Vijay Raghavendra : పైకి అలా ఉన్నా.. నా  బిడ్డను చూసి తట్టుకోలేకపోతున్నా

ABN , First Publish Date - 2023-09-02T15:06:40+05:30 IST

కన్నడ నటుడు విజయ్‌ రాఘవేంద్ర (Vijay Raghavendra) తన భార్య స్పందన (spandana) మరణం గురించి తొలిసారి  స్పందించారు. తాజాగా ఆయన నటించిన ‘కథా చిత్ర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్పందన గురించి, ఆమెతో తన అనుబంధం గురించి మాట్లాడారు.

Vijay Raghavendra : పైకి అలా ఉన్నా.. నా  బిడ్డను చూసి తట్టుకోలేకపోతున్నా

కన్నడ నటుడు విజయ్‌ రాఘవేంద్ర (Vijay Raghavendra) తన భార్య స్పందన (spandana) మరణం గురించి తొలిసారి  స్పందించారు. తాజాగా ఆయన నటించిన ‘కథా చిత్ర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన స్పందన గురించి, ఆమెతో తన అనుబంధం గురించి మాట్లాడారు. తన భార్య తనను ఎంతో మార్చిందని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆమెతో గడిపిన చివరి క్షణాలను నెమరువేసుకున్నారు. (kannada actres Death)

‘‘స్పందనతో గడిపిన చివరి క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. వెకేషన్‌ కోసం ేస్నహితులతో కలసి బ్యాంకాక్‌ వెళ్లాం. హోటల్‌ గదిని ఖాళీ చేసే రోజు ఉదయాన్నే స్పందనను నిద్రలేపగా.. ఆమె స్పృహలో లేదు. పల్స్‌ రేట్‌ బాగా తక్కువగా ఉంది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. నాకు కంగారు వచ్చేసింది. ఆ తర్వాత నాకు నేనే ధైర్యం చేసుకుని ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లా. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఇష్టమైన వారిని కోల్పోతే వచ్చే బాధ మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు నేను అనుభవిస్తున్న పరిస్థితి, ఆ బాధ ఎవరికీ రాకూడదు. లోలోప ఎంత మదన పడుతున్నా.. పైకి మాత్రం చిరునవ్వుతోనే కనిపిస్తున్నా. కానీ, నా బిడ్డ ముందు అలా ఉండలేకపోతున్నా. వాడిని చూస్తుంటే నా భార్యే నా కళ్లతో మెదులుతోంది’’ అని విజయ్‌ రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.


5.jpg
బెంగళూరుకు చెందిన పోలీస్‌ అది?కారి బీకే శివరామ్‌ కుమార్తే స్పందన. ఓ రోజు కాఫీ షాప్‌లో విజయ్‌ రాఘవేంద్ర - స్పందన పరిచయమయ్యారు. తర్వాత ఇద్దరి మధ్‌య ప్రేమ చిగురించి పెద్దల అంగీకారంతో 2007లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు.

Vijay.jpg

Updated Date - 2023-09-02T15:06:40+05:30 IST