Mansoor Ali Khan: మీ మీదే త్రిష కేసు పెట్టాలి.. కొత్త మలుపు తిరిగిన మన్సూర్ కేసు
ABN , First Publish Date - 2023-12-11T22:29:37+05:30 IST
మన్సూర్ అలీఖాన్, త్రిషల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వాగ్వాదం ఈ రోజు మరో మలుపు తీసుకుంది. త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో చిరంజీవి , త్రిష, ఖుష్బూ లపై కేసు వేసిన మన్సూర్ నష్ట పరిహారం కూడా ఇప్పించాలంటూ కోరాడు. ఈ రోజు (సోమవారం) మద్రాస్ హైకోర్టులో కేసు విచారణకు రాగా న్యాయమూర్తి మన్సూర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మన్సూర్ అలీఖాన్ (MansoorAliKhan), త్రిష (Trisha)ల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న వాగ్వాదం ఈ రోజు మరో మలుపు తీసుకుంది. త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో చిరంజీవి (Chiranjeevi) , త్రిష, ఖుష్బూ (Khushboo)లపై కేసు వేసిన మన్సూర్ నష్ట పరిహారం కూడా ఇప్పించాలంటూ కోరాడు. ఈ రోజు (సోమవారం) మద్రాస్ హైకోర్టులో కేసు విచారణకు రాగా న్యాయమూర్తి మన్సూర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వే అసభ్యంగా మాట్లాడి, ఆపై క్షమాపణలు చెప్పి, మళ్లీ రివర్స్ వారిపై కేసు పెడతావా అంటూ మద్రాస్ హైకోర్టు (Madras HC) సీరియస్ అయింది.
అంతే కాకుండా మన్సూర్ మటలు, ఆయన చర్యలు తరుచూ వివావాస్పదంగానే ఉంటున్నాయని వాటిని ఆయన తన నైజం అన్నట్లుగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. ముందు సమాజంతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలని, అసలు ఆయనతో బాధింపబడ్డ త్రిష (Trisha) కేసు పెట్టాలి గానీ మన్సూర్ కేసు పెట్టడం సహేతుకం కాదని అన్నారు. ఓ దశలో ఆయన తరుపు లాయర్‌ను కూడా కోర్టు ఆక్షింతలు వేసినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉండగా జడ్జి ఓ వైపు మన్సూర్, అతని లాయర్‌పై సీరియస్ అయినప్పటికీ ఆ లాయర్ తన వాదనలు వినిపిస్తూ మన్సూర్ నిర్దోషి అని సదరు ఇష్యూకు సంబంధించిన అసలు వీడియోను పూర్తిగా విని మన్సూర్‌పై వ్యాఖ్యలు చేస్తూ చేసిన పోస్టులను తొలగింపజేసేలా వారికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. అయితే త్రిష (Trisha), చిరంజీవి (Chiranjeevi), ఖుష్బూ (Khushboo)లు ఈ విషయంలో తమ స్టేట్‌మెంట్స్ ఇవ్వాలని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టు కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది.