Kollywood: 3 సినిమాలు విడుదల.. ఆ రెండు చిత్రాల మధ్యే పోటీ
ABN , First Publish Date - 2023-06-02T11:28:28+05:30 IST
ఈ వారాంతంతో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఈ శుక్రవారం మూడు చిత్రాలు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో ఒకటి ఆర్య నటించిన ‘ఖాదర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం’, హిప్‌హాప్ తమిళ ఆది నటించిన ‘వీరన్’, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఉన్నాల్ ఎన్నాల్’.
ఈ వారాంతంతో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో ఈ శుక్రవారం మూడు చిత్రాలు కోలీవుడ్ (Kollywood) బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో ఒకటి ఆర్య (Arya) నటించిన ‘ఖాదర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం’ (Kathar Basha Endra Muthuramalingam), హిప్‌హాప్ తమిళ ఆది (Hiphop Tamizha Adhi) నటించిన ‘వీరన్’ (Veeran), సోనియా అగర్వాల్ (Sonia Agarwal) ప్రధాన పాత్ర పోషించిన ‘ఉన్నాల్ ఎన్నాల్’ (Unnal Ennal) సినిమాలున్నాయి. అయితే.. ఆర్య, ఆది చిత్రాల మధ్యే తీవ్ర పోటీ నెలకొంటుందని కోలీవుడ్ భావిస్తోంది.
ముత్తయ్య (Muthaiya) దర్శకత్వంలో ఆర్య, సిద్దీ ఇద్నానీ (Siddhi Idnani) జంటగా.. ప్రభు, భాగ్యరాజ్, నరేన్ ఇతర పాత్రలలో నటించిన ‘ఖాదర్ బాషా ఎండ్ర ముత్తురామలింగం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అదేవిధంగా ఆది నటించిన ‘వీరన్’ చిత్రం తొలి తమిళ సూపర్‌మ్యాన్ మూవీగా రూపొందించారు. ఆర్.కె.శరవణన్ దర్శకత్వం వహించగా సత్యజ్యోతి ఫిలిమ్స్ (Sathya Jyothi Films) ఈ చిత్ర నిర్మాణంలో ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించింది. ఈ సినిమా గురించి హీరో ఆది మాట్లాడుతూ.. సత్యజ్యోతి బ్యానరులో ఇది నాకు మూడో సినిమా. తొలి రెండు సినిమాల తరహాలోనే ఇది కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ చిత్రంలో సూపర్ విలన్‌గా వినయ్ నటించేందుకు సమ్మతించినందుకు ధన్యవాదాలని తెలిపారు.
కాగా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న మోసాలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని, ఏఆర్ జయకృష్ణ రూపొందించిన చిత్రం ‘ఉన్నాల్ ఎన్నాల్’. ఇందులో మోసాలకు పాల్పడే ముఠా నాయకురాలిగా సీనియర్ నటి సోనియా అగర్వాల్ (Senior Heroine Sonia Agarwal) నటించగా.. రవి మారియా, ఢిల్లీ గణేశ్, మోనికా, నెల్లై శివ, సహానా, నిహారిక తదితరులు ఇతర పాత్రలను పోషించారు. మరి ఈ మూడింటిలో ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఆదరిస్తారో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
************************************************
*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!
*Mahesh Yuvasena: సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంత గొప్పగా ఆలోచించారో చూశారా?
*Natti Kumar: అది కరెక్ట్ కాదు... ఏపీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
*Jurassic June: ‘జురాసిక్ పార్క్’కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు
*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..