Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

ABN , First Publish Date - 2023-07-03T21:32:12+05:30 IST

రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్‌’ లాంటి భారీ చిత్రంలో నటించటం ఆనందంగా ఉందని అన్నారు ఆ సినిమాలో శూర్పణఖగా చేసిన తేజస్విని పండిట్. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించినట్లుగా చెప్పుకొచ్చింది. అయినా అదేమీ పట్టించుకోకుండా.. కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి చేరానని తెలిపింది.

Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?
Adipurush Surpanakha Tejaswini Pandit

రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) లాంటి భారీ చిత్రంలో నటించటం ఆనందంగా ఉందని అన్నారు ఆ సినిమాలో శూర్పణఖ (Surpanakha)గా చేసిన తేజస్విని పండిట్ (Tejaswini Pandit). సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నా.. తన పాత్రకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఆమె అంటున్నారు. ఇంకా ఆమె తన గురించి ఏమని తెలిపారంటే..

నేనేం చేయలేను..

రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్‌’ లాంటి భారీ చిత్రంలో నటించటం ఆనందంగా ఉంది. అయితే నా గురించి గూగుల్‌లో ఎవరీ శూర్పణఖ.. అంటూ వెతుకున్నారు చాలామంది. ఇదెంతో సంతోషకరమైన విషయం. శూర్పణఖ పాత్ర (Surpanakha Role) అంటే కొందరిలో ఓ ఆలోచన ఉంటుంది. అయితే ఈ స్టయిలిస్‌ చిత్రంలో అందంగా కనపడటం కొందరికి నచ్చలేదు. ముఖ్యంగా ఇన్‌స్టాలో నా వెస్టర్న్‌ అవుట్‌ఫిట్స్‌ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఇలాంటప్పుడు నేనేమీ చేయలేను. నా వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానంతే.

Tejaswini-2.jpg

మరాఠీలో క్రేజ్‌..

తొలి ప్యాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ (Adipurush) కావటం మర్చిపోలేని విషయం. ఇక నా కెరీర్‌ విషయానికొస్తే 2004లో మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగెట్టా. తొలి చిత్రంలో నెగటివ్‌ పాత్ర చేశా. ఆ తర్వాత థియేటర్‌ ప్లేలు చేసి నటనలో మెరుగయ్యా. నటనలో సీరియస్‌గా ముందుకెళ్లా. మంచి పేరొచ్చింది. మరాఠీలో పంతొమ్మిది చిత్రాల్లో నటించా. అలా పాపులరయ్యాను. రాష్ట్రస్థాయిలో చాలా అవార్డులు వచ్చాయి. టెలివిజన్‌లోనూ కొన్ని సీరియల్స్‌లో నటించా. ఓటీటీలో ‘100 డేస్‌’ (100 Days) అనే వెబ్‌ సిరీస్‌లో నటించా. దీంతో మరాఠీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు దక్కింది.

Tejaswini-1.jpg

అలాంటి స్థితి చూశా..

పూణెలో పుట్టిపెరిగా. టీ మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలో మా నాన్న ఉద్యోగం చేశారు. అమ్మ పేరు జ్యోతి చందేకర్‌. నటి. మేము ఇద్దరం అక్కచెల్లెళ్లం. మేం మధ్యతరగతి కంటే ఘోరమైన కష్టాలు పడ్డాం. ఇంట్లో తినటానికి తిండి ఉండేది కాదు. డబ్బులుండేవి కావు. రాత్రిపూట కరెంటు ఉండేది కాదు. అప్పులే ఎక్కువ ఉండేవి. కొన్ని రాత్రుల్లో పిండిని బిస్కెట్లలా కాల్చుకుని తిన్న రోజులు గుర్తున్నాయి. ఇవన్నీ తల్చుకుంటే బాధేస్తుంది. అయితే ఎక్కడా ఆ బాధలకు భయపడి పోయి ఆగలేదు. మా చిన్నప్పటి పాఠశాల స్నేహితుడు భూషణ్‌తో 2012లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల మేం విడిపోయాం. బిజినెస్ మ్యాన్‌ కొడుకును పెళ్లిచేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచినట్లే.. విడిపోయాక కూడా నిలిచా. అవేమీ పట్టించుకోలేదు. నటించటంతో పాటు ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌ నిర్మాతగా వ్యవహరించా. సినిమాలంటే అంత ఇష్టం.

Tejaswini-3.jpg

ఇవి కూడా చదవండి:

**************************************

*Bharatheeyans: మనం చైనాకు లొంగిపోతున్నామా?.. ‘భారతీయన్స్’ నిర్మాత ఆవేదన

**************************************

*Animal: ‘యానిమల్’ వాయిదా.. కారణం చెప్పిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు

**************************************

*Anushka Shetty: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి అనుష్క సినిమా..

**************************************

*Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..

**************************************

*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

**************************************

Updated Date - 2023-07-03T21:42:35+05:30 IST