార’ (Bimbisara), ఆ తరువాత ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాలను అంగీకరించాను. ఈ సినిమాలు విడుదలైన తర్వాత కొత్త సినిమాల గురించి ఆలోచించాలి అనుకున్నాను. కానీ ఇంతలో సితార బ్యానర్‌లో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak)లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా సమయంలోనే నా నటన నచ్చి సితారలో మరో సినిమా అవకాశమిచ్చారు. అదే ‘సార్’ చిత్రం. డైరెక్టర్ వెంకీ గారు కథ చెప్పగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. కథ చాలా బాగుంది, అందులో నా పాత్ర కూడా నచ్చడంతో వెంటనే అంగీకరించాను. ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. కొన్ని పాత్రల కోసం ముందుగానే హోమ్ వర్క్ చేయాలి. కొన్ని కొన్ని పాత్రలు మాత్రం అప్పటికప్పుడు సహజంగా చేస్తేనే బాగుంటుంది. ఇందులో నేను తెలుగు పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని గ్రామాలకు వెళ్ళాను. అలాగే పాత్ర గురించి బాగా తెలుసుకోవడానికి డైరెక్టర్, రైటర్‌తో ఎక్కువ చర్చించాను. అంతేకాకుండా టీచర్ల చీరకట్టు ఎలా ఉంటుంది? వాళ్ళ మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ గమనించాను. (Samyuktha Menon Sir Interview)

Menon.jpg

ధనుష్‌తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటినుంచో ఆయన సినిమాలు చూస్తున్నాను. ఆయనకు అభిమానిని. ఆయన మంచి నటుడు, అలాగే పెద్ద స్టార్ కూడా. ఎక్కువ తక్కువ కాకుండా పాత్రకు ఏం కావాలో అది చేస్తారు. ఆయన నుంచి నటనలో మెళకువలు నేర్చుకున్నాను. అలాంటి నటుడితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ వెంకీగారి గత సినిమాల్లో మాదిరిగానే ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో నేను మీనాక్షి అనే బయాలజీ టీచర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రతో పాటు నా పాత్ర కూడా బలంగా ఉంటుంది. సినిమా ప్రధాన కథలోకి వెళ్ళినప్పుడు హీరో పాత్రతో పాటు నా పాత్ర ప్రయాణం సాగుతుంది.

కెరీర్ ప్రారంభంలోనే పెద్ద హీరోలతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తాను కానీ.. ముందుగా కథ ఎలా ఉంది? పాత్ర ఎలా ఉంది? అని చూస్తాను. కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇంకా దానికి స్టార్ తోడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఆ హీరో అభిమానుల ప్రేమ కూడా దక్కుతుంది. భీమ్లా నాయక్ సమయంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారి అభిమానులు ఎంతో ప్రేమ చూపించారు.

‘సార్’ సినిమాలో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడమే కాదు.. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి. డైరెక్టర్ వెంకీ అట్లూరిలో మంచి రచయిత, దర్శకుడు ఇద్దరూ ఉన్నారు. నటీనటుల నుంచి మంచి ఎమోషన్స్ రాబట్టుకుంటారు. ఆయన సెట్‌లో చాలా సరదాగా ఉంటారు. దర్శకుడిగా తన పనిని వంద శాతం చేస్తారు. ప్రస్తుతం నేను చేస్తున్న ‘విరూపాక్ష’ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ‘బింబిసార-2’ ప్లాన్ చేస్తున్నారు. (Samyuktha Menon Interview)

Updated Date - 2023-02-13T22:38:52+05:30 IST