Director Teja Marni: కథలు రాయలేక కాదు.. కథలు లేక కాదు.. రీమేక్స్ చేసేది అందుకే!

ABN , First Publish Date - 2023-11-23T16:59:05+05:30 IST

యంగ్ పెయిర్ రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్‌ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తేజ మార్ని.. మీడియాకు తెలియజేశారు.

Director Teja Marni: కథలు రాయలేక కాదు.. కథలు లేక కాదు.. రీమేక్స్ చేసేది అందుకే!
Director Teja Marni

యంగ్ పెయిర్ రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) లీడ్‌ రోల్స్‌లో తేజ మార్ని (Teja Marni) తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’ (Kotabommali PS). శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2 (Geetha Arts 2) బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబర్ 24న గ్రాండ్‌గా ఈ సినిమా థియేటర్లలో విడుదలకానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు తేజ మార్ని.. ‘కోట బొమ్మాళి పీఎస్‌’ విశేషాలను మీడియాకు తెలియజేశారు.

ఈ మధ్య ‘రీమేక్’ సినిమాల గురించి బాగా వినిపిస్తోంది. మీరు ఈ సినిమా రీమేక్ చేయడానికి కారణం?

రీమేక్ అని కాదు కానీ.. కొన్ని కథలు ప్రేక్షకులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అది ఏ భాషలోని సినిమా అయినా అన్ని భాషల వారికి చేరాల్సిన కథ అని అనిపించినప్పుడు రీమేక్ సహజం. అలాంటి కంటెంట్ ఈ ‘కోట బొమ్మాళి పీఎస్‌’లో ఉంది. సిస్టమ్‌లో ఉన్నవాళ్లు.. సిస్టమ్‌కు బలైతే ఏంటి? అనే పాయింట్ నాకు బాగా నచ్చింది. కొందరు నిజాయితీగా పని చేయాలని అనుకున్నా వారిపై ఒత్తిడి ఉంటుంది. ఆ పాయింట్‌ని డీల్ చేసిన విధానం నాకు నచ్చింది. అందుకే ఈ సినిమా చేశాను. (Kotabommali PS Movie)


Srikanth.jpg

‘కోట బొమ్మాళి పీఎస్’ గురించి..?

కోట బొమ్మాళి అనే ప్లేస్‌లో బై ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ జీవితాలను ఎలా మార్చింది? వారి జీవితంలో ఏమైంది? అనేదే మెయిన్ కాన్సెప్ట్. రీమేక్ సినిమా అనడానికి లేకుండా సోల్‌ని మాత్రమే తీసుకుని.. తెలుగు నెటీవిటీకి తగినట్లుగా మార్చడం జరిగింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేసేవారంతా థ్రిల్ అయ్యేలా ఈ కథని మార్చాము. సెకండాఫ్‌లో బ్యూటీఫుల్ ఎమోషన్స్‌ని జోడించాం. ఒక మంచి ఎమోషనల్ జర్నీగా సినిమా ఎండ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా అని చెప్పగలను. రాబోయే జనరేషన్స్‌కి కూడా కొంత అవగాహన కల్పించే సినిమా ఇది.

మలయాళంలో ఈ సినిమాకు అవార్డ్ వచ్చింది. తెలుగులో కూడా అంత రియలిస్టిక్‌గా ఉంటుందా?

నా సినిమాలకు కొన్ని ఎస్తటిక్స్ పెట్టుకుని పని చేస్తాను. మరీ మలయాళం అంత రియలిస్టిక్‌గా ఉండకపోయినా.. దాదాపు దగ్గరగా ఉంటుంది. ఒక రియల్ సంఘటనలని చూసినట్లుగానే ఫీల్ ఇస్తుంది. ఎస్తటిక్స్ కోసం చాలా రిస్క్ తీసుకుని మరీ షూట్ చేశాం. (Director Teja Marni)

రీమేక్ సినిమాలు ఆడట్లేదు.. రిస్క్ అనిపించలేదా?

