Vidya Balan: రూమర్స్‌ వినను.. సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్స్‌ చదవను

ABN , First Publish Date - 2023-11-05T16:35:41+05:30 IST

ఎలాంటి పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయే నటనా సామర్థ్యం ఆమెది. మంచి కథలను ఎంచుకోవటమే కాదు.. తన తోటి నటులు మంచి సినిమాలు చేస్తే మెచ్చుకుంటుంది. ఎప్పుడూ చీరకట్టులో ఫోజులిస్తుంటుంది. కెమెరా ముందు నవ్వుతూ, హాస్యంగా మాట్లాడే విద్యాబాలన్‌.. తన గురించి ఎన్నో విషయాలను తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Vidya Balan: రూమర్స్‌ వినను.. సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్స్‌ చదవను
Vidya Balan

ఎలాంటి పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోయే నటనా సామర్థ్యం ఆమెది. మంచి కథలను ఎంచుకోవటమే కాదు.. తన తోటి నటులు మంచి సినిమాలు చేస్తే మెచ్చుకుంటుంది. ఎప్పుడూ చీరకట్టులో ఫోజులిస్తుంటుంది. కెమెరా ముందు నవ్వుతూ, హాస్యంగా మాట్లాడే విద్యాబాలన్‌ (Vidya Balan) గురించి కొన్ని విశేషాలు..

‘‘సినిమా అంటే పిచ్చి. ఎప్పటికీ గొప్ప కల, కళ ఇదే. ప్రతి శుక్రవారం బిగ్‌ స్ర్కీన్‌పై సినిమా చూస్తుంటా. మంచి పాత్రలు చేసిన వారిని అభినందిస్తుంటా. సినిమా నచ్చితే మా వారు సిద్ధార్థ్‌తో కలిసి మళ్లీ అదే సినిమాకు వెళ్తా. ఇలా గతంలోనూ సినిమాలకు వెళ్లేదాన్ని. షారుక్‌ (SRK), కాజోల్‌ అభిమానిని. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ సినిమాను చాలా సార్లు చూశా. నా సినిమాలు కూడా అలా చూడలేదు. కాజోల్‌ (Kajol)లోని ఇన్నోసెన్స్‌ను ఇష్టపడేదాన్ని. అప్పట్లో షారుక్‌ మానియా నడిచేది. అన్ని సినిమాలు చూసేదాన్ని. మళ్లీ ‘పఠాన్‌’, ‘జవాన్‌’ చిత్రాలను అలా తొలి షో చూడటం మంచి అనుభూతి కలిగింది. ఈ ఫేజ్‌ ఎంతో బావుంది. (Vidya Balan Interview)

అది మర్చిపోలేను..

నాకెలాంటి సినిమా నేపథ్యం లేదు. కేరళలోని ఓ మధ్య తరగతి కుటుంబం. ఒక సీరియల్‌తో పాటు కొన్ని మ్యూజిక్‌ వీడియోలు చేశా. అందువల్లే మోహన్‌లాల్‌, కమల్‌హాసన్‌ నటించే సినిమాలో అవకాశం వచ్చింది. పదిహేను రోజులు షూటింగ్‌ చేశా. ఆ తర్వాత కొన్నెళ్లు సమయం పడుతుందని దర్శకుడు చెప్పారు. నటన సరిగారాదని తీసేశారు. ఆ తర్వాత కె.బాలచందర్‌ గారు ఓ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అంతా ఓకే అయ్యాక.. ‘అవకాశం లేదు’ అన్నారు. ఎంతో కోప్పడ్డా. బాధపడ్డా. ఎక్కడా నమ్మకం లేదు. ఆ స్థితిని మర్చిపోలేను. వెంటనే నా మీద నమ్మకంతో దర్శకుడు ప్రదీప్‌ సర్కార్‌ ‘పరిణీత’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. అది కూడా అలానే అవుతుందేమోనని భయపడ్డా. ఆ తర్వాత సినిమా విడుదలై.. మంచి పేరొచ్చింది. ఇప్పుడు తల్చుకుంటుంటే ఇరవై ఆరేళ్ల వయసులో ఏ సపోర్టు లేకున్నా ముంబైకి వచ్చా. నా కాన్ఫిడెన్స్‌ భలే ఉండేది అనిపిస్తుందిప్పుడు.


vidya-Balan.jpg

కామెంట్స్‌ చదవను..

