Aishwarya Rajinikanth: కొలిక్కి వచ్చిన చోరీ కేసు.. దొంగలు వారే.. ధనుష్ ఇంట్లోనూ..

ABN , First Publish Date - 2023-03-24T09:10:45+05:30 IST

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ (Aishwarya Rajinikanth) ఇంట్లో విలువైన వస్తువులు చోరీ జరిగిన విషయం తెలిసిందే.

Aishwarya Rajinikanth: కొలిక్కి వచ్చిన చోరీ కేసు.. దొంగలు వారే.. ధనుష్ ఇంట్లోనూ..
Aishwarya Rajinikanth

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Superstar Rajinikanth) కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ (Aishwarya Rajinikanth) ఇంట్లో విలువైన వస్తువులు చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ దొంగతనం విషయం ఇటీవలే గుర్తించిన ఐశ్వర్య చెన్నైలోని తేనాం పేట (Tenam Pet) పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. అందులో తన ఇంట్లో చాలాకాలంగా పని చేస్తున్న ముగ్గురు పని వాళ్లపై ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

పనిమనిషి ఈశ్వరీ, డ్రైవర్‌ వెంకటేశన్‌ కలిసి చాలాకాలంగా ఐశ్వర్య ఇంట్లో దొంగతనం చేస్తున్నట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా.. అక్కడ దొంగతనం చేసిన నగదుతో చెన్నైలో ఓ ఇంటిని కోనుగోలు చేసినట్లు తెలిసింది. ఐశ్వర్య ఇంట్లో 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులు, కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. (Stealing valuables in Aishwarya Rajinikanth house)

అయితే.. ధనుష్‌ (Dhanush) నివాసంలోనూ ఈశ్వరీ చోరీకి పాల్పడి ఉంటుందని తేనాంపేట క్రైం విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. ఐశ్వరా ఇంటి పనిమనిషి ఈశ్వరి, డ్రైవర్‌ వెంకటేశన్‌ కలిసి లాకర్‌లో భద్రపరచిన బంగారు, వజ్రాభరణాలను, వెండి వస్తువులను చోరీ చేశారు. ఈ విషయమై ఐశ్వర్యా చేసిన ఫిర్యాదు మేరకు ఇరువురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈశ్వరి వద్ద ఐశ్వర్యా ఇంటిలో దొంగిలించిన బంగారు, వజ్రాభరణాలే కాకుండా మరింతగా బంగారు నగలు పట్టుబడ్డాయి. దీనితో ఐశ్వర్యా ఇంట పనిచేస్తున్నప్పుడు ఈశ్వరీ తరచూ రజనీకాంత్‌, ధనుష్‌ ఇళ్లకు వెళ్లి వస్తుండేదని, ఆ సమయాల్లో ఆ ఇళ్లలోనూ ఆమె చోరీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వరిని కోర్టు ద్వారా కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. (Stealing valuables in Aishwarya Rajinikanth house)

కాగా.. ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదులో.. డైమండ్‌ సెట్‌, ఆలయ అభరణాలలో అన్‌కట్‌ డైమండ్స్, నవరత్నం సెట్లు, పురాతన బంగారు ముక్కలు, వజ్రాలతో కూడిన రెండు నెక్‌ పీసెస్‌కి సరిపడే చెవిపోగులు, ఆరమ్ నెక్లెస్‌, 3.6 లక్షల విలువ చేసే సుమారు 60 సవర్ల బ్యాంగిల్స్ దొంగతనానికి గురయ్యాయని పేర్కొన్నారు. 2019లో తన సోదరి సౌందర్య రజనీకాంత్ పెళ్లిలో ఆ ఆభరణాలను చివరిసారిగా ధరించినట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత లాకర్‌లో పెట్టి తాళం వేసినట్లు, అప్పటి నుంచి వాటిని బయటికి తీయలేదని ఐశ్వర్య తెలియజేశారు. అలాగే.. అప్పటి నుంచి మూడు సార్లు ఇళ్లు మారినప్పటికీ ఇంతవరకు ఆ లాకర్‌ని మాత్రం తెరవలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే.. లాకర్ ఎక్కడ ఉంది.. ఆ తాళాలు ఎక్కడ పెడతాననేది తన ముగ్గురి స్టాఫ్‌కి తెలుసని ఐశ్వర తెలిపారు. అందుకే వారిపై అనుమానంగా ఉందని ఆమె పోలీసులకి ఫిర్యాదు చేశారు. (Stealing valuables in Aishwarya Rajinikanth house)

Updated Date - 2023-03-24T09:11:38+05:30 IST