Vishal: వస్తే మంచిది.. కానీ అది ఆమె వ్యక్తిగత విషయం !
ABN , First Publish Date - 2023-07-29T16:41:20+05:30 IST
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ లేడీ సూపర్‌స్టార్ నయనతారపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సినిమాలు చేసినా ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొలేదన్నారు. ఆ విషయంలో ఆమెను ఇబ్బందిపెట్టబోమని చెప్పారు.
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ (Vishal) లేడీ సూపర్‌స్టార్ నయనతారపై (Nayanthara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సినిమాలు చేసినా ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొలేదన్నారు. ఆ విషయంలో ఆమెను ఇబ్బందిపెట్టబోమని చెప్పారు.
చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనని నటులను ఉద్దేశిస్తూ ‘‘తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌కు నయనతార ఎప్పుడూ హాజరు కాలేదు. అది ఆమె వ్యక్తిగత హక్కు. కాబట్టి, ఈవెంట్స్‌కు రమ్మని ఆమెను బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే, నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు సినిమా ప్రమోషన్స్‌కు వస్తే సినిమాకు మంచి జరుగుతుంది’’ అని అన్నారు.
అంతే కాదు రాజకీయాల గురించీ విశాల్ స్పందించారు. ‘‘రాజకీయాలు సామాజిక సేవకు సంబంధించినవి. ప్రజలకు అవసరమైన సేవలు చేయడమే రాజకీయ నాయకుడి ప్రథమ లక్ష్యం. ఇది వ్యాపారం కాదు. అలా చూసుకుంటే.. నేను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేశాను. కాబట్టి ప్రత్యేకంగా మళ్లీ పాలిటిక్స్‌లోకి రావాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు నటులు అవుతున్నప్పుడు.. నటులు రాజకీయ నాయకులు కావడంలో ఎలాంటి తప్పు లేదు’’ అని విశాల్ అన్నారు.