‘లగే రహో మున్నాభయ్‌’, ‘హే బేబీ’, ‘భూల్‌ భూలయా’, ‘పా’, ‘ఇష్కియా’ లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించా. అయితే ‘డర్టీ పిక్చర్‌’ తర్వాత నన్నందరూ ‘హాట్‌’ అన్నారు. ఏమేమో.. అన్నారు. ఏమీ పట్టించుకోలేదు. సిల్క్‌ క్యారెక్టర్‌ చేశా తప్పేంటీ? అనిపించింది. లోపల ఏదో బాధపడేదాన్ని. ఆ సమయంలో సిద్దార్థ్‌ నాతో ఇలా అన్నారు.. ‘ఇలాంటి పాత్రలు చేయటం కష్టం. ఏదైనా యాక్సెప్ట్‌ చేయాలి.. మనం చేసిన తర్వాత’ అన్నారు. నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి ఇలా మాట్లాడినప్పుడు గ్రేట్‌ ఫీలయ్యా. టీవీలో రూమర్స్‌ వినను. సోషల్‌ మీడియాలో నెగటివ్‌ కామెంట్స్‌ చదవను. ఒక్క నెగటివ్‌ కామెంట్‌ చదివినా నెగటివ్‌ ఆలోచనలు వస్తాయి. అందుకే చదవను. మిమ్మల్ని పది లక్షలు మంది ఫాలోవర్లు ఫాలో అవుతున్నా.. లేదా యాభై మంది ఫాలో అవుతున్నా ఒకటే ప్రెజర్‌. ఎందుకంటే ప్రతి ఫాలోవరు జడ్జినే ఈ రోజుల్లో. అందుకే కామెంట్స్‌ డిజేబుల్‌ చేసుకోవాలంటాన్నేను. ఇన్‌స్టాలో ఫొటోలు, ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో మా టీమ్‌ షేర్‌ చేస్తుంది. నేను ఇన్‌స్టాలో కేవలం హాస్యకరమైన రీల్స్‌ చూస్తానంతే. (Vidya Balan about Social Media)

మా ఆయన గ్రేట్‌.

రెగ్యులర్‌ డ్యాన్సు, పాటలుండే సినిమాను ఇష్టపడతా. సినిమా క్లైమాక్స్‌లో హ్యాపీ ఎండింగ్‌ అంటే ఇష్టం. నేను ఎలాంటి పాత్రలు చేసినా కొత్తదనం ఉంటే చేస్తా. ‘శకుంతలాదేవి’ (Shakuntala Devi) లాంటి చిత్రాల్లో నటించటం కష్టం. ఆ సినిమాతో అమ్మతనమేంటో అర్థమైంది. ఇకపోతే నేను ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటా. ప్రతి దానికి స్పందిస్తుంటా. మా ఆయన సిద్థార్థ్‌ అలా కాదు. కూల్‌గా ఉంటాడు.. మౌనంగా ఉంటాడు. నన్ను నన్నుగా యాక్సెప్ట్‌ చేశాడు. అందుకే అతనంటే గౌరవం, ప్రేమ. నాతో ఏదీ వాదించడు. తను గ్రేట్‌. నన్ను గౌరవిస్తారు. ఖాళీగా ఉంటే ఇద్దరం టెన్నిస్‌ ఆడటం, సినిమాలు చూడటం, షాపింగ్‌ చేయటం చేస్తుంటాం. గంటలకు గంటలు మాట్లాడుతుంటే... తను మాత్రం వింటాడు. సిద్ధార్థ్‌ లాంటి వ్యక్తి నా జీవితంలోకి రావటం అదృష్టం.


ఇవి కూడా చదవండి:

========================

*Venki Mahesh: పక్కపక్కనే పెద్దోడు, చిన్నోడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పిక్

*************************************

*Srinidhi Shetty: నా అభిమాన నటుడ్ని దగ్గరగా చూసి.. నోట మాట రాలేదు

************************************

*Actress: విద్యార్థులపై చేయి చేసుకున్న సినీ నటి అరెస్ట్.. విషయం ఏమిటంటే?

************************************

*Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?

**********************************

Updated Date - 2023-11-05T16:35:42+05:30 IST