Producer: తమన్నాతో పోల్చితే ఈ యంగ్‌ హీరోయిన్లు ఎంతో మేలు..

ABN , First Publish Date - 2023-10-31T15:02:25+05:30 IST

అడల్డ్‌ (ఏ సర్టిఫికెట్‌) కంటెంట్‌ చిత్రాలకంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఉన్నారు. వారి కోసం ఇలాంటి చిత్రాలు రావాలి. ‘జైలర్‌’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా కంటే ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు అసభ్యకరంగా నృత్యం చేయలేదని అన్నారు సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌. సినిమా షూటింగుల కోసం లొకేషన్లకు అనుమతి ఇచ్చేందుకు సింగిల్‌ విండో సిస్టం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు.

Producer: తమన్నాతో పోల్చితే ఈ యంగ్‌ హీరోయిన్లు ఎంతో మేలు..
Producer K Rajan

అడల్డ్‌ (ఏ సర్టిఫికెట్‌) కంటెంట్‌ చిత్రాలకంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఉన్నారు. వారి కోసం ఇలాంటి చిత్రాలు రావాలి. ‘జైలర్‌’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా కంటే ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు అసభ్యకరంగా నృత్యం చేయలేదని అన్నారు సీనియర్‌ నిర్మాత, నటుడు కె.రాజన్‌. సినిమా షూటింగుల కోసం లొకేషన్లకు అనుమతి ఇచ్చేందుకు సింగిల్‌ విండో సిస్టం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. స్కై వాండర్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానరుపై నిర్మాత ఏ.జయలక్ష్మి (A Jayalakshmi) సమర్పణలో దర్శకుడు కేశవ్‌దేపూర్‌ రూపొందించిన చిత్రం ‘రారా సరసుక్కు రారా’ (Ra Ra Sarasukku Ra Ra). తమిళం, తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళంలో 9వి స్టూడియోస్‌ విడుదల చేయనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా చెన్నై నగరంలో జరిగింది.

ra-ra-sarasaku-ra-ra.jpg

ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కె.రాజన్‌ మాట్లాడుతూ.. సినిమా షూటింగుల సమయంలో పోలీసులు లంచావతారులుగా మారుతున్నారు. ట్రాఫిక్‌, సివిల్‌, క్రైం ఇలా అన్ని విభాగాలకు చెందిన పోలీసులు మామూలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మూడు నెలల క్రితం సీఎంను కలిసినపుడు ఒక విజ్ఞప్తి చేశాం. సినిమా చిత్రీకరణ కోసం లొకేషన్లకు అనుమతి ఇచ్చే విషయంపై సింగిల్‌ విండో వ్యవస్థను అమలు చేయాలని కోరాం. ఒక ప్రాంతంలో షూటింగ్‌ కోసం అనుమతి తీసుకుంటే రాష్ట్రంలో ఎక్కడైనా షూటింగ్‌ జరుపుకునే వెసులుబాటును కల్పించాలి.

సినిమా గురించి మాట్లాడుతూ.. అడల్డ్‌ (ఏ సర్టిఫికెట్‌) కంటెంట్‌ చిత్రాలకంటూ ఒక వర్గం ప్రేక్షకులు ఉన్నారు. వారి కోసం ఇలాంటి చిత్రాలు రావాలి. ‘జైలర్‌’ (Jailer) చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నా (Tamannaah) కంటే ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు అసభ్యకరంగా నృత్యం చేయలేదు. తమన్నాతో పోల్చితే ఈ యంగ్‌ హీరోయిన్లు ఎంతో మేలు. చిన్న చిత్రాల నిర్మాతలను రక్షించినపుడే చిత్ర పరిశ్రమ బాగుంటుంది. మరిన్ని చిత్రాలు తీసేందుకు చిన్న నిర్మాతలు ముందుకు వస్తారని అన్నారు.


Hakuna-Matata.jpg

దర్శకుడు కేశవ్‌ (Keshav Depur) మాట్లాడుతూ.. నేను చిన్న వయసు నుంచి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానిని. ఆయనతో కలిసి పని చేశాను. నేను దర్శకత్వం వహించిన చిత్రానికి ఆయన నటించిన ‘చంద్రముఖి’ చిత్రంలోని ‘రారా సరసుక్కు రారా’ పాటను టైటిల్‌ను పెట్టాలని అనుకుని, నిర్మాతకు చెప్పగా ఆమె ఏమాత్రం సంకోచించకుండా ఈ టైటిలే కావాలని పట్టుబట్టారు. సెన్సార్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆ డైలాగ్‌, ఈ డైలాగ్‌ ఉండకూడదంటూ ఆంక్షలు విధించారు. గతంలో ఇలాంటి డైలాగులు ఉన్నాయి కదా అని ఎత్తిచూపినా వినిపించుకోలేదు. ఆ చిత్రాల గురించి మాట్లాడొద్దంటూ కండిషన్‌ పెట్టారు. ఇన్ని ఆంక్షల మధ్య ఒక దర్శకుడు సినిమా ఎలా తీయాలో అర్థం కావడం లేదు. మా సినిమాలో ఎలాంటి అసభ్య, అభ్యంతరకర డైలాగులు లేవు. అందరూ చూసి ఎంజాయ్‌ చేసేలా రూపొందించామని అన్నారు. ఈ చిత్రంలో కల్లూరి వినోద్‌, అభిషేక్‌, విజయ్‌ ప్రసాద్‌, గాయత్రి పటేల్‌, సారా, దీపిక, సిమ్రాన్‌ గాయత్రి రెమా, నికిత తదితరులు నటించారు. కథ పొన్‌ మురుగన్‌, కెమెరా ఆర్‌.రమేష్‌, ఎడిటింగ్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సంగీతం జీకేవీ.


ఇవి కూడా చదవండి:

========================

*Razakar: సినిమా బ్యాన్‌పై సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన ‘రజాకార్’ నిర్మాత

********************************

*Hard-Hitting Love Story: కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయి.. ‘బేబీ’ మేకర్స్ తగ్గేదే లే..

*******************************

*Vignesh Shivan: ఆ సినిమా మా బ్యానర్‌కు దక్కిన సముచిత గౌరవం

*********************************

Updated Date - 2023-10-31T15:14:17+05:30 IST