SJ Suryah: అమితాబ్ బచ్చన్ హీరోగా సినిమా ప్లాన్ చేశాను కానీ..
ABN , First Publish Date - 2023-06-15T15:34:25+05:30 IST
సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్‌ను జూనియర్ ఆర్టిస్టుగా ప్రారంభించాను. దర్శకుడిగా మారాను. ఇప్పుడు నటుడిగా ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని అన్నారు దర్శకనటుడు ఎస్‌జే సూర్య. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బొమ్మై’. ఈ సినిమా జూన్ 16న విడుదల కాబోతోన్న సందర్భంగా చెన్నైలో మీడియా సమావేశంలో ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన సినీ కెరీర్ జూనియర్ ఆర్టిస్టు నుంచి మొదలైందని దర్శకనటుడు ఎస్‌జే సూర్య (SJ Suryah) చెప్పారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బొమ్మై’ (Bommai). ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar), చాందిని తమిళరసన్ (Chandini Tamilarasan) హీరోయిన్లు. ఈ నెల 16న విడుదలకానుంది. రాధా మోహన్ (Radha Mohan) దర్శకుడు. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని.. చిత్ర బృందం చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో ఎస్‌జే సూర్య ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
‘‘ఈ కథను విన్న తర్వాత నేనే నిర్మించాలని డిసైడ్ అయ్యాను. ఒక మనిషికి, బొమ్మకు మధ్య ప్రేమ అనే విషయం వినేందుకే కొత్తగా ఉంది. పలు దేశాల్లో బొమ్మలను వివాహం చేసుకుని జీవిస్తున్నారు. బొమ్మగా నటించిన ప్రియాభవానీ శంకర్ నటన హైలెట్. ఈ మూవీ కోసం శిక్షణ తీసుకున్నాం. తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. నా సినీ కెరీయర్‌లో మరిచిపోలేని మైలురాయిగా ఈ సినిమా నిలిచిపోతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో చివరి నాలుగైదు రోజులు నిద్రపోలేదు. (SJ Suryah About Bommai)
సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్‌ను జూనియర్ ఆర్టిస్టుగా ప్రారంభించాను. దర్శకుడిగా మారాను. ఇప్పుడు నటుడిగా ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. సినిమాల్లో సంపాదించిన డబ్బును సినిమా నిర్మించి సినిమాలోనే ఖర్చు చేశాను. కొన్ని చిత్రాలు పరాజయం పొందాయి. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హీరోగా ఒక చిత్రానికి ప్లాన్ చేశాను. కానీ అది సాధ్యంకాలేదు. మళ్ళీ ఈ సినిమా కోసం ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాను’’ అని ఎస్‌జే సూర్య వివరించారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Urvashi: విలేకరులారా.. తప్పకుండా ఆ ప్రశ్న అడగండి
**************************************
*Adipurush: ఏపీ ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది కానీ..
**************************************
*Mahi V Raghav: ‘సైతాన్’ వెబ్ సిరీస్‌పై మరోసారి హెచ్చరిక చేసిన దర్శకుడు
**************************************