Nayanthara: నయనతార 75వ చిత్రం.. విడుదలకు సిద్ధం

ABN , First Publish Date - 2023-11-25T22:09:07+05:30 IST

అగ్రనటి నయనతార నటించిన తాజా చిత్రం ‘అన్నపూరణి’. ఇందులో చెఫ్‌ పాత్రను పోషించారు. ఇది ఆమె నటించిన 75వ చిత్రం. ప్రముఖ దర్శకుడు ఎస్‌.శంకర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసిన నీలేష్‌ కృష్ణా తొలిసారి దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కించారు. ఈ సినిమాని డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Nayanthara: నయనతార 75వ చిత్రం.. విడుదలకు సిద్ధం
Nayanthara in Annapoorani Movie

అగ్రనటి నయనతార (Nayanthara) నటించిన తాజా చిత్రం ‘అన్నపూరణి’ (Annapoorani). ఇందులో చెఫ్‌ పాత్రను పోషించారు. ఇది ఆమె నటించిన 75వ చిత్రం. ప్రముఖ దర్శకుడు ఎస్‌.శంకర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేసిన నీలేష్‌ కృష్ణా (Nilesh Krishnaa) తొలిసారి దర్శకుడిగా అవతారమెత్తి తెరకెక్కించారు. యువ హీరో జై, సీనియర్‌ నటుడు సత్యరాజ్‌, అచ్యుత్‌ కుమార్‌, సీనియర్‌ దర్శకుడు కె.ఎస్.రవికుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లీ, సురేష్‌ చక్రవర్తి తదితరులు నటించారు. ఎస్‌.థమన్‌ సంగీతం సమకూర్చగా సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఎస్‌.ఆర్‌.రవీంద్రన్‌ సమర్పణలో నాస్‌ స్టూడియోస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాని డిసెంబరు 1న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Annapoorani Ready to Release)

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు నీలేష్‌ కృష్ణా మాట్లాడుతూ... శ్రీరంగంలోని ఒక అగ్రహారంలో నివసించే సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నయనతార దేశంలో పేరొందిన గొప్ప చెఫ్‌ కావాలన్న లక్ష్యంతో ఉంటారు. కుటుంబమంతా సంప్రదాయమైన పూజా కార్యక్రమాల్లో నిరంతరం నిమగ్నమై ఉంటుంది. కానీ, నయనతార మాత్రం చదువుకుంటూనే, మాంసాహార వంటల నుంచి వచ్చే వాసనలు పీలుస్తూ, వాటిని ఆరగించాలని ఆశగా చూస్తోంటోంది. అలాంటి యువతి పాకశాస్త్రంలో రాణించారా? దేశంలోనే పేరొందిన గొప్ప చెఫ్‌గా ఎదిగేందుకు ఆమె ఎదుర్కొన్న సమస్యలు, అవాంతరాలు? వంటి అంశాలే ఈ చిత్ర కథ. (Director Nilesh Krishnaa about Annapoorani)


Nayan.jpg

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి ఒకరు మాంసాహార వంటకాలు తయారు చేయడం, ఆరగించడం వంటి సన్నివేశాలు ఎలాంటి వివాదం తలెత్తకుండా చిత్రీకరించాం. అనేక సన్నివేశాల్లో నిజంగానే నయనతార వంట చేశారు. ఇలాంటి పాత్రలో నయనతార గతంలో నటించలేదు. అందుకే ఆమె పాత్రను కొత్తగా ఉండేలా చిత్రీకరించాం. సత్యరాజ్‌ పాత్ర కథకు ఎంతోబలం. కే.ఎస్.రవికుమార్‌ అరుసువై అన్నామలై అనే పాత్రలో రజనీకాంత్‌ అభిమానిగా, హోటల్‌ యజమానిగా నటించారని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Sandeep Reddy Vanga: మహేష్ బాబుకి ఒక కథ చెప్పా.. కానీ?

******************************

*Srikanth: ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు

*******************************

*Surya: డాడీతో పోలిక లేదు.. ఆ పేరు కూడా వాడుకోనంటోన్న విజయ్‌ సేతుపతి కుమారుడు

*******************************

*Natural Star Nani: సినిమా అనేది నిజంగా నా ఊపిరి.. దానిపై ప్రామిస్ చేస్తున్నా..

******************************

Updated Date - 2023-11-25T22:09:08+05:30 IST