Popular Youtuber: బైక్ స్టంట్ లో గాయపడ్డ యూట్యూబర్ వాసన్ ని అరెస్టు చేసిన పోలీసులు
ABN , First Publish Date - 2023-09-19T17:27:12+05:30 IST
తమిళనాడులో బాగా ఫాలోయింగ్ వున్న యూట్యూబర్ టిటిఎఫ్ వాసన్ నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఆదివారం ప్రమాదానికి గురి అయ్యాడు, ఆ తరువాత ఆసుపత్రిలో దెబ్బలకు కట్లు కట్టించుకొని ఒక స్నేహితుడి ఇంట్లో వున్న అతన్ని పోలీసులు రాష్ డ్రైవింగ్ చేసాడని పలు సెక్షన్స్ పెట్టి అరెస్టు చేశారు.
తమిళనాడులో బాగా పేరుపొందిన యూట్యూబర్ వాసన్ ఒక బైక్ స్టంట్ చేస్తుండగా గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో అతనికి గాయాలు కూడా అయ్యాయి, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు కూడా. అతను చెన్నై-బెంగుళూరు హైవే లో చేసిన ఈ స్టంట్ వికటించడంతో అతను బైక్ అదుపుతప్పి పక్కనున్న పొలాల్లోకి వెళ్ళిపోయింది. వాసన్ కి గాయాలు అయ్యాయి. అయితే రాష్ డ్రైవింగ్ చేసాడు అన్న కారణంతో అతని మీద పలు సెక్షన్స్ పెట్టి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఆసుపత్రి నుండి వాసన్ ఒక స్నేహితుడు ఇంటికి వెళ్లి అక్కడ దాక్కున్నాడు అని అంటున్నారు. అయినా పోలీసులు కనుక్కొని అతన్ని ఆ స్నేహితుడి ఇంటి దగ్గర నుండి తీసుకువచ్చి అరెస్ట్ చేశారు. వాసన్ కి తమిళనాడులో సాంఘీక మాధ్యమంలో బాగా ఫాలోయింగ్ వుంది. అతను ఎప్పుడూ డ్రైవింగ్ చాలా నిర్లక్ష్యంగా చేస్తాడు అని కూడా అంటున్నారు. ఈసారి అలానే చేసి తన బైక్ ముందు వీలు గాల్లోకి లేపి ఒక్క టైరు మీదే నడిపి చూపించాలని అనుకున్నాడు, అది వికటించింది, ప్రమాదం జరిగింది. ప్రమాదం జరుగుతున్నప్పుడు తీసిన వీడియో కూడా వైరల్ అయింది.
వాసన్ మీద ఐపిసి సెక్షన్ 279, 337, 308 అలాగే మోటార్ వెహికల్స్ యాక్ట్ సెక్షన్ 184 (ప్రమాదకరమైన డ్రైవింగ్), 188 సెక్షన్స్ అన్ని పెట్టి అరెస్టు చేసినట్టుగా కాంచీపురం ఎస్పి త్తెలియచేసినట్టుగా వార్తలు వచ్చాయి. వాసన్ ని సంఘిమ మాధ్యమంలో ట్రోల్ చేశారు, అతని ప్రమాదకరమైన డ్రైవింగ్ చూసి. అతని ఇతరులకు కూడా బాగా ఇబ్బంది పెట్టేట్టుగా డ్రైవింగ్ చేసాడని అన్నారు. అందువలనే అతని మీద ఇన్ని సెక్షన్స్ పెట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా వాసన్ స్నేహితుడు ఒకరు వాసన్ చేతికి సర్జరీ చెయ్యాలని, చెయ్యి ఫ్రాక్టరు అయినట్టుగా చెపుతున్నాడు. అలాగే అతను ఒక సినిమా లో కథానాయకుడిగా చేస్తున్నాడని, ఆ సినిమా కోసం ఈ స్టంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రానున్న నాలుగు నెలల్లో వాసన్ అసలు బైక్ రైడ్ చెయ్యలేదని తెలుస్తోంది.