Lyca Productions: మరో పాన్ ఇండియా సినిమా

ABN , First Publish Date - 2023-04-03T20:03:32+05:30 IST

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions). ‘2.o’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమాలు ఈ సంస్థ నుంచి వచ్చినవే. ఒకవైపు సినిమాల‌ను నిర్మిస్తూనే డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోనూ ఈ సంస్థ రాణిస్తోంది.

Lyca Productions: మరో పాన్ ఇండియా సినిమా

భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions). ‘2.o’, ‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమాలు ఈ సంస్థ నుంచి వచ్చినవే. ఒకవైపు సినిమాల‌ను నిర్మిస్తూనే డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోనూ ఈ సంస్థ రాణిస్తోంది. విభిన్న, వైవిధ్యభరితమైన చిత్రాలను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్: చాప్ట‌ర్ 1’ తాజాగా లైకా ప్రొడక్ష‌న్స్ నుంచి రాబోతున్న‌ క్రేజీ చిత్రాల జాబితాలోకి చేరింది.

‘మిషన్: చాప్ట‌ర్ 1’ లో కోలీవుడ్ స్టార్ అరుణ్ విజ‌య్ (Arun Vijay) హీరోగా న‌టించారు. అమీ జాక్సన్ (Amy Jackson) హీరోయిన్ పాత్రను పోషించారు. ఈ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. విల‌క్ష‌ణ‌ ద‌ర్శ‌కుడు విజ‌య్ తెరకెక్కించారు. ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌. స్వాతి నిర్మాత‌లుగా వ్యవహరించారు. లైకా ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనుంది. మూవీకి సంబంధించిన ట్రైలర్, ఆడియో, రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ‘మిషన్: చాప్ట‌ర్ 1’ ను కేవ‌లం 70 రోజుల్లోనే మేకర్స్ పూర్తి చేశారు. లండ‌న్‌, చెన్నైతో స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించారు. మాలీవుడ్‌కు చెందిన విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ ప్రాజెక్టులో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జీవీ. ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

‘మిషన్: చాప్ట‌ర్ 1’ కోసం లండ‌న్ జైలును పోలి ఉండేలా చెన్నైలో భారీగా ఖ‌ర్చుతో ఓ సెట్‌ను వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్రఫర్‌గా పని చేశారు. ఆయ‌న కొరియోగ్రఫ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని అందిస్తాయి. కఠినతరమైన యాక్ష‌న్ సీన్స్‌ను హీరో అరుణ్ విజ‌య్ సొంతంగా చేయడం విశేషం. లైకా చేతిలో ప్రస్తుతం అనేక భారీ బడ్జెట్ చిత్రాలున్నాయి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’, ‘ఇండియన్ 2’ ఈ సంస్థ నుంచి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Nani-Balakrishna: నానికి 35.. బాలకృష్ణకు 36

Janhvi Kapoor: స్టేజ్‌పై డ్యాన్స్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

Dasara: సీన్‌ను తొలగించాలని డిమాండ్.. థియేటర్స్ వద్ద ధర్నా..

Koffee With Karan: భార్యతో కలిసి రావాలంటూ సౌత్ స్టార్ హీరోలకు పిలుపు.. బుక్ చేస్తాడేమో చూసుకోండి..

Web Series: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా..?

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Updated Date - 2023-04-03T20:03:34+05:30 IST