Lyca Productions: దర్శకుడిగా స్టార్‌ హీరో తనయుడు

ABN , First Publish Date - 2023-08-28T19:55:01+05:30 IST

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ విజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు లైకా అధినేత సుభాస్కరన్‌ మాట్లాడుతూ ‘‘సరికొత్త ఆలోచనలతో ప్రతిభ ఉన్నవారు ఎప్పుడూ గేమ్‌ చేంజర్స్‌గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్‌ నమ్ముతుంటుంది.

Lyca Productions: దర్శకుడిగా స్టార్‌ హీరో తనయుడు

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ (johnson Sanjay) విజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్‌ (Lyca production) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు లైకా అధినేత సుభాస్కరన్‌ మాట్లాడుతూ ‘‘సరికొత్త ఆలోచనలతో ప్రతిభ ఉన్నవారు ఎప్పుడూ గేమ్‌ చేంజర్స్‌గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్‌ నమ్ముతుంటుంది. మా బ్యానర్‌లో నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను జాసన్‌ సంజయ్‌ విజయ్‌ డైరెక్ట్‌ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉంది. తను చెప్పిన యూనిట్‌ పాయింట్‌ నచ్చింది. అలాగే సంజయ్‌ లండన్‌లో స్ర్కీన్‌ రైటింగ్‌లో బి.ఎ. (హానర్స్‌)ను పూర్తి చేశారు. టోరంటో ఫిల్మ్‌ స్కూల్‌లో ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ డిప్లొమాను కంప్లీట్‌ చేశారు. సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్‌ మేకర్‌కి ఇది ఉండాల్సిన లక్షణం. జాసన్‌ సంజయ్‌ విజయ్‌తో కలిసి వర్క్‌ చేయటం ఓ వండర్‌ ఫుల్‌ ఎక్స్‌ పీరియెన్స్‌ అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు’’ అన్నారు.

జాసన్‌ సంజయ్‌ విజయ్‌ మాట్లాడుతూ ‘’లైకా వంటి అగ్ర నిర్మాణ సంస్థలో దర్శకుడిగా పని చేయడం ఆనందంగా ఉంది.. కొత్త టాలెంట్‌ ఉన్న ఫిల్మ్‌ మేకర్స్‌ ఎంకరేజ్‌ చేేస ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. నా కథను నచ్చి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన సుభాస్కరన్‌ గారికి థాంక్స్‌’’ అని అన్నారు.

Updated Date - 2023-08-28T19:55:01+05:30 IST