Route No 17: అడవి దారి వెనుక ఉన్న మర్మమేంటి?
ABN , First Publish Date - 2023-01-03T18:51:38+05:30 IST
నేని ప్రొడక్షన్ బ్యానర్‌పై డాక్టర్ అమర్ రామచంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ‘రూట్ నెంబర్ 17’ (Route No 17). అభిలాష్ జి దేవన్ దర్శకుడు. హీరోగా...
నేని ప్రొడక్షన్ బ్యానర్‌పై డాక్టర్ అమర్ రామచంద్రన్ నిర్మిస్తున్న చిత్రం ‘రూట్ నెంబర్ 17’ (Route No 17). అభిలాష్ జి దేవన్ దర్శకుడు. హీరోగా జిత్తన్ రమేష్ (Jithan Ramesh), హీరోయిన్‌గా అంజు పాండ్య (Anju Pandya) నటించారు. ఈమె గతంలో ఎయిర్ ఇండియాలో ఎయిర్‌హోస్టస్‌గా పనిచేశారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమవుతున్నారు. విలన్‌గా హరీష్ పేరడి, మరో ముఖ్య పాత్రలో అరువి మదన్ నటించారు. వీరితో పాటు అమర్ రామచంద్రన్, నిహాల్, అఖిల్ ప్రభాకర్, జెనీఫర్, బిందు, కాశీ విశ్వనాథన్ తదితరులు నటించారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు అభిలాష్ (Abhilash) మాట్లాడుతూ.. ‘రూట్ నంబరు 17’ అంటే ఒక అడవి దారి అని అర్థం. 30 ఏళ్ల నాటి ఈ దారి మూసివేసివుంటుంది. ఈ మార్గంలో బలవంతంగా వెళ్ళేవారు ఆ రోజు రాత్రికే మృతి చెందుతారు. అలా ఎందుకు జరుగుతుంది? ఈ దారి వెనుక ఉన్న మర్మమేంటి’ అనే అంశాలను ఎంతో ఉత్కంఠభరితంగా తెరకెక్కించాం. 1990 నుంచి 2020 వరకు మూడు దశకాల్లో ఈ సినిమా స్క్రీన్‌ప్లే సాగుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ సంగీతం దర్శకుడు ఊసెప్పన్ సంగీతం అందిస్తుండగా.. రాజాకృష్ణన్ కెమెరా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రాజాకృష్ణన్ ‘కాంతార’ (Kantara) చిత్రానికి సౌండ్ గ్రాఫిక్స్, సౌండ్ డిజైనింగ్ పనులు చేశారు.