Rekha: ఊపిరి ఉన్నంత వరకు.. నా కోరిక అదే..

ABN , First Publish Date - 2023-10-28T20:22:06+05:30 IST

ఊపిరి ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని సీనియర్‌ నటి రేఖ స్పష్టం చేశారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, పాత్ర ముఖ్యమన్నారు. శ్రీసాయి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్‌ మాలతి నారాయణన్‌ నటిస్తూ దర్శకత్వం వహించి సొంతంగా నిర్మించిన చిత్రం ‘మిరియమ్మ’. సీనియర్‌ నటి రేఖ ప్రధాన పాత్రధారి. తాజాగా ఈ చిత్ర ఆడియోను చెన్నైలో విడుదల చేశారు.

Rekha: ఊపిరి ఉన్నంత వరకు.. నా కోరిక అదే..
Senior Actress Rekha

ఊపిరి ఉన్నంత వరకు నటిస్తూనే ఉంటానని సీనియర్‌ నటి రేఖ (Rekha) స్పష్టం చేశారు. తనకు డబ్బు ముఖ్యం కాదని, పాత్ర ముఖ్యమన్నారు. శ్రీసాయి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై డెబ్యూ డైరెక్టర్‌ మాలతి నారాయణన్‌ (Malathy Narayan) నటిస్తూ దర్శకత్వం వహించి సొంతంగా నిర్మించిన చిత్రం ‘మిరియమ్మ’. సీనియర్‌ నటి రేఖ ప్రధాన పాత్రధారి. వీజే ఆషిక్‌, ఎళిల్‌ దురై, స్నేహాకుమార్‌, అనితా సంపత్‌ తదితరులు నటించారు. ఏ.ఆర్‌. రెహానా పాటలకు స్వరాలు సమకూర్చారు. మూన్‌ రాకర్స్‌ బృందానికి చెందిన సంగీత కళాకారులు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని తాజాగా చెన్నైలో నిర్వహించారు.

Rekha.jpg

ఈ సందర్భంగా నటి రేఖ మాట్లాడుతూ.. సుధీర్ఘకాలం తర్వాత మీడియా మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. మూడు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. ఇది తలచుకుంటే చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన దేవుడికి, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా ప్రాణం ఉన్నంత వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. ఇందులోని పాత్ర నా మనసుకు బాగా నచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు ధన్యవాదాలు. కమర్షియల్‌ చిత్రాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం లేకుండా పోయింది. నాకు చెన్నైలోనే ఉండాలని, సినిమాల్లో నటిస్తూనే ఉండాలన్నదే నా కోరిక. చిన్న బడ్జెట్‌తో ప్రారంభించాం. చివరకు అది పెద్దబడ్జెట్‌ మూవీగా మారిపోయింది. మీడియా సపోర్టు చేయాలని కోరారు. (Rekha Speech at Miriam Maa Audio Launch)


Miriam-Maa.jpg

దర్శకురాలు మాలతి నారాయణన్‌ మాట్లాడుతూ.. చిన్న బడ్జెట్‌ చిత్రాలు లేకుండా యువ దర్శకులకు అవకాశాలు ఎలా వస్తాయి? ఒక యంగ్‌ డైరెక్టర్‌కు తొలి అవకాశం అనేది ఎంతో గొప్ప విషయం. ఒక బడ్జెట్‌ను ఆధారంగా చేసుకుని అంచనా వేయకూడదు. స్టోరీ ముఖ్యం. నా అనుభవంలో ఇది పెద్ద బడ్జెట్‌ సినిమానే. మీడియా సపోర్టు చేయాలి. వారే ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లాలని కోరారు. సంగీత దర్శకురాలు ఏ.ఆర్‌.రెహానా, నటుడు ఎళిల్‌ తదితరులు ప్రసంగించారు. (Miriam Maa Audio Launch)


ఇవి కూడా చదవండి:

============================

*Chiranjeevi - Khaidi : ఖైదీ చిత్రానికి 40 ఏళ్లు!

********************************

*Vijay Deverakonda: విజయ్ సినిమాలో రష్మిక కదా హీరోయిన్, మరి శ్రీలీల ఏంటి!

***********************************

Updated Date - 2023-10-28T20:22:06+05:30 IST