Madurai Mohan: ‘ముండాసు పట్టి’ ఫేమ్ మదురై మోహన్ ఇకలేరు...
ABN , First Publish Date - 2023-12-10T17:36:47+05:30 IST
‘ముండాసు పట్టి’ ఫేమ్ మదురై మోహన్(76) ఇకలేరు. ఆయన అనారోగ్యం కారణంగా శనివారం ఉదయం కన్నుమూశారు. 40 యేళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతూ చిన్నచిన్న వేషాలు వేస్తూ, ‘ముండాసు పట్టి’ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటుడు మోహన్.. సొంతూరు మదురై. దీంతో ఆయన చిత్ర పరిశ్రమలో మదురై మోహన్‌గా స్థిరపడిపోయారు.
‘ముండాసు పట్టి’ ఫేమ్ మదురై మోహన్(76) ఇకలేరు. ఆయన అనారోగ్యం కారణంగా శనివారం ఉదయం కన్నుమూశారు. 40 యేళ్లుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతూ చిన్నచిన్న వేషాలు వేస్తూ, ‘ముండాసు పట్టి’ (Mundasupatti) చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన నటుడు మోహన్.. సొంతూరు మదురై. దీంతో ఆయన చిత్ర పరిశ్రమలో మదురై మోహన్ (Madurai Mohan)గా స్థిరపడిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో చిత్రపరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ ఆయనకు గుర్తింపుతో పాటు మంచి పేరు తెచ్చిన చిత్రం రామ్ కుమార్ దర్శకత్వంలో విష్ణువిశాల్ నటించిన ‘ముండాసు పట్టి’. ఆ తర్వాత ఏఆర్‌కే శరవణన్ దర్శకత్వంలో ఆది నటించిన ‘వీరన్’ చిత్రంలోనూ తన నటనతో అదరగొట్టి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తన కెరీర్‌లో అత్యధికంగా ఆయన గ్రామీణ నేపథ్య చిత్రాల్లో నటించారు. ఆయన మరణ వార్తను సినీ నటుడు కాళి వెంకట్ శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. (Mundasupatti Madurai Mohan Passed Away)
‘‘మదురై మోహన్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నా. 40 యేళ్లుగా గుర్తింపు లేని నటుడిగా ఉన్నారు’’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాగా, మోహన్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
====================
*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!
************************************
*Manushi Chhillar: నా గాళ్స్ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!
*******************************
*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం
*************************************