Producer: ‘పాపాలు చేసే వారే సినిమాలు తీస్తారు’

ABN , First Publish Date - 2023-03-23T09:21:52+05:30 IST

సినిమా తీయడం అనేది చాలా కష్టమైన విషయం అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిర్మాతకి అది మరింత కష్టం.

Producer: ‘పాపాలు చేసే వారే సినిమాలు తీస్తారు’
Kollywood

సినిమా తీయడం అనేది చాలా కష్టమైన విషయం అని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా నిర్మాతకి అది మరింత కష్టం. నటీనటులు, దర్శకులు నుంచి టెక్నిషీయన్స్‌ అందరినీ కలిపి ఉంచగలగాలి. డబ్బు పెట్టాలి. ఎంత కష్టపడ్డా మూవీ ఎలా వస్తుందో తెలియదు. విడుదల తర్వాత విజయం సాధించి పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలను తెచ్చిపెడుతుందా. లేక నష్టాల పాలు చేస్తుందా తెలియదు. గతంలో అలా గొప్ప సినిమాలు, మంచిగా బతికిన పలువురు నిర్మాతలు.. వారి చివరి అంకంలో మాత్రం నష్టపోయి.. దాదాపు రోడ్డు మీదకి వచ్చేశారు. ఈ తరుణంలో సినిమా నిర్మాణం గురించి ప్రముఖ తమిళ నిర్మాత కె.రాజన్ (K.Rajan) సంచలన వ్యాఖ్యలు చేశారు. (Kollywood Producer)

ఈ కాలంలో ఒక సినిమా నిర్మించడం కంటే శిక్ష మరొకటి లేదని నిర్మాత కె.రాజన్‌ అన్నారు. పాపం చేసేవాళ్లే సినిమా తీస్తారు అనే సామెత కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఆర్‌.కన్నన్‌ (R.Kannan) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కాసేదాన్‌ కడవులడా’(Kasethan Kadavulada). మిర్చి శివ (Mirchi Shiva), ప్రియా ఆనంద్‌ (Priya Anand), యోగిబాబు (Yogibabu) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ త్వరలో విడుదలకి సిద్ధమవుతోంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌ని చిత్రబృందం జోరుగా సాగిస్తోంది. ఈ తరుణంలో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్మాత కె.రాజన్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఏ సినిమా సక్సెస్‌ అవుతుందో.. ఏది ఫ్లాప్‌ అవుతుందో తెలియదు. కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు. దీనికి నిదర్శనమే ‘లవ్‌ టుడే’. హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తే ఖచ్చితంగా ఫ్లాప్‌ అవుతాయి. మంచి కథా బలంతో చిత్మాలు నిర్మించడంపై దర్శక నిర్మాతలు దృష్టి సారించాలి’ అని సలహా ఇచ్చారు.

దర్శకుడు ఆర్‌.కన్నన్‌ మాట్లాడుతూ... ‘ఈ చిత్రం గతంలో వచ్చిన ‘ఉల్లత్తై అళ్లిత్తా’, ‘పంబల్‌ కె.సంబంధం’ వంటి చిత్రాల తరహాలో సరాదాగా సాగిపోతుంది. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి నెలా ఒక్కొక్క సినిమా విడుదల చేయడం సామాన్యమైన విషయం కాదు’ అని అన్నారు. హీరో మిర్చి శివ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా టైటిల్‌ ప్రతి ఒక్కరికి జీవితాలకు అతికినట్టుగా ఉంటుంది. దర్శకుడు ఆర్‌.కన్నన్‌ ఒక నిర్మాతగా భారాన్ని మోయకుండా దర్శకత్వంపైనే దృష్టి సారించాలని కోరుతున్నా’ అని అన్నారు. నిర్మాత కార్తికేయన్‌ మాట్లాడుతూ.. ‘1972లో ఇదే పేరుతో ఏవీఎం నిర్మాణ సంస్థ పెద్ద తారాగణంతో ఒక సినిమా నిర్మించింది. ఇపుడు ఇదే పేరుతో సినిమా తీయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. అలాగే, సంగీత దర్శకుడు రాజ్‌ ప్రతాప్‌, ఎడిటర్‌ సూర్య, నిర్మాత కార్తికేయన్‌ తదితరులు మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

Kota Srinivasa Rao: ఇలా చేస్తే గుండె ఆగిపోతుంది.. మరణ వార్తలపై స్పందించిన కోటా

Adipurush: ఓంరౌత్ మేలుకో.. ట్రెండింగ్‌లో ప్రభాస్ మూవీ..

Niharika Konidela: అలా చేయడం దేనికి సంకేతం.. భర్తతో విబేధాలు వచ్చాయా?

Allu Arjun: హీరోయిన్‌ని బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్.. నటి ట్వీట్ చేయడంతో..

LEO: మళ్లీ కలుసుకుందాం.. సార్‌

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్‌ని విడుదల చేస్తే.. ఆ పొలిటీషియన్ తగులబెడతానన్నారు’

#GlobalStarNTR: ‘అవెంజర్స్’లో ఎన్టీఆర్!.. పోస్ట్ వైరల్

Oscars to RRR: నేను అవార్డులని నమ్మను.. అలా చేస్తే ఆస్కార్ వాళ్ల దురదృష్టమవుతుందంటున్న ఆర్జీవీ

Updated Date - 2023-03-23T09:21:53+05:30 IST