Vijaykanth: కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యంపై.. అధికారిక ప్రకటన విడుదల
ABN , First Publish Date - 2023-11-20T14:15:24+05:30 IST
తమిళ ఆగ్ర నటుడు, రాజకీయ నాయకుడు కెెప్టెన్ విజయ్ కాంత్ హస్పటల్లో చేరారు. గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తాజాగా గొంతు సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్టు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో తమిళనాట ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
తమిళ ఆగ్ర నటుడు, రాజకీయ నాయకుడు కెెప్టెన్ విజయ్ కాంత్ (Vijaykanth) హస్పిటల్లో చేరారు. గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన తాజాగా గొంతు సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చచేరినట్టు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. గతంలోనే అధిక షుగర్ వళ్ల అతని మూడు కాలు వేళ్లను తీసివేయగా దాదాపు మూడు నాలుగేండ్లుగా ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఆరోగ్య సమస్యలతో దవాఖానలో చేరడంతో తమిళనాట ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఈక్రమంలో తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన పార్టీ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. విజయకాంత్ (Vijaykanth) ఆరోగ్యం బాగా క్షీణించిందని మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని పుకార్లను నమ్మొద్దంటూ ప్రకటించారు. అయితే ఆయన గత కొంతకాలంగా డయాబెటీస్ ఇతర సమస్యలతో బాధ పడుతున్న మాట వాస్తవమేనని, ఈ నెల 18న సాయంత్రం రెగ్యులర్ వైద్య పరీక్షల నిమిత్తంగానే చెన్నైలోని మియాట్ ఆస్పత్రికి తీసుకెళ్ళామని, ఇది ప్రతి నెలా జరుగుతున్న వైద్య పరీక్షల్లో భాగమేనని స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వస్తారని తెలిపారు.
ఇదిలా ఉండగా తమిళనాట పురచ్చీ కళైంగార్(విప్లవ వీరుడు) అని ముద్దుగా పిలుచుకునే విజయ్ కాంత్ (Vijaykanth) గురించి తెలుగు వాళ్లకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ నటుడు ఇప్పటివరకు 150 సినిమాలలో నటించినప్పటికీ తమిళం మినహా వేరే భాషలో ఆయన సినిమా చేయలేదు.
కానీ ఆయన సినిమాలు తెలుగు, కన్నడ భాషల్లో డబ్ అయి మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా 90లలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమా చేసిన సంచలనం అంతా ఇంతా కాదు ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయి ఇక్కడా స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన నటించిన చాలా సినిమాలు ఇక్కడా విడుదలయ్యాయి,
హీరోగా 2010లో చివరి సారిగా విరుదాగిరి అనే సినిమాలో కనిపించిన ఆయన ఆ తర్వాత రాజకీయాల వైపు వెళ్లి DMDK అనే పార్టీని స్థాపించి 2006, 2011లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 ఎన్నికల్లో ఓడిపోయారు. అనంతరం ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన భార్య ప్రేమలత పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నది. ఆయనకు ఇద్దరు కుమారులుండగా షణ్ముగ పాండ్యన్ హీరోగా రెండు సినిమాలు చేయగా, ప్రభాకర్ పార్టీ కలాపాలు చూసుకుంటున్నాడు.