రీమేక్ సినిమా ఆడట్లేదు అనేది సబ్జెక్ట్ కాదు. ఒకప్పుడు బ్లాక్‌బస్టర్స్ అయిన చాలా సినిమాలు రీమేక్సే. అప్పుడు ఓటీటీలు కానీ, డబ్బింగ్ సినిమా అని కానీ ఎవ్వరికీ తెలియదు. కాబట్టే రీమేక్ చేసినా కూడా డైరెక్ట్ సినిమా మైండ్ సెట్‌తో చూసి సినిమా బాగుంది అంటే బాగుంది అని.. లేకపోతే బాలేదని అనేవాళ్లు. ఇప్పుడు ఎక్స్‌పోజర్ పెరిగిపోయి కంపారిజన్ ఎక్కువైంది. ఆడియన్స్ ట్రైలర్స్, సాంగ్స్, టీజర్స్ నచ్చితే థియేటర్లకి వచ్చి చూస్తున్నారు. ఇవన్నీ చూసి.. ఆడియన్ కొత్త పొస్పెక్టీవ్‌లో సినిమా చూస్తే ఏ సినిమా అయినా కొత్తగా ఎంగేజింగ్‌గా ఉంటుంది. నచ్చడం నచ్చకపోవడం తర్వాత. కానీ కంపారిజన్స్ ఎక్కువైపోవడం వల్ల అవి బాగా ప్రభావితం చేస్తున్నాయి. సినిమాని సినిమాలా చూడటం లేదు. అసలు రీమేక్స్ ఎందుకు చేస్తాం? ఒక మంచి కథ అక్కడితో ఆగిపోకుండా మన జనాలకి కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో చేస్తాం. కథలు రాయలేక కాదు.. కథలు లేక కాదు.. ఒక మంచి పాయింట్ మలయాళం, తమిళ్, కన్నడ ఇలా ఒక భాష పరిధికే ఆగిపోకుండా మన వాళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటుందనే ప్రయత్నమే రీమేక్. రీమేక్ చేయడంలో తప్పేం లేదనేది నా ఒపీనియన్. (Director Teja Marni About Remakes)


Kota-Bommali-PS.jpg

ప్రజంట్ పాలిటిక్స్‌కి, ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా?

ఈ సినిమాకి, పాలిటిక్స్‌కి అసలు సంబంధం లేదు. ప్రజంట్ కాదు.. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాలి. సినిమా షూటింగ్‌లో రాహుల్‌కి ఫ్రాక్చర్ అవడం వల్ల డిలే అయ్యింది. ఎలక్షన్ టైమ్‌కి రెడీ అయ్యింది. ఎలక్షన్స్‌కి సంబంధించి ఇందులో కొన్ని ఉన్నాయ్.. కాకపోతే ఏ పార్టీ‌కి రిలేటెడ్‌గా ఉండవు. ఒక సిస్టమ్‌లో మనం ఎలా ఉన్నాం.. సిస్టమ్ ఎలా ఉంది? అనే కానీ.. పొలిటికల్ రిలేటెడ్ ఏం లేవు.

మీ మూవీస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్‌గా ఉంటాయి.. ఈ మూవీ‌లో కూడా అలాంటి ప్రయత్నం జరిగిందా?

నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందనే చెప్పాలి. ఎందుకంటే, నేను ఏ కథ చెప్పాలని అనుకున్నా.. ముందు ఆ కథలో మనం లీనమవ్వాలి. మన భావాలు కొన్ని తెలియజేయాలనే ప్రయత్నంలోనే ‘జోహార్’ రాశాను. ఈ కథకు కూడా నేను బాగా కనెక్ట్ అయ్యాను. కచ్చితంగా ఈ పాయింట్ అందరికీ చెప్పాలని అనిపించింది. కాకపోతే మనం ఎవరినీ మార్చలేం కానీ.. మనవంతు ప్రయత్నం చేద్దామనే ఈ కథని టేకప్ చేశాను. విజువల్ మీడియాని ఎంత మంచిగా వాడితే అంత ఇంపాక్ట్ ప్రేక్షకులకు ఇస్తుందని నేను నమ్ముతాను. (Director Teja Marni about Kotabommali PS)

‘లింగిడి లింగిడి’ పాట తర్వాత ఈ సినిమాకు బాగా క్రేజ్ వచ్చింది కదా.. ?

