Avika Gor: అలాంటి వారంతా ‘వధువు’ కోసం ఓటీటీకి వస్తారు
ABN , First Publish Date - 2023-12-01T16:45:21+05:30 IST
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘వధువు’. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌ను ఎస్వీఎఫ్ బ్యానర్‌లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ ‘వధువు’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ విశేషాలను నటి అవికా గోర్ మీడియాకు తెలియజేసింది.
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ‘వధువు’ (Vadhuvu). అవికా గోర్ (Avika Gor), నందు (Nandu), అలీ రెజా (Ali Reza) కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ వెబ్ సిరీస్‌ను ఎస్వీఎఫ్ బ్యానర్‌లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ (Poluru Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ ‘వధువు’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్ విశేషాలను నటి అవికా గోర్ (Avika Gor Interview) మీడియాకు తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ..
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఇటీవల ‘మాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్‌లో నటించాను. అదే టైమ్‌లో ‘వధువు’ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. బెంగాలీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్‌లో నేను ఇప్పటి వరకు నటించలేదు. నేను గతంలో చేసిన బబ్లీనెస్ ఈ క్యారెక్టర్‌లో ఉండదు. ఒక యూనిక్ క్యారెక్టర్ దొరికింది.
ఈ వెబ్ సిరీస్‌లో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయా? అని అందరూ అడుగుతున్నారు. ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉండవు. థ్రిల్లర్ జానర్‌లో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. మీరు ట్రైలర్‌లో చూసినట్లు మిస్టరీ సన్నివేశాలు ఉంటాయి. టీవీలో సీరియల్స్ చేసిన అనుభవం నాకు ఉంది. టీవీ ఆడియెన్స్‌కు ఎలాంటి కంటెంట్ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇప్పటి వరకు ఓటీటీ చూడకుండా టీవీ కంటెంట్ ఇష్టపడేవారు ‘వధువు’ కోసం ఓటీటీకి వస్తారనే నమ్మకం ఉంది. ఆ సెక్షన్ ఆడియెన్స్‌ను ‘వధువు’తో బాగా ఆకర్షించబోతున్నాం. (Avika Gor About Vadhuvu)
దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు.. అందులోని ప్రశ్నలు నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ఇలా ఎందుకు జరిగింది అనే ఎన్నో ప్రశ్నలు స్క్రిప్ట్‌లో ఉంటాయి. అవన్నీ ఆడియెన్స్‌కు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. బెంగాలీ ఒరిజినల్ వెబ్ సిరీస్‌లోని కొన్ని ఎపిసోడ్స్ చూశాను. జస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే ఆ ఎపిసోడ్స్ చూశా. మొత్తం చూస్తే నేను ఇందులో.. నా వెర్షన్‌లో సహజంగా నటించలేనేమో అనిపించింది. స్క్రిప్ట్‌లోని సస్పెన్స్ ఆకట్టుకుంటుంది.
‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ చేసేప్పుడు నాకు పదేళ్ల వయసు. అప్పటికి పెళ్లంటే ఏంటి? పెళ్లి కూతురు ఎలా ఉండాలి? ఇంట్లో ఎలా వ్యవహరించాలి? అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. సందేహాలు వస్తే డైరెక్టర్‌ను అడిగేదాన్ని. ఇప్పుడు ‘వధువు’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. పెళ్లి, వధువు అంటే ఏంటి అనే విషయాలు తెలుసు. చిన్నప్పుడే నటిగా మారడం వల్ల త్వరగా అన్ని విషయాలు నేర్చుకోగలిగా. అయితే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్‌కు టైమ్ కోల్పోయినా.. నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నా, ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నా. (Heroine Avika Gor)
ఇప్పటి వరకు నేను ఆన్ స్క్రీన్‌పై కనీసం 20 సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా చీర కట్టుకుని, హెయిర్ స్టైల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం. చిన్నారి పెళ్లి కూతురు నుంచి ‘వధువు’ వరకు ఎన్నో సందర్భాల్లో నా ఆన్ స్క్రీన్ మ్యారేజ్ జరిగింది. వధువులో ఫస్ట్ ఎపిసోడ్‌లోనే పెళ్లీ సీన్ చేస్తున్నప్పుడు వెబ్ సిరీస్ కోసం మళ్లీ పెళ్లి కూతురు అయ్యా అనిపించింది. చిన్నారి పెళ్లి కూతురు టైమ్‌కు, వధువు చేసేప్పటికి నటిగా నాకున్న నాలెడ్జ్, అనుభవంలో చాలా మార్పు ఉంది.
దర్శకుడు పోలూరు కృష్ణ అనుభవం ఉన్న డైరెక్టర్. ఈ వెబ్ సిరీస్‌ను ఆయన హాట్ స్టార్‌కి ఉండాల్సిన క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే టీవీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా రూపొందించాడు. ప్రతి సీన్‌లో ఆ సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నాడు. ‘వధువు’ క్రెడిట్ మా డైరెక్టర్‌కే దక్కుతుంది. మా ఇంట్లో వాళ్లు వధువు ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇందులో ఇందూ క్యారెక్టర్ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. ఆమెకు తనదైన ఒక స్టోరి ఉంటుంది. తన లైఫ్‌లో జరిగిన సంఘటనలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఒక సాధారణ పెళ్లి కూతురుగా ఆమె ఉండదు. (Vadhuvu Web Series)
ఈ వెబ్ సిరీస్‌లో వెడ్డింగ్ సీక్వెన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. పెళ్లి జరుగుతున్న టైమ్‌లో ఇందుకు తెలిసిన ఒక మహిళ అక్కడికి వస్తుంది. ఆమెను ఎవరూ పెళ్లికి పిలవకున్నా ఎందుకు వచ్చిందనే విషయంలో ఇందు షాక్‌కు గురవుతుంది. ఆమె క్యారెక్టర్ ఎంట్రీతో ఈ వెడ్డింగ్ సీక్వెన్స్‌లో డ్రామా క్రియేట్ అవుతుంది. మాన్షన్ 24 వెబ్ సిరీస్‌తో పాటు వధువులో నందుతో కలిసి నటించా. తను మంచి కోస్టార్. వధువులో ఆయన పర్‌ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా. ఆ సినిమా ఇంపాక్ట్ ఇప్పటికీ నా కెరీర్ మీద ఉంది. ఆ తర్వాత కొన్ని మంచి ప్రాజెక్ట్స్ చేసే అవకాశం ఇండస్ట్రీ నాకు ఇచ్చింది. ఇటీవల ‘పాప్ కార్న్’ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఆ సినిమా నా కెరీర్‌లో ఎంతో స్పెషల్‌గా నిలుస్తుంది. నా దగ్గరకు ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మంచి లవ్ స్టోరీస్ వచ్చినా చేస్తాను. నటిగా నాకు ఒకే జానర్‌లో కంటిన్యూ కావాలని లేదు. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా చేస్తున్నా.. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నా.
ఇవి కూడా చదవండి:
====================
*Bachchala Malli: ‘పుష్ప’, ‘టైగర్ నాగేశ్వరావు’ బాటలో అల్లరి నరేష్.. క్లాప్ కొట్టేశారు
************************************
*చిత్రపరిశ్రమలో మాత్రమే కులమత భేదాలు లేవంటోన్న దర్శకుడు
************************************
*Double iSmart: మరో 100 రోజుల్లో థియేటర్లలో రచ్చ రచ్చే..
***********************************