Hanuman: హ‌నుమాన్ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?

ABN , Publish Date - Dec 29 , 2023 | 08:50 PM

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్‌. తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్నఈ క్రేజీ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది.

Hanuman: హ‌నుమాన్ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటంటే?
hanu man

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్‌ (Hanuman). తేజ సజ్జ (teja sajja) కథానాయకుడిగా నటిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, ట్రైలర్ అద్భుత‌మైన‌ రెస్పాన్స్‌తో జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. సంక్రాంతికి విడుదలౌతున్న చిత్రాలలో ఒక క్రేజీ చిత్రంగా వస్తున్న 'హనుమాన్' (Hanuman) తాజాగా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.

'హనుమాన్ (Hanuman) విజువల్ గా అద్భుతంగా వుంది. ఎమోషన్స్ ఎక్స్ ట్రార్డినరీ గా ఉన్నాయి. కంటెంట్ చాలా మెస్మరైజింగ్‌గా ఉంది' అని చిత్ర యూనిట్ ని సెన్సార్ సభ్యులు అభినందించారు. హను-మాన్ (Hanuman) సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా విడుదల కానుంది.


ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తుండ‌గా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించింది.

Updated Date - Dec 29 , 2023 | 08:50 PM