Superstar Rajinikanth: రజనీకి ఆ అవార్డు తీసుకునే అర్హత లేదు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-21T10:45:24+05:30 IST

దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న అతి కొద్దిమంది నటుల్లో తమిళ నటుడు రజనీకాంత్ (Rajinikanth) ఒకరు.

Superstar Rajinikanth: రజనీకి ఆ అవార్డు తీసుకునే అర్హత లేదు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
Rajinikanth

దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న అతి కొద్దిమంది నటుల్లో తమిళ నటుడు రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలు అని వివిధ భాషల్లోని నటులు నేషనల్ వైడ్ పాపులారిటీ సాధిస్తున్నారు. కాని అదేం లేనప్పటి నుంచే రజనీ సినిమాలను దేశవ్యాప్తంగా చూసేవారు. ఆయన సినిమాలకి మంచి వసూళ్లు వస్తుంటాయి. అలా.. 2007లో వచ్చిన ‘శివాజీ’ (Shivaji) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆ ఏడాదిలోనే పెద్ద హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా.. ఆ ఏడాది ఆ చిత్రానికి గానూ రజనీకాంత్‌‌కి తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Government) ఉత్తమ నటుడు అవార్డుని ప్రకటించింది. అయితే.. తాజాగా ఈ అవార్డు ప్రముఖ తమిళ దర్శకుడు అమీర్ సుల్తాన్ (Ameer Sultan) విమర్శలు చేశారు.

Ameer.jpg

పరుత్తివీరన్ (Paruthiveeran), ఆది భగవాన్ వంటి చిత్రాల దర్శకుడిగా అమీర్ సుల్తాన్‌కి తమిళనాడులో మంచి గుర్తింపు ఉంది. ఈ దర్శకుడు తాజాగా ‘శివాజి’ చిత్రానికి రజనీకి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడాన్ని ప్రశ్నించారు. అమీర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మీ మనస్సాక్షిని అడగండి. ఆ అవార్డుకు రజనీకాంత్ అర్హుడేనా?. ఆయన టాలెంట్ గురించి నేను మాట్లాడట్లేదు. కాని ఆ సంవత్సరం అతని కంటే మెరుగ్గా నటించిన వారు లేరా?’ అని చెప్పుకొచ్చారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 2007లోనే ఏడాది అమీర్ దర్శకత్వం వహించిన ‘పరుత్తివీరన్’ విడుదలైంది. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం ఆ ఏడాది సూపర్‌హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆ చిత్రానికిగానూ అమీర్ ఉత్తమ దర్శకుడిగా తమిళ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.

కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే చిత్రం చేస్తున్నాడు. అలాగే.. తన కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న ‘లాల్ సలాం’ చిత్రంలో అతిథిగా నటిస్తున్నారు. అలాగే మరికొన్ని చిత్రాలు సైతం చర్చల దశలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Naatu Naatu: ‘నాటు నాటు’కి అవార్డు సరే.. ఆ వీడియో చూసి ఆస్కార్స్ మేనేజ్‌మేంట్‌పై ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఆగ్రహం.. అందులో ఏముందంటే..

Oscars 2023: భుజంపై పులి బొమ్మతో ఎన్టీఆర్.. నిర్వాహకులు అడిగితే.. యంగ్ టైగర్ జవాబుకి అందరూ ఫిదా..

Updated Date - 2023-03-21T10:56:38+05:30 IST