Gautami: ఓటీటీ చిత్రాలకూ సెన్సార్‌ ఉండాలి

ABN , First Publish Date - 2023-01-07T12:50:43+05:30 IST

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ అనేది సినిమా థియేటర్లకు మరో రూపంగా భావిస్తే, ఆ వేదికలపై విడుదలయ్యే చిత్రాలకు కూడా సెన్సార్‌ ఉండాలని సీనియర్‌ హీరోయిన్‌..

Gautami: ఓటీటీ  చిత్రాలకూ సెన్సార్‌ ఉండాలి
Senior Actress Gautami

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ అనేది సినిమా థియేటర్లకు మరో రూపంగా భావిస్తే, ఆ వేదికలపై విడుదలయ్యే చిత్రాలకు కూడా సెన్సార్‌ ఉండాలని సీనియర్‌ హీరోయిన్‌ గౌతమి (Gautami) అభిప్రాయ పడ్డారు. ఆమె తాజాగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘స్టోరీ ఆఫ్‌ థింగ్స్‌’ (Story of Things) శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో గౌతమితో పాటు భరత్‌, అదితి బాలన్‌, లింగా, వినోద్‌ కిషన్‌, రతికా సింగ్‌, రోజా తదితరులు నటించారు. జార్జ్‌ ఆంటోనీ తెరకెక్కించగా, సోనీ లివ్‌ (SonyLIV) కోసం నిర్మించారు.

ఈ సందర్భంగా నటి గౌతమి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సినిమాకు మరో రూపం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ (OTT Platforms). టీవీలను ఆదరించినట్టుగానే వీటిని కూడా స్వాగతించాలి. ఓటీటీల విస్తృతి అయిన తరువాత టాలెంట్‌ ఉన్న యువకులకు, నటీనటులకు అవకాశాలు పెరిగాయి. మంచి కథతో కూడిన చిన్న చిత్రాల విడుదలకు సరైన ఫ్లాట్‌ఫామ్‌గా మారింది. అయితే ఓటీటీలలో విడుదల చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సెన్సార్‌ (Censor) నియంత్రణ లేకపోవడంతో.. అశ్లీల దృశ్యాలు, అసభ్య పదజాలంతో కూడిన డైలాగులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు కూడా ఖచ్చితంగా సెన్సార్‌ నియంత్రణ ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-01-07T12:50:44+05:30 IST