KH234: కమల్ హాసన్, మణిరత్నం సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

ABN , First Publish Date - 2023-01-01T16:26:04+05:30 IST

అన్ని పాత్రలను అవలీలగా పోషించే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). అభిమానులందరు ముద్దుగా విశ్వ నటుడు అని పిలుస్తుంటారు. కమల్, మణిరత్నం (Mani Ratnam) కలసి 35ఏళ్ల తర్వాత సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

KH234: కమల్ హాసన్, మణిరత్నం సినిమాలో హీరోయిన్ ఫిక్స్!

అన్ని పాత్రలను అవలీలగా పోషించే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). అభిమానులందరు ముద్దుగా విశ్వ నటుడు అని పిలుస్తుంటారు. కమల్, మణిరత్నం (Mani Ratnam) కలసి 35ఏళ్ల తర్వాత సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్‌గా ‘కెహెచ్234’ (KH234) అని వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్టును రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ పిక్చర్స్ కలసి నిర్మించనున్నాయి. ఈ మూవీ షూటింగ్ 2023 రెండో అర్ధభాగంలో ప్రారంభం కానుంది. 2024లో వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ కోలీవుడ్ మీడియాలో షికార్లు కొడుతుంది.

‘కెహెచ్234’ లో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటించనుందని రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మణిరత్నం ఆమెకు లైన్‌ను ఇప్పటికే వినిపించాడని సమాచారం. త్రిష ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్టు వదంతులు షికార్లు కొడుతున్నాయి. కానీ, కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని తెలుస్తోంది. మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటనను వెలువరించనున్నారట. త్రిష గతంలో కమల్‌తో రెండు సినిమాలు చేసింది. ‘మన్మథ బాణం’, ‘చీకటి రాజ్యం’ లో హీరోయిన్‌గా నటించింది. ఒకవేళ త్రిష కనుక హీరోయిన్‌గా ఎంపికయితే కమల్‌తో ఆమె చేయబోయే మూడో సినిమా అవుతుంది. ఇక త్రిష కెరీర్ విషయానికి వస్తే..‘రాంగీ’ (Raangi)లో తాజాగా నటించింది. శరవణన్ తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. డిసెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సంపాదించుకుంది. ‘దళపతి 67’, ‘ఎకె 62’ లోను ఆమె హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని హీరోయిన్ ఒరియెంటేడ్ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ‘కెహెచ్234’ డైరెక్టర్ మణిరత్నం ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ అనంతరం కమల్ హాసన్‌తో తెరకెక్కించే సినిమాపై మణిరత్నం పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తాడు.

Updated Date - 2023-01-01T16:33:17+05:30 IST