Weapon: తమిళ సినిమాకు ఏఐ టెక్నాలజీ..ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2023-08-01T13:18:53+05:30 IST

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏఐ టెక్నాలజీతో (AI Techology) సృష్టిస్తోన్న ఫొటోలు, వీడియోల గురించే చర్చ. దీనికి సంబంధించిన వీడియోలో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. సినిమాల్లో సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ చూస్తుంటాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి పాత్రలను సృష్టించబోతున్నారు. 60 ఏళ్ల వ్యక్తిని 28 ఏళ్ల కుర్రాడి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Weapon: తమిళ సినిమాకు ఏఐ టెక్నాలజీ..ఫొటోలు వైరల్

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏఐ టెక్నాలజీతో (AI Techology) సృష్టిస్తోన్న ఫొటోలు, వీడియోల గురించే చర్చ. దీనికి సంబంధించిన వీడియోలో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. సినిమాల్లో సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ చూస్తుంటాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి పాత్రలను సృష్టించబోతున్నారు. 60 ఏళ్ల వ్యక్తిని 28 ఏళ్ల కుర్రాడి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఈ ప్రయత్నం జరుగుతోంది. ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రతో అందరికీ చేరువైన సత్యరాజ్‌పై ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘వెపన్‌’ (Weapon) అనే తమిళ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సత్యరాజ్‌ (Satya raj) వయసు 68 ఏళ్లు. కానీ, ఈ సినిమాలో ఏఐను ఉపయోగించి ఆయన 28 ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూపించనున్నారు. మామూలుగా నటీనటులను యంగ్‌గా చూపించడానికి ఒకప్పుడు పలు టెక్నాలజీలను ఉపయోగించేవారు. ఇప్పుడు ‘వెపన్‌’ చిత్రం దర్శకుడు గుహన్‌ సెన్నియప్పన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించారు. ఇప్పుడు ఇదే టాక్‌ ఆఫ్‌ ద కోలీవుడ్‌గా మారింది.

ఇప్పటి వరకూ ఈ టెక్నాలజీని ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ లాంటి పెద్ద సినిమాల్లో ఏఐను ఉపయోగించారు.భారతీయ చిత్రాల్లో ఇదే మొదటి సారి ఉపయోగించడం’ అని కోలీవుడ్‌ మీడియా చెబుతోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ ‘‘సినిమాలో ఈ పాత్ర షూటింగ్‌ కోసం ఐదుగురు సభ్యులు పనిచేస్తున్నారు’’ అని అన్నారు. తాజాగా ఈ ఫొటో బయటకు రావడంతో నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘ఇక నటీనటుల రూపురేఖలను కూడా ఈ టెక్నాలజీ మార్చేస్తుంది’ అని ఒకరంటే.. ‘ఇది పూర్తి స్థాయిలో అభివృద్థి చెందితే అద్భుతాలు సృష్టిస్తుంది’ అని మరొకరు కామెంట్‌ చేశారు. అయితే కొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ టెక్నాలజీ ప్రమాదమని సూచిస్తున్నారు.

Updated Date - 2023-08-01T13:21:58+05:30 IST