Naga Chaitanya: నా జీవితంలో చెన్నై కీలక పాత్ర పోషించింది

ABN , First Publish Date - 2023-05-07T13:23:10+05:30 IST

తన ఎదుగుదలతో పాటు జీవితంలో చెన్నై నగరానిది కీలక పాత్ర అని టాలీవుడ్‌ హీరో నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. ఆయన తమిళంలో పరిచయమవుతూ

Naga Chaitanya: నా జీవితంలో చెన్నై కీలక పాత్ర పోషించింది
Naga Chaitanya Akkineni

తన ఎదుగుదలతో పాటు జీవితంలో చెన్నై నగరానిది కీలక పాత్ర అని టాలీవుడ్‌ హీరో నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. ఆయన తమిళంలో పరిచయమవుతూ కోలీవుడ్‌ దర్శకుడు వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ’ (Custody). కృతిశెట్టి (Krithi Shetty) హీరోయిన్‌. ఇళయరాజా (Ilaiyaraaja), యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) సంగీతం అందించారు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను తాజాగా చెన్నైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ చెన్నై తన జీవితంలో చాలా కీలక పాత్ర వహించిందని చెప్పుకొచ్చారు.

ఇంకా చైతూ మాట్లాడుతూ.. ‘కస్టడీ’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడం సంతోషంగా ఉంది. రెండేళ్ళ కిత్రం వెంకట్‌ ప్రభు స్టోరీ చెప్పినపుడు ఎలాంటి అనుభూతికి లోనయ్యానో రిలీజ్‌కు ముందు కూడా అలాంటి ఎగ్జైట్‌మెంట్‌కు లోనవుతున్నాను. బాల్యం నుంచి అరవింద్‌స్వామి (Arvind Swami)ని చూస్తూ పెరిగాను. ఇపుడు కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా. కృతిశెట్టితో నాకు ఇది రెండో చిత్రం. బ్లాక్‌ బస్టర్‌ మూమెంట్‌ ఇళయరాజా సంగీతం అందించడం. వెంకట్‌ ప్రభు అంటే యువన్‌ శంకర్‌ సంగీతం. ఇపుడు ఇళయరాజా, యువన్‌లు కలిసి సంగీతం అందించిన చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు.

Chaitu.jpg

కృతిశెట్టి మాట్లాడుతూ.. ఇది వెంకట్‌ ప్రభు బాణీ సినిమా కాదు. కొత్తకోణంలో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఇళయరాజా - యువన్‌తో కలిసి ఒక సినిమా చేయాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. నాకు ఈ చిత్రంతో నెరవేరిందని తెలిపింది. దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ.. నాకు తొలి తెలుగు చిత్రం. నాగచైతన్యకు తొలి తమిళ చిత్రం. నా దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన తొలి చిత్రం. నా చిత్రాలన్నీ వినోదాత్మకంగా ఉంటాయి. కానీ ఇది పూర్తిభిన్నంగా ఉంటుంది. అరవింద్‌స్వామి, శరత్‌కుమార్‌, ప్రియమణికి ధన్యవాదాలు. నా చిత్రంలో ఇళయరాజా పేరు రావాలన్నది నా సుధీర్ఘ కల. అది ఈ సినిమాతో నెరవేరిందని తెలిపారు. కాగా.. శ్రీనివాస సిల్వర్‌ స్ర్కీన్‌ (Srinivasaa Silver Screen) బ్యానర్‌పై పవన్‌ కుమార్‌ సమర్పణలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి (Srinivasaa Chitturi) ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?

*Pic Talk: చందురుని మించు అందమొలికించు...

*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను

*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!

*Ramabanam Film Review: అన్నదమ్ముల కథన్నారు, కానీ తీరా చూసాక...

*Bhumika Chawla: హీరోల వయసుపై భూమిక కామెంట్స్.. ఏం మారలేదు

Updated Date - 2023-05-07T13:23:10+05:30 IST