Vetrimaaran: సినిమా విడుదలకు స్వేచ్ఛ కావాలి
ABN , First Publish Date - 2023-01-12T17:56:22+05:30 IST
కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించే చిత్రాలను విడుదల చేసేందుకు మరింత స్వేచ్ఛ కావాలని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్
కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించే చిత్రాలను విడుదల చేసేందుకు మరింత స్వేచ్ఛ కావాలని ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ (Vetrimaaran) అన్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కోసం చిత్రాలను నిర్మించే దర్శకుల్లో ఈయన ఒకరు. ఇప్పటికే పలువురు హీరోలతో అనేక చిత్రాలు నిర్మించి విడుదల చేశారు. ‘పావకథై’ అనే అంథాలజీలో ‘ఓర్ ఇరవు’ అనే పార్ట్‌కు ఈయన దర్శకత్వం వహించారు. ‘అనల్ మేల్ పనితుళి’ చిత్రాన్ని నిర్మించి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇపుడు ‘నిలమెల్లాం రత్తం’ అనే సిరీస్‌ను నిర్మిస్తున్నారు.
తాజాగా ఆయన ఒక సాహిత్య సదస్సులో పాల్గొని మాట్లాడుతూ.. ‘మూడేళ్ళ క్రితం ఓటీటీలో సినిమాలను విడుదల చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. కానీ, ఇపుడు ఓటీటీలకు కూడా సెన్సార్ కావాలంటున్నారు. వాస్తవానికి కోట్లాది రూపాయలు వెచ్చించి తెరకెక్కించే చిత్రాలను విడుదల చేసేందుకు ఎక్కువ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీల్లో సినిమాలను విడుదల చేస్తే సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేసిన మొత్తం ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చు. ఆ మేరకు గ్యారెంటీ ఉంది. కానీ, థియేటర్లలో విడుదల చేస్తే మరింత లాభాలు పొందొచ్చు. నష్టాలు కూడా రావొచ్చు. కానీ, భవిష్యత్‌లో ఫలానా బ్యానర్‌లోనే ఓటీటీలకు సినిమాలు తీయాలన్న షరతు విధిస్తే మాత్రం కచ్చితంగా నష్టాలను ఎదుర్కోక తప్పదు. ప్రజల కోసం సినిమా తీసి.. వారి కోసం విడుదల చేసే సినిమాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది’ అని వెట్రిమారన్ అభిప్రాయపడ్డారు. (Vetrimaaran about OTT Movies)