Lokesh Kanagaraj: భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన లోకేశ్, విజయ్ సినిమా.. ఎన్ని కోట్లంటే..?
ABN , First Publish Date - 2023-02-02T20:24:53+05:30 IST
‘విక్రమ్’ (Vikram) వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేశ్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కావడంతో మూవీపై భారీ బజ్ ఉంది. అందుకు తగ్గట్టు గానే ఈ మూవీ ప్రొమో కూడా విడుదలవ్వక ముందే ముందే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది.
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు ఇళయ దలపతి విజయ్ (Ilayathalapathy Vijay). ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘దళపతి 67’ అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. పాన్ ఇండియాగా రూపొందిస్తుంది. ‘విక్రమ్’ (Vikram) వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేశ్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కావడంతో మూవీపై భారీ బజ్ ఉంది. అందుకు తగ్గట్టు గానే ఈ మూవీ ప్రొమో కూడా విడుదలవ్వక ముందే ముందే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. ఆడియో, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అన్నింటికి కలిపి రూ.250కోట్లకు పైగా వచ్చాయి.
‘దళపతి 67’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ రైట్స్ కోసం భారీ ధర చెల్లించింది. దాదాపుగా రూ.160కోట్లను చెల్లించి ఈ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని భాషలకు కలపి ఇంత భారీ ధర చెల్లించిందని తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్‌ను సన్ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఈ రైట్స్ కోసం రూ.80కోట్లను చెల్లించిందని సమాచారం. మ్యూజిక్ రైట్స్‌ను సోనీ సంస్థ కైవసం చేసుకుంది. ఈ రైట్స్ కోసం రూ.16కోట్లను చెల్లించిందని కోలీవుడ్ మీడియా తెలుపుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అన్ని చిత్రాల ఆడియో రైట్స్‌ను సోనీ మ్యూజికే దక్కించుకుంటుంది. అదే బాటలో పయనిస్తూ ‘దళపతి 67’ ఆడియో రైట్స్‌ను ఈ కంపెనే సొంతం చేసుకుంది. ‘దళపతి 67’ టైటిల్‌ను ఫిబ్రవరి 3న ప్రకటించనున్నారు. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ మీనన్, మిస్కిన్, అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.