అవును.. ఈ పాటను నేను ఎప్పుడో వినడం జరిగింది. శ్రీకాకుళంలో జరిగిన ఓ పెళ్లిలో ఈ పాటను విన్నాను. ఆ తర్వాత యూట్యూబ్‌లో కూడా వైరల్ అయింది. ఈ పాటను సినిమాలో పెట్టే ఆలోచనతో ఓ సింగర్‌ని పట్టుకుని.. ఆయన దగ్గర ఉన్న బాణీని కూడా మిక్స్ చేసి కొత్త బాణీని రెడీ చేశాం. మాములుగా ఉంటుందని అనుకున్నాను కానీ.. ఈ పాటకి ఇంత రీచ్ వస్తుందని అసలు ఊహించలేదు. ఆ పాటవల్లే ఈ సినిమా అందరికీ తెలిసింది.

ఇలాంటి సినిమాలకు పాటలు అడ్డుగా మారతాయి.. మరి సినిమాలో ఈ పాటకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందా?

ఇది కావాలని పెట్టిన పాట కాదండి.. సినిమాలో ఆ సిచ్యుయేషన్ ఉంటుంది. ఫస్టాఫ్‌లోనే ఈ పాట ఉంటుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

హీరో శ్రీకాంత్‌‌ ఈ సినిమాలో చేసిన పాత్ర గురించి చాలా గొప్పగా చెప్పారు.. ఆ పాత్రకు ఆయననే తీసుకోవడానికి కారణం?

ఈ సినిమాలో ఆ పాత్ర అనుకున్నప్పుడు వెంటనే గుర్తొచ్చింది శ్రీకాంత్‌గారే. ఎందుకంటే, ఆ పాత్రకి మిడిల్ ఏజ్‌లో ఉండి, సీరియస్‌నెస్.. కాస్త వెటకారం కూడా కావాలి. రామకృష్ణ పాత్ర‌‌కి ఎవరు? అనుకున్నప్పుడు శ్రీకాంత్‌గారు తప్ప వేరే పర్సన్ నాకు కనిపించలేదు. రాహుల్ విషయంలో మాత్రం ఫస్ట్ రెండు మూడు పేర్లు అనుకున్నాం కానీ.. నాకు మాత్రం రాహుల్ కరెక్ట్‌గా సరిపోతాడని అనిపించింది. నిర్మాతలకు కూడా అదే అనిపించింది. శివానీ‌గారు కూడా అంతే. వరలక్ష్మిగారు కూడా అద్భుతంగా చేశారు. వాళ్లు, వీళ్లు అని కాదు కానీ.. సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. రేపు థియేటర్లలో చూసిన తర్వాత అందరూ ఇదే అంటారు.

ఫ్యూచర్‌లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు?

నాకు ఎమోషనల్ డ్రామాస్ అంటే చాలా ఇష్టం. అలాగే మాస్ సినిమాలు కూడా చేయాలని ఉంది. అయితే ఆ టైమ్‌కి ఏది అనిపిస్తే అది చేయడమే. తర్వాత సినిమాకు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే చెబుతాను. ఫైనల్‌గా కంపారిజన్స్ లేకుండా ఫ్రెష్ సినిమాగా చూస్తే మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. మంచి ఫీల్ ఇస్తుంది.


ఇవి కూడా చదవండి:

====================

*Panja Vaishnav Tej: కొడితే పదిమంది ఎగిరిపోయే తరహా ఫైట్లు ‘ఆదికేశవ’లో ఉండవ్..

****************************

*Payal Rajput: బోల్డ్ మూవీ అంటున్నారు కానీ.. సినిమా చూస్తేనే అందులో ఉందేంటో తెలుస్తుంది

*****************************

*Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?

*******************************

Updated Date - 2023-11-23T16:59:06+05:30